Begin typing your search above and press return to search.

విడాకుల పుకార్ల‌కు తెలివిగా చెక్ పెట్టారు!

నయనతార -విఘ్నేష్ శివన్ జంట విడిపోతోందంటూ ఒక పుకార్ వైర‌ల్ అవ్వ‌డంతో అభిమానులు క‌ల‌త చెందిన సంగ‌తి తెలిసిందే

By:  Tupaki Desk   |   9 March 2024 5:38 PM GMT
విడాకుల పుకార్ల‌కు తెలివిగా చెక్ పెట్టారు!
X

నయనతార -విఘ్నేష్ శివన్ జంట విడిపోతోందంటూ ఒక పుకార్ వైర‌ల్ అవ్వ‌డంతో అభిమానులు క‌ల‌త చెందిన సంగ‌తి తెలిసిందే. కోలీవుడ్ లో ఎంతో అన్యోన్యంగా ఉండే ఈ జంటపై పుట్టుకొచ్చిన ఆక‌స్మిక పుకార్ ఊహించ‌నిది. ఇన్ స్టాలో త‌న భ‌ర్త‌ను న‌య‌న‌తార అన్ ఫాలో చేయ‌డంతో ఇది పుట్టుకొచ్చింది. కానీ ఇంత‌లోనే న‌య‌న్ తిరిగి విఘ్నేష్ ని ఫాలో చేసింది. ఇంతలోనే ఈ జంట కూడా బ్రేక‌ప్ అవుతోందంటూ కొన్ని మీడియాలు క‌థ‌నాలు ప్ర‌చురించాయి.

అయితే అన్ని త‌ప్పుడు వార్త‌ల‌కు చెక్ పెట్టేందుకు ఈ జంట చేసిన ప్ర‌య‌త్నం ఆస‌క్తిక‌రం. తాజాగా ఈ జోడీ సౌదీ అరేబియా పర్యటన నుండి ఫోటోలు, వీడియోలను షేర్ చేస్తున్నారు. సౌదీ అరేబియా జెడ్డాలోని గ్రాండ్ ప్రిక్స్ కోసం ఈ అంద‌మైన‌ దంపతులు తమ కుమారులు ఉయిర్ - ఉల్ఘమ్‌లతో కలిసి వెళ్లారు.

నయనతార పిల్లల కౌగిలి

తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో విఘ్నేష్ ఒక క్లిప్‌ను షేర్ చేసాడు. వెనుక సీటులో నయనతార తన కొడుకులను తన చేతుల్లో పట్టుకుని వారి తలలను ఆప్యాయంగా నిమురుతోంది. పిల్లలిద్దరూ ఒక‌రితో ఒక‌రు సరిపోలే క‌వ‌ల దుస్తులను ధరించారు. తెలుపు టీ షర్టులు- పసుపు ప్యాంటు ధ‌రించి ఈ జంట క‌నిపించారు.

సౌదీ అరేబియా గ్రాండ్‌ప్రీలో సంద‌డి:

నయనతారతో కలిసి సౌదీ అరేబియా గ్రాండ్‌ప్రీ ఈవెంట్ కి హాజరైన విఘ్నేష్ కొన్ని లైవ్ క్లిప్‌లను కూడా షేర్ చేసాడు. అతడు న‌య‌న్ తో పాటు బాల్కనీలో నిలబడి ప‌రిస‌రాల‌ను వీక్షిస్తున్న ఫోటో వైర‌ల్ గా మారింది. తన దగ్గర ఉన్న స్పీడ్ కెమెరా వీడియోను పోస్ట్ చేసి .. సూపర్ స్పీడ్‌ఫ్లై క్యామ్ వేగంతో మరింత ఆకర్షితుడన‌య్యాన‌ని తెలిపాడు. ఈ ఫోటోల్లో న‌య‌న్- విఘ్నేష్ రొమాంటిక్ ఫోజులు ఆక‌ర్షించాయి. ఒక ఫోటోలో విఘ్నేష్ కొద్దిసేపు న‌య‌న్ భుజంపై తల ఆన్చి రిలాక్స్ అవుతున్నాడు.

నయనతార- విఘ్నేష్ కలిసి త‌మ విలువైన‌ సమయం ఆస్వాధిస్తున్నారు. ఈ జంట‌ చేయి చేయి పట్టుకుని నడుస్తున్న ఫోటో కూడా ఎంతో ఆకట్టుకుంది. ఆ ఇద్దరూ ముదురు రంగు సన్ గ్లాసెస్ ధరించారు.

మహిళా దినోత్సవం సందర్భంగా నయనతారకు విఘ్నేష్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రయాణం మధ్య కూడా విఘ్నేష్ భార్య‌నుద్ధేశించి ఒక పోస్ట్‌తో శుభాకాంక్షలు తెలిపారు. అతడు తన భార్య రెస్టారెంట్ లోపల కూర్చున్న ఫోటోలను వరుసగా షేర్ చేశాడు. పెద్దయ్యాక రెండు విషయాలు... మహిళా దినోత్సవ శుభాకాంక్షలు .. నా అందమైన ప్రేమగల బంగారు మహిళ!'' అని రాసాడు. దీనికి రిప్లై ఇస్తూ ''నన్ను ఈ రోజు మహిళగా మార్చినందుకు ధన్యవాదాలు.. అని న‌య‌న‌తార ఫ‌న్ నోట్ లో రాసారు. త‌న క‌వ‌ల‌ల నుద్దేశించి వ్యాఖ్యానిస్తూ... నా అబ్బాయిలతో ప్రయాణం చేస్తున్నాను.. చాలా కాలం తర్వాత (రెడ్ హార్ట్ ఎమోజీలు) అని రాసింది. విఘ్నేష్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో ఈ ఫోటోని కూడా రీపోస్ట్ చేశాడు. వ‌రుస‌ పోస్ట్‌లతో తమపై విడాకుల పుకార్లను తెలివిగా కొట్టిపారేశారు.