Begin typing your search above and press return to search.

సినిమాలతో పాటు పెట్టుబడుల్లోనూ నయన్ సూప‌ర్ స్ట్రాటజీ

ఇదే ఏరియాలోనే సూపర్‌స్టార్ ర‌జినీకాంత్ కూడా నివ‌సిస్తుండ‌టం వ‌ల్ల ఈ ప్రాంతానికి ప్ర‌త్యేక గుర్తింపు కూడా ఉంది.

By:  Sravani Lakshmi Srungarapu   |   6 March 2026 12:26 PM IST
సినిమాలతో పాటు పెట్టుబడుల్లోనూ నయన్ సూప‌ర్ స్ట్రాటజీ
X

సౌత్ సినీ ఇండ‌స్ట్రీలో మోస్ట్ స‌క్సెస్‌ఫుల్ హీరోయిన్లలో ఒకరైన న‌య‌న‌తార కేవలం సినిమాల్లోనే కాదు, పెట్టుబడుల విషయంలో కూడా ఎంతో వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నారనే విషయం మరోసారి స్పష్టమైంది. ఆమె భర్త, డైరెక్ట‌ర్ విఘ్నేష్ శివ‌న్ తో కలిసి చెన్నైలోని అత్యంత ప్రీమియం ఏరియాల్లో ఒకటైన పోయెస్ గార్డెన్ లో ల‌గ్జ‌రీ డూప్లెక్స్ అపార్ట్‌మెంట్‌ను కొనుగోలు చేసిన‌ట్టు తెలుస్తోంది. ఇదే ఏరియాలోనే సూపర్‌స్టార్ ర‌జినీకాంత్ కూడా నివ‌సిస్తుండ‌టం వ‌ల్ల ఈ ప్రాంతానికి ప్ర‌త్యేక గుర్తింపు కూడా ఉంది.

ఈ డూప్లెక్స్ అపార్ట్‌మెంట్ చెన్నైలోని తేనాంపేట్ ఏరియాలో ఉన్న లెగ‌సీ ప్రాజెక్టులో నాలుగు, ఐదో అంత‌స్తుల్లో ఉంది. మొత్తం 14,369 చ‌ద‌ర‌పు అడుగుల బిల్ట‌ప్ ఏరియాతో పాటూ, 5,308 చ‌ద‌ర‌పు అడుగుల ల్యాండ్ షేర్ వాటా కూడా ఇందులో ఉంది. ఒక్కో చ‌ద‌ర‌పు అడుగుకు సుమారు రూ.7.21 ల‌క్ష‌ల ధ‌ర‌కు న‌య‌న్ ఈ ప్రాప‌ర్టీని కొన్న‌ట్టు తెలుస్తోంది. ఈ డూప్లెక్స్ విల్లాకు సంబంధించిన రిజిస్ట్రేష‌న్ గ‌తేడాది డిసెంబ‌ర్ 15న పూర్త‌వ‌గా, ల్యాండ్ మార్క్ మెట్రో ప్రాజెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి ఆమె దీన్ని కొనుగోలు చేసిన‌ట్టు తెలుస్తోంది.

ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ లో భాగంగానే!

ఈ ప్రాప‌ర్టీలో మొత్తం న‌య‌నతార‌కు 90% షేర్ ఉండ‌గా, త‌న భ‌ర్త విఘ్నేష్ కు 10% షేర్ ఉంది. ఈ ఇంటిని ఆమె కేవ‌లం ఓ ఇల్లులా మాత్ర‌మే కాకుండా, ఫ్యూచ‌ర్ ఇన్వెస్ట్‌మెంట్ లాగా ప్లాన్ చేసుకున్నట్టు రియ‌ల్ ఎస్టేట్ నిపుణులు భావిస్తున్నారు. చెన్నైలోని పోయెస్ గార్డెన్ గ‌త కొన్నేళ్లుగా ప్రీమియం రియ‌ల్ ఎస్టేట్ మార్కెట్ గా నిల‌వ‌గా, అక్క‌డి ప్రాప‌ర్టీల వాల్యూ రోజురోజుకీ విప‌రీతంగా పెరుగుతుండ‌టం వ‌ల్ల సెల‌బ్రిటీలు అక్క‌డ ఇన్వెస్ట్ చేయ‌డానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.

ప‌లు ప్ర‌ధాన న‌గ‌రాల్లో న‌య‌న్ కు ఇళ్లు

న‌య‌న‌తార కూడా ఆ ద‌శలో దీనిపై ఇన్వెస్ట్ చేశార‌ని, ఇప్ప‌టికే ఆమెకు హైద‌రాబాద్, చెన్నై, కొచ్చి లాంటి ప్ర‌ధాన న‌గరాల్లో ప‌లు ల‌గ్జ‌రీ ఇళ్లున్నాయి. హైద‌రాబాద్ లోని బంజారా హిల్స్ లో ఆమెకు రెండు ల‌గ్జ‌రీ అపార్ట్‌మెంట్స్ ఉన్నాయ‌ని, వాటి విలువ ఒక్కోటి రూ.15 కోట్ల‌కు పైగా ఉంటుందని, కేర‌ళ‌లోని ఇళ్లు కూడా ఆ రాష్ట్రంలోని అత్యంత విలాస‌వంత‌మైన ప్రైవేట్ ఇళ్లుగా చెప్తుంటారు.

న‌టిగా బిజీగా కొన‌సాగుతున్న న‌య‌న్, కెరీర్లో మంచి ఆదాయం ఉన్న టైమ్ లోనే ఇలాంటి ఇన్వెస్ట్‌మెంట్స్ చేయాల‌ని ప్లాన్ చేసుకుని ముందుకెళ్తున్నారు. లాంగ్ ట‌ర్మ్ ఇన్వెస్ట్‌మెంట్స్ లో పెట్టుబ‌డి పెట్ట‌డం సెల‌బ్రిటీల ప్లాన్ లో భాగ‌మే అయిన‌ప్ప‌టికీ, న‌య‌న్ దాన్ని మ‌రింత ప్లాన్డ్ గా అమ‌లు చేస్తున్న‌ట్టు క‌నిపిస్తోంది. ఫ్యూచ‌ర్ లో ఆస్తుల విలువ పెర‌గ‌డంతో పాటూ స్థిర‌మైన సంప‌ద నిర్మాణం కూడా ఆమె టార్గెట్ గా పెట్టుకున్న‌ట్టు తెలుస్తోంది. ఇక సినిమాల విష‌యానికొస్తే ఆమె పేట్రియాట్, టాక్సిక్ సినిమాలతో పాటూ బాల‌కృష్ణ‌తో ఓ సినిమాలో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే.