నయన్ లో కొత్త ఉత్సాహం.. టాలీవుడ్ నచ్చేసిందా..?
మెగాస్టార్ చిరంజీవి అనిల్ రావిపూడి కాంబినేషన్ సినిమాలో నయనతార ఫిమేల్ లీడ్ గా ఫిక్స్ అయ్యింది.
By: Tupaki Desk | 19 Jun 2025 9:30 AM ISTకోలీవుడ్ స్టార్ హీరోయిన్ నయనతార ఆఫ్టర్ గ్యాప్ మళ్లీ తెలుగు సినిమాలో నటిస్తుంది. మెగాస్టార్ చిరంజీవి అనిల్ రావిపూడి కాంబినేషన్ సినిమాలో నయనతార ఫిమేల్ లీడ్ గా ఫిక్స్ అయ్యింది. ఆల్రెడీ ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. టాలీవుడ్ స్టార్స్ తో ఆల్రెడీ నయన్ నటించింది. 2019 లో చిరుతో సైరా నరసింహా రెడ్డి చేసింది. ఆ తర్వాత గోపీచంద్ తో ఆరడుగుల బుల్లెట్ లో నటించింది.
ఇక కోలీవుడ్ లోనే వరుస సినిమాలు చేస్తుండటం వల్ల అమ్మడు తెలుగులో చేసే వీలు కుదరలేదు. మధ్యలో ఒకటి రెండు ఆఫర్లు వచ్చినా కాదనేసింది. ఐతే చిరంజీవి ఆఫర్ రాగానే రీ ఎంట్రీకి ఇదే కరెక్ట్ టైం అనుకుని మళ్లీ తెలుగు సినిమాను సైన్ చేసింది నయనతార. అదీగాక ఈమధ్య టాలీవుడ్ సినిమాలు పాన్ ఇండియా లెవెల్ లో చేస్తున్న అద్భుతాలు తెలిసిందే. అందుకే నయనతార ఈసారి ఒక పాజిటివ్ సైన్ తోనే టాలీవుడ్ వచ్చింది.
అంతేకాదు ఇక్కడ యూనిట్ రిసీవింగ్.. ఫ్యాన్స్ హంగామా అంతా కూడా ఆమెలో కొత్త ఉత్సాహాన్ని తెచ్చిందని తెలుస్తుంది. చిన్న గ్యాప్ తర్వాత టాలీవుడ్ వచ్చిన నయనతారకి ఇక్కడ ఫ్యాన్స్ నుంచి గ్రాండ్ వెల్కం దొరికింది. అంతేకాదు సినిమాలోకి ఆన్ బోర్డ్ అవుతూనే చేసిన స్పెషల్ వీడియో కూడా సూపర్ హిట్ అయ్యింది. అక్కడ ఉంది అనిల్ రావిపూడి కాబట్టి ఎవరిని ఎలా ఎక్కడ వాడుకోవాలో బాగా తెలుసు.
సాధారణంగా నయనతార షూటింగ్స్ మాత్రమే చేస్తుంది. ప్రమోషన్స్ కి నో అంటుంది. అలాంటిది ఆమెను షూట్ స్టార్ట్ చేయడానికి ముందే ఒక క్రేజీ వీడియో చేసి సినిమాపై మరింత బజ్ పెంచాడు అనిల్. నయన్ వీడియో మెగా ఫ్యాన్స్ తో పాటు కామన్ ఆడియన్స్ కి బాగా నచ్చేసింది. మొత్తానికి నయనతార తిరిగి తెలుగు సినిమాల్లో నటించడం ఆమెకు ఫుల్ ఖుషి అందిస్తుందని తెలుస్తుంది. మరి అమ్మడు ఇక్కడ మరిన్ని సినిమాలు చేస్తుందా లేదా అన్నది చూడాలి. ప్రస్తుతం తమిళ్ లో కూడా బిజీ హీరోయిన్ గా ఉన్న నయనతార తెలుగులో కూడా వరుస సినిమాలు చేయాలని చూస్తుంది. తెలుగు, తమిళ్ మాత్రమేనా హిందీ నుంచి కూడా నయనతారకు ఆఫర్లు వస్తున్నాయని తెలుస్తుంది.
