Begin typing your search above and press return to search.

బిగ్ బాస్ 7 : హౌస్ లో అందరిని ఏడిపించిన ఎలిమినేషన్..!

అసలు ఆమె ఎలిమినేషన్ షాకింగ్ అనే చెప్పొచ్చు. సోషల్ మీడియాలో 6 లక్షల దాకా ఫాలోవర్స్ ఉన్న నయని పావనికి ఎలిమినేషన్ తప్పించే ఓట్స్ ఎందుకు పడలేదని డౌట్ పడుతున్నారు.

By:  Tupaki Desk   |   16 Oct 2023 12:48 PM GMT
బిగ్ బాస్ 7 : హౌస్ లో అందరిని ఏడిపించిన ఎలిమినేషన్..!
X

బిగ్ బాస్ సీజన్ 7 నుంచి వారానికే ఒక కంటెస్టెంట్ ఎలిమినేట్ అయ్యింది. లాస్ట్ వీక్ ఐదుగురు కంటెస్టెంట్స్ ని హౌస్ లోకి రీ ఎంట్రీ ఇవ్వగా వచ్చిన ఒక్కరోజుకే నామినేషన్స్ జరిగాయి. ఆ టైం లో వచ్చిన ఐదుగురు కొత్త వారిలో ముగ్గురు హౌస్ మెట్స్ నామినేషన్స్ లో ఉన్నారు. పూజా, అశ్విని, నయని పావని ముగ్గురు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కూడా లాస్ట్ వీక్ నామినేషన్స్ లో ఉన్నారు. అయితే వారిలో సోషల్ మీడియా ఇన్ ఫ్లూయన్సర్ అయిన నయని పావని ఎలిమినేట్ అయ్యింది.

తన ఎలిమినేషన్ ఏమాత్రం ఊహించని నయని పావని ఎలిమినేట్ అని నాగార్జున చెప్పగానే బాగా ఎమోషనల్ అయ్యింది. అంతేకాదు స్టేజ్ మీదకు వచ్చాక హౌస్ మెట్స్ అందరి గురించి చెబుతూ వారికి సలహాలు ఇచ్చింది. శివాజి ని నాన్న అని పిలిచి ఎమోషనల్ అయ్యింది. శివాజి కూడా మొదటిసారి ఎమోషనల్ గా కనిపించాడు. వారం లోనే హౌస్ మెట్స్ అందరి మనసులను గెలిచింది నయని పావని.

అసలు ఆమె ఎలిమినేషన్ షాకింగ్ అనే చెప్పొచ్చు. సోషల్ మీడియాలో 6 లక్షల దాకా ఫాలోవర్స్ ఉన్న నయని పావనికి ఎలిమినేషన్ తప్పించే ఓట్స్ ఎందుకు పడలేదని డౌట్ పడుతున్నారు. వారం రోజుల్లో నయని హౌస్ లో బాగానే హడావిడి చేసింది. మరి ఆమె ఎలిమినేట్ కావడానికి కారణాలు ఏంటో కానీ చాలా రోజుల తర్వాత ఎలిమినేషన్ ఎమోషనల్ గా జరిగింది అంటే అది నయని పావనిదే అని చెప్పొచ్చు.

లాస్ట్ సీజన్ లో గీతు రాయల్ కూడా తన ఎలిమినేషన్ ని అసలు ఊహించలేకపోయింది. అయితే గీతు దాదాపు ఏడు వారాల దాకా హౌస్ లో ఉంది. కానీ నయని పావని కేవలం వచ్చిన వారం రోజుల్లోనే హౌస్ మెట్స్ అందరికి దగ్గరైంది. బిగ్ బాస్ సీజన్ 7 ఆదివారం ఎపిసోడ్ ఆడియన్స్ ని మంచి ఎంటర్టైన్ చేసింది. వచ్చింది వారం అయినా సరే ఎలిమినేషన్ ఉంటుందని నయని ని చూసి మిగతా వైల్డ్ కార్డ్ ఎంట్రీ కంటెస్టెంట్స్ లో కూడా భయం మొదలైందని చెప్పొచ్చు. ఆదివారం ఎపిసోడ్ లో భగవంత్ కేసరి టీం బిగ్ బాస్ స్టేజ్ మీద సందడి చేశారు. డైరెక్టర్ అనీల్ రావిపుడితో పాటుగా హీరోయిన్ శ్రీ లీల బిగ్ బాస్ కి వచ్చి సినిమా గురించి విశేషాలను పంచుకున్నారు.