Begin typing your search above and press return to search.

అప్పటికీ ఇప్పటికీ అమ్మడు అదే డిమాండ్..!

వారానికో సినిమా రిలీజ్ అవుతుంది. అందులో నటించేందుకు హీరోయిన్స్ వస్తున్నారు.

By:  Tupaki Desk   |   3 May 2025 3:00 AM
అప్పటికీ ఇప్పటికీ అమ్మడు అదే డిమాండ్..!
X

వారానికో సినిమా రిలీజ్ అవుతుంది. అందులో నటించేందుకు హీరోయిన్స్ వస్తున్నారు. కానీ వారిలో సక్సెస్ అయ్యే హీరోయిన్స్ మాత్రం చాలా తక్కువ. అలాంటి పరిశ్రమలో తమకంటూ ఒక స్టార్ స్టేటస్ తెచ్చుకుని మెప్పించడం అంటే మామూలు విషయం కాదు. అంతేకాదు ఆ స్టార్ డం ని దశాబ్దాలుగా కొనసాగించడం మరీ కష్టం. అలా స్టార్స్ కి ఏమాత్రం తగ్గని విధంగా తన సత్తా చాటుతూ హీరోయిన్స్ లో చాలా ప్రత్యేకంగా ఉంటుంది కోలీవుడ్ స్టార్ హీరోయిన్ నయనతార.

ఓ పక్క కమర్షియల్ సినిమాల్లో నటిస్తూనే మరోపక్క ఫిమేల్ సెంట్రిక్ సినిమాలతో అదరగొట్టేస్తుంది. కోలీవుడ్ లో ఒకదశలో నయనతార సినిమా వస్తుంది అంటే స్టార్ హీరోలు కూడా భయపడే పరిస్థితి వచ్చింది. ఐతే తమిళ్ తో పాటు తెలుగులో కూడా నయనతార సినిమాలు చేస్తూ వచ్చింది. తెలుగులో స్టార్ హీరోలతో నటిస్తూ అదరగొట్టేస్తుంది.

ఐతే కొన్నాళ్లుగా తమిళ సినిమాలకే పరిమితమైంది నయనతార. ఈమధ్యనే బాలీవుడ్ లో కూడా తన మార్క్ చూపించే ప్రయత్నం చేసింది. షారుఖ్ ఖాన్ జవాన్ లో నటించి బీ టౌన్ ఆడియన్స్ ని మెప్పించింది నయనతార. ఇక ఈమధ్యలోనే ఒక తెలుగు సినిమా కోసం నయనతారని కలిశారట మేకర్స్. అనిల్ రావిపూడి డైరెక్షన్ లో చిరంజీవి చేస్తున్న సినిమాలో హీరోయిన్ గా నయన్ ని తీసుకునే ప్లాన్ లో ఉన్నారట.

చిరుతో ఆల్రెడీ సైరా నరసింహా రెడ్డి, గాడ్ ఫాదర్ సినిమాల్లో నటించింది నయనతార. ఇప్పుడు అనిల్ తో చేసే సినిమాలో కూడా నయన్ నటిస్తుందని టాక్. ఐతే ఈ సినిమాలో నటించేందుకు గాను అమ్మడు 18 కోట్ల దాకా డిమాండ్ చేస్తుందని తెలుస్తుంది. రెమ్యునరేషన్ విషయంలో ఎలాంటి కాంప్రమైజ్ అవ్వని నయన్ అంత ఇస్తేనే సినిమా చేస్తానని అంటుందట. ఐతే నయన్ ఉంటే సినిమాకు మంచి బజ్ వస్తుందని ఆమెతో చర్చిస్తున్నారని తెలుస్తుంది.

మెగా మూవీలో నయన్ కన్ఫర్మ్ అయితే తప్పకుండా సినిమాకు ప్లస్ అవుతుందని చెప్పొచ్చు. చిరుతో నయనతార నటించడం గురించి త్వరలోనే అఫీషియల్ అప్డేట్ వస్తుంది. ఈ సినిమాను 2026 సంక్రాంతికి రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది. సంక్రాంతికి వస్తున్నాం తో 300 కోట్లు కొట్టిన అనిల్ రావిపూడి డైరెక్షన్ లో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఈ సినిమా ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో చూడాలి.