Begin typing your search above and press return to search.

భ‌ర్త కోసం న‌య‌న‌తార త్యాగం పెద్దదే!

లేడీ సూప‌ర్ స్టార్ న‌య‌న‌తార స్టార్ డ‌మ్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. కోట్ల రూపాయలు పారితోషికం తీసుకుంటోన్న హీరోయిన్.

By:  Tupaki Desk   |   6 Dec 2023 6:21 AM GMT
భ‌ర్త  కోసం న‌య‌న‌తార త్యాగం పెద్దదే!
X

లేడీ సూప‌ర్ స్టార్ న‌య‌న‌తార స్టార్ డ‌మ్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. కోట్ల రూపాయలు పారితోషికం తీసుకుంటోన్న హీరోయిన్. కోలీవుడ్ లోనే నెంబ‌వ‌ర్ వ‌న్ హీరోయిన్ గా దూసుకుపోతుంది. టాలీవుడ్ ని ఏలి ఇటీవ‌లే బాలీవుడ్ లోనూ అడుగు పెట్టింది. `జ‌వాన్` సినిమాతో భారీ విజ‌యం అందుకుని అక్క‌డా సంచ‌ల నంగా మారింది. న‌య‌న‌తార ఒకే చెప్పాలేగానీ స్టార్ హీరోలంతా ఆమెతో న‌టించ‌డానికి సిద్దంగా ఉన్నారు. బ‌డా నిర్మాణ సంస్థ‌ల‌న్ని న‌య‌న్ డేట్లు కోసం కాచుకుని కూర్చుని ఉన్నాయి.

ఆ రేంజ్ డిమాండ్ ఉన్న హీరోయిన్ భ‌ర్త కోసం పెద్ద త్యాగ‌మే చేస్తున్న‌ట్లు క‌నిపిస్తుంది. ఏకంగా ఓ చిన్న హీరో కోసం త‌న రేంజ్ ని ..స్టార్ డ‌మ్ ని ప‌క్క‌న‌బెడ్డి ఓ సినిమాకి క‌మిట్ అయిన‌ట్లు తెలుస్తోంది. ఇంత‌గా న‌య‌న తార దిగొచ్చి చేస్తున్న ఆ సినిమా ఏంటి? అంటే వివ‌రాల్లోకి వెళ్లాల్సిందే. `ల‌వ్ టుడే` తో యువ న‌టుడు ప్ర‌దీప్ రంగ‌నాధ‌న్ ఎంత ఫేమ‌స్ అయ్యాడో తెలిసిందే. తెలుగులోనూ ఆ సినిమా మంచి విజయం సాధించింది.

ఇక్క‌డా ద‌ర్శ‌కుడిగా అవ‌కాశాలు వ‌స్తున్నాయి. అయితే అదే న‌టుడ్నిని ఎంపిక చేసుకుని విగ్నేశ్ శివ‌న్ ఓ సినిమా తెర‌కెక్కిస్తున్నాడు. అయితే ఇందులో హీరో సోద‌రి పాత్ర‌లో న‌య‌న‌తార న‌టిస్తున్న‌ట్లు స‌మాచారం. సినిమాలో ఈ పాత్ర ఎంతో కీల‌కం కావ‌డంతో అనుభ‌వం ఉన్న‌..పేరున్న న‌టి అయితే బాగుటుంద‌ని ద‌ర్శ‌కుడు భావించ‌డంతో! న‌య‌న‌తార రంగంలోకి దిగుతున్న‌ట్లు తెలుస్తోంది. అయితే న‌య‌న‌తార‌ని తీసుకోవాలి? అన్న‌ది విగ్నేశ్ ఉద్దేశం కాదుట‌. ఆ పాత్ర‌లోకి న‌య‌న‌తార కావాల‌నే వ‌స్తుందిట‌.

కేవ‌లం భ‌ర్త కోసం న‌య‌న‌తార త‌న ఇమేజ్ ని అంత‌టిని ప‌క్క‌న‌బెట్టి ఆ రోల్ చేయ‌డానికి రెడీ అవుతుంద ని తెలుస్తుంది. ఇదే నిజ‌మైతే న‌య‌న‌తార‌ని నిజంగా ప్ర‌శంసించాల్సిందే. ఎన్నికోట్లు ఆఫ‌ర్ చేసినా సినిమా ప‌బ్లిసీటికి నో చెప్పే న‌టి. బ్రాండింగ్స్ ని సైతం ఎండార్స్ చేయ‌దు. ఇలా కొన్ని నియ‌మ నిబంధ న‌ల‌తో ఇండ‌స్ట్రీలో కొన‌సాగుతుంది. అలాంటి న‌టి ఓ చిన్న హీరో చిత్రంలో న న‌టించ‌డం అంటే విగ్నేష్ ని లక్కీ అనే అనాలి.