నయన్ దూకుడు తగ్గడానికి రీజన్ అతనేనా..?
ఈ క్రమంలో ధనుష్ వల్ల నయనతారకు అవకాశాలు రాకుండా అవుతున్నాయి.
By: Tupaki Desk | 13 April 2025 7:00 AM ISTకోలీవుడ్ లేడీ సూపర్ స్టార్ నయనతార ఈమధ్య కాస్త దూకుడు తగ్గించిందని చెప్పొచ్చు. బాలీవుడ్ లో జవాన్ సినిమా చేసి సూపర్ హిట్ అందుకున్న నయనతార కోలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తుంది. ఐతే ఎందుకో అమ్మడు ఇదివరకు అంత దూకుడు చూపించలేక పోతుంది. అంతేకాదు స్టార్ సినిమా ఆఫర్లు కూడా చాలా తగ్గిపోయాయి. ఇదివరకు అక్కడ టాప్ స్టార్స్ ఒకరు కాకపోతే మరొకరు నయనతారతో సినిమాలు చేస్తుంటారు.
ఆమె డేట్స్ అడ్జెస్ట్ కాకపోయినా సరే టైం ఇచ్చి మరీ ఆమెను తీసుకునే వారు. కానీ ఇప్పుడు పరిస్థితి చూస్తే అలా లేదు. నయనతారకు అవకాశాలు రాకపోవడం వెనక రీజన్ ఆమె ధనుష్ తో పడిన గొడవే అన్న టాక్ ఉంది. నయనతార పెళ్లి డాక్యుమెంటరీ పై ధనుష్ కేసు వేయడంపై తిరిగి నయన్ కూడా అదే రేంజ్ లో ఎటాకింగ్ కి దిగింది.
ఐతే ఇక్కడ తప్పు ఎవరిది అన్నది పక్కన పెడితే నయన్ ధనుష్ మధ్య ఉన్న దూరం ఆడియన్స్ కు తెలిసింది. ఈ క్రమంలో ధనుష్ వల్ల నయనతారకు అవకాశాలు రాకుండా అవుతున్నాయి. కారణం అతనా కాదా అన్నది పక్కన పెడితే ధనుష్ తో నయన్ గొడవ ఆమె కెరీర్ మీద ఎఫెక్ట్ పడేలా చేసిందని చెప్పొచ్చు. ధనుష్ తో నయనతార కూడా కలిసి నటించింది. వాళ్లిద్దరు కలిసి నటించినప్పుడు ఎలాంటి గొడవలు లేవు.
ఎప్పుడైతే ధనుష్ నిర్మాణంలో చేసిన నాన్ రౌడీ ధాన్ సినిమా క్లిప్ ని తన డాక్యుమెంటరీలో వాడిందో అప్పటి నుంచి ఆమెకు ధనుష్ తో దూరం పెరిగింది. ఇద్దరు ఎదురుపడ్డా పలకరించుకోలేనంతగా పరిస్థితులు వచ్చాయి. ఇలా స్టార్ హీరో స్టార్ హీరోయిన్ ఫైట్ పరిశ్రమకు మంచిది కాదని తెలిసినా కూడా వాళ్లు దాన్ని కొనసాగిస్తున్నారు.
ఇక ఇదే దారిలో నయనతారకు రావాల్సిన అవకాశాలు కూడా కొన్ని మిస్ అవుతున్నట్టు తెలుస్తున్నాయి. మరి నయనతార ధనుష్ మధ్య ఈ డిస్టన్స్ ని ఎవరు దగ్గర చేస్తారన్నది చూడాలి. ఎవరికి వారు తమ సినిమాలు చేస్తూ ఉన్నా కూడా నయనతార కెరీర్ లో స్పీడ్ తగ్గిందన్నది మాత్రం ప్రత్యక్షంగా కనిపిస్తుంది.
