నయన్ కెరీర్లోనే మొదటిసారి ఇలా!
పెళ్లి అయినప్పటికీ నయన్ క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. మునుపటి లానే సినిమాలు చేస్తూ కెరీర్ లో ముందుకు దూసుకెళ్తుంది.
By: Tupaki Desk | 14 May 2025 12:00 PM ISTసౌత్ ఇండియన్ సినిమాలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది నయనతార. లేడీ సూపర్ స్టార్ గా ప్రశంసలు అందుకుంటున్న నయనతార చాలా కాలంగా ఎంతో డిమాండ్ ఉన్న హీరోయిన్లలో ఒకరిగా గుర్తింపు సొంతం చేసుకుంది. పలు సక్సెస్‌ఫుల్ సినిమాలు, మంచి ట్రాక్ రికార్డుతో నయనతార కమర్షియల్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలుగుతోంది.
పెళ్లి అయినప్పటికీ నయన్ క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. మునుపటి లానే సినిమాలు చేస్తూ కెరీర్ లో ముందుకు దూసుకెళ్తుంది. స్టార్ హీరోయిన్ గా సత్తా చాటుతూ అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకునే హీరోయిన్ గా కొనసాగుతున్న నయన్ ఇప్పుడు తీసుకున్న ఓ నిర్ణయం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
అనిల్ రావిపూడి డైరెక్టర్ గా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న తెలుగు సినిమా కోసం నయనతార తన రెమ్యూనరేషన్ ను ఎవరూ ఊహించని విధంగా తగ్గించిందని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. మలయాళ సినిమాతో ఇండస్ట్రీకి అడుగుపెట్టి హీరోయిన్ గా కెరీర్ ను స్టార్ట్ చేసింది నయనతార.
అప్పట్నుంచి తమిళ, తెలుగు సినిమాలతో పాటూ మొన్నామధ్య జవాన్ సినిమాలో షారుఖ్ తో కలిసి బాలీవుడ్ లో ఎంటరై అక్కడ కూడా భారీ అభిమానులను సొంతం చేసుకుంది నయన్. తెలుగులో నయనతార చివరిగా గాడ్‌ఫాదర్ సినిమాలో నటించింది. ఆ తర్వాత నయన్ నుంచి మరో తెలుగు సినిమా వచ్చింది లేదు. ఇప్పుడు మళ్లీ మెగాస్టార్ తో కలిసి నయన్ స్క్రీన్ షేర్ చేసుకోబోతుంది.
అయితే ముందుగా ఈ సినిమా కోసం నయనతార రెమ్యూనరేషన్ రూ.18 కోట్లు అని వార్తలొచ్చాయి కానీ ఇప్పుడు ఆఖరిగా ఆమె పారితోషికాన్ని నిర్మాతలు రూ.6 కోట్లకు ఫిక్స్ చేసినట్టు సమాచారం. అయితే సడెన్ గా నయన్ రెమ్యూనరేషన్ తగ్గించడం ఆమె బ్రాండ్ వాల్యూకి దెబ్బ అని కొందరంటుంటే చిరంజీవి సినిమా రీజనల్ మూవీ కాబట్టే నయన్ తక్కువ ఛార్జ్ చేస్తుందని, టాక్సిక్ లాంటి భారీ ప్రాజెక్టులకు ఆమె భారీగానే ఛార్జ్ చేస్తుందని, పలు క్రేజీ ప్రాజెక్టులతో నయన్ మార్కెట్ చాలా స్ట్రాంగ్ గా ఉందని మరికొందరంటున్నారు. ఇదిలా ఉంటే కెరీర్ స్టార్టింగ్ నుంచి రెమ్యూనరేషన్ ను పెంచుకుంటూనే వెళ్తున్న నయన్ తన కెరీర్లో మొదటిసారి రెమ్యూనరేషన్ ను తగ్గించింది.
