Begin typing your search above and press return to search.

బిగ్ బాస్ 7 : వారానికే ఎలిమినేట్ అయిన స్టార్ కంటెస్టెంట్..?

బిగ్ బాస్ సీజన్ 7 లో వీకెండ్ వచ్చింది అంటే ఎలిమినేషన్ ప్రాసెస్ జరుగుతుందని తెలిసిందే.

By:  Tupaki Desk   |   15 Oct 2023 5:07 AM GMT
బిగ్ బాస్ 7 : వారానికే ఎలిమినేట్ అయిన స్టార్ కంటెస్టెంట్..?
X

బిగ్ బాస్ సీజన్ 7 లో వీకెండ్ వచ్చింది అంటే ఎలిమినేషన్ ప్రాసెస్ జరుగుతుందని తెలిసిందే. లాస్ట్ వీక్ హౌస్ లోకి కొత్తగా ఐదుగురు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చారు. ఆటగాళ్లు పోటుగాళ్లుగా ఆట ఆడిన కంటెస్టెంట్స్ వారిలో వీక్ అనుకున్న వారిని నామినేషన్స్ లో ఉంచారు. ఈ వారం ఆటగాళ్లు అంటే పాత కంటెస్టెంట్స్ లో నలుగురు కంటెస్టెంట్స్ నామినేషన్స్ లో ఉండగా కొత్తగా వచ్చిన వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ లో నుంచి ముగ్గురు కంటెస్టెంట్స్ నామినేషన్స్ లో ఉన్నారు. వారిలో అశ్విని, పూజా, నయని పావని ఉన్నారు.

ఇక తెలుస్తున్న సమాచారం ప్రకారం నయని పావని ఈ వారం ఎలిమినేట్ అయినట్టు తెలుస్తుంది. సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్ గా ఉన్న నయని పావని హౌస్ లో చలాకీగానే ఉంటుంది. అయితే మొదటి వారం లోనే ఆమె టాలెంట్ చూపించే అవకాశం లేదు. కానీ మొదటి వారమే నామినేషన్స్ లో ఉండటం మిగతా వారి కన్నా ఆమె పర్ఫార్మెన్స్ తక్కువ ఉండటం వల్ల ఆమెకు తక్కువ ఓట్స్ వచ్చాయి.

నయని పావని ఎలిమినేట్ అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతంది. అయితే వారం కోసమే ఆమెను తీసుకున్నారా లేదా ఎలిమినేట్ అని చెప్పి సీక్రెట్ రూం లో ఏమైనా ఉంచుతారా అన్నది చూడాలి. శనివారం ఎపిసోడ్ లో కెప్టెన్ అయ్యాక యావర్ యాటిట్యూడ్ చూపిస్తున్నాడా అంటూ హౌస్ మెట్స్ ని అడిగి తెలుసుకున్న నాగార్జున హౌస్ మెట్స్ మధ్య బ్రెయిన్ లెస్, యూస్ లెస్, ఎయిం లెస్ ఆట ఆడించారు.

వారిలో ఎక్కువగా భోలే శావలికి ఎక్కువ బోర్డ్ లు వచ్చాయి. అతనికి నాలుగు బోర్డ్ లు రాగా ఆ తర్వాత అశ్వినికి 3, అమర్ కి 3 వచ్చాయి. ఈ వారం నయని పావని ఎలిమినేట్ అయితే మాత్రం వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ లో కూడా టెన్షన్ మొదలైనట్టే. ఇదే కాదు ఈ సీజన్ ఉల్టా పుల్టా అంటూ కనీసం 3 వారాలు హౌస్ లో ఉండి ఎలిమినేట్ అయిన ముగ్గురు కంటెస్టెంట్స్ రతిక, దామిని, శుభ శ్రీలలో ఒకరిని హౌస్ లోకి వచ్చేలా ఇప్పుడు హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ ఓట్ చేయాలని చెప్పారు నాగార్జున. సో ఆ ముగ్గురిలో ఒకరు హౌస్ లోకి వస్తారని చెప్పొచ్చు.