Begin typing your search above and press return to search.

ట్రైలర్ : మిస్ శెట్టిగా నయనతార... మరో హిట్‌!

లేడీ సూపర్ స్టార్‌ ఒక వైపు బాలీవుడ్ సూపర్ స్టార్‌ షారుఖ్‌ ఖాన్‌ తో జవాన్‌ వంటి సినిమాలు చేస్తూనే మరో వైపు లేడీ ఓరియంటెడ్‌ సినిమాలను కూడా చేస్తూ వచ్చింది.

By:  Tupaki Desk   |   28 Nov 2023 7:34 AM GMT
ట్రైలర్ : మిస్ శెట్టిగా నయనతార... మరో హిట్‌!
X

లేడీ సూపర్ స్టార్‌ ఒక వైపు బాలీవుడ్ సూపర్ స్టార్‌ షారుఖ్‌ ఖాన్‌ తో జవాన్‌ వంటి సినిమాలు చేస్తూనే మరో వైపు లేడీ ఓరియంటెడ్‌ సినిమాలను కూడా చేస్తూ వచ్చింది. జవాన్ సినిమా ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు వచ్చి వెయ్యి కోట్లకు పైగా వసూళ్లు సాధించడంతో పాన్ ఇండియా స్టార్‌ హీరోయిన్‌ అంటూ నయనతార కి ఇమేజ్ దక్కింది.

జవాన్ తో వచ్చిన ఇమేజ్ తో నయనతార తో వర్క్‌ చేయడానికి బాలీవుడ్‌ లో పలువురు స్టార్స్ ఆసక్తి చూపిస్తూ ఉన్నారు. ఆ విషయం పక్కన పెడితే నయన్‌ మరో లేడీ ఓరియంటెడ్‌ తమిళ్ మూవీ 'అన్నపూర్ణి'. ఇటీవల వచ్చిన మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి లో అనుష్క గొప్ప చెఫ్ గా కనిపించిన విషయం తెల్సిందే. ఇప్పుడు అదే పాత్ర లో నయన్‌ ఈ సినిమాలో కనిపించబోతుంది.

చిన్నప్పటి నుంచి కూడా గొప్ప చెఫ్ అవ్వాలనే కోరికతో ఉన్న ఒక బ్రహ్మిణ్‌ అమ్మాయికి ఆమె కుటుంబం నేపథ్యంలో అడ్డుగా మారుతుంది. ఆ ఇబ్బందులను ఎలా ఎదుర్కొంది.. బ్రహ్మిణ్‌ అయిన అమ్మాయి ఎలా మాంసాహారం వండే చెఫ్‌ గా మారింది అనే విషయాలను దర్శకుడు నీలేష్‌ కృష్ణ చూపించబోతున్నాడు.

తాజాగా వచ్చిన ట్రైలర్‌ తో సినిమాపై ఆసక్తి పెరిగింది. నయన్‌ తెలుగు అభిమానులు ఈ అరవ ట్రైలర్‌ ను చూసిన తర్వాత ఎందుకు తెలుగులో డబ్‌ చేయడం లేదు అంటూ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఒక అమ్మాయి పట్టుదలతో ప్రయత్నిస్తే ఏదైనా సాధ్యమే అన్నట్లుగా చూపిస్తూ మంచి మెసేజ్‌ ఇవ్వడంతో పాటు, ఒక పక్కా కమర్షియల్‌ మూవీగా కూడా అన్నపూర్ణి ని చూపించబోతున్నారు అని ట్రైలర్‌ చూస్తూ ఉంటే అర్థం అవుతోంది.

ఈ సినిమాలో నయనతార కీలక పాత్రలో కనిపించబోతూ ఉండగా జై, సత్యరాజ్‌, సురేష్ చక్రవర్తి, కేఎస్‌ రవికుమార్‌, పూర్ణిమ ఇంకా పలువురు ప్రముఖ తమిళ నటీనటులు కనిపించబోతున్నారు. ఈ సినిమాకు థమన్‌ సంగీతాన్ని అందించడం ప్రత్యేకమైన విషయం. ట్రైలర్ చూస్తూ ఉంటే నయన్‌ కి మరో హిట్‌ ఖాయం అనిపిస్తోందని ఫ్యాన్స్ అంటున్నారు. డిసెంబర్‌ 1న థియేటర్లలో రాబోతున్న అన్నపూర్ణ : ది గాడెస్ ఆఫ్‌ ఫుడ్‌' ఏ రేంజ్ లో విజయాన్ని సొంతం చేసుకుంటుందో చూడాలి.