Begin typing your search above and press return to search.

ర‌ష్మిక‌...న‌య‌న్ బాలీవుడ్ లో ఎవ‌రు బెస్ట్?

`జ‌వాన్` హిట్ తో లేడీ సూప‌ర్ స్టార్ న‌య‌న‌తార గ్రాండ్ గా బాలీవుడ్ లో లాంచ్ అయింది. అమ్మ‌డికి తొలి సినిమానే 1000 కోట్ల క్ల‌బ్ లో చేర్చింది.

By:  Tupaki Desk   |   13 Dec 2023 12:30 PM GMT
ర‌ష్మిక‌...న‌య‌న్ బాలీవుడ్ లో ఎవ‌రు బెస్ట్?
X

`జ‌వాన్` హిట్ తో లేడీ సూప‌ర్ స్టార్ న‌య‌న‌తార గ్రాండ్ గా బాలీవుడ్ లో లాంచ్ అయింది. అమ్మ‌డికి తొలి సినిమానే 1000 కోట్ల క్ల‌బ్ లో చేర్చింది. ఈ రేంజ్ విజ‌యాన్ని న‌య‌న్ ఏమాత్రం ఊహించ‌లేదు. దీంతో న‌య‌న‌తార‌కి బాలీవుడ్ లో అవ‌కాశాలిప్పుడు క్యూ క‌డుతున్నాయి. స్టార్ హీరోలంతా ఆమెతో క‌లిసి న‌టించ‌డానికి రెడీగా ఉన్నారు. బ‌డా నిర్మాణ సంస్థ‌ల నుంచి ఆఫ‌ర్ల వెల్లువ మొద‌లైంది. ఇప్ప‌టివ‌ర‌కూ కేవ‌లం సౌత్ కే ప‌రిచ‌య‌మైన న‌య‌న్ బ్రాండ్ ఇమేజ్ ఇక‌పై నార్త్ లోనూ క‌నిపించ‌నుంది.

ఇక సౌత్ నుంచి బాలీవుడ్ కి తెరంగేట్రం చేసిన మ‌రో హీరోయిన్ ర‌ష్మిక మంద‌న్న‌. న‌య‌న‌తార‌క కంటే ముందే నేష‌న‌ల్ క్ర‌ష్ ముందే బాలీవుడ్ లో క‌ర్చీప్ వేసింది. ఒక‌టి రెండు సినిమాలు చేసింది. కానీ ఆవేవి బెస్ట్ లాంచింగ్ ఇవ్వ‌లేదు. నిజానికి ర‌ష్మిక రేంజ్ రోల్స్ కావ‌వి. తాజాగా రిలీజ్ అయిన `యానిమ‌ల్` తోనే ర‌ష్మిక కి బెస్ట్ లాంచింగ్ దొరికింద‌నొచ్చు. ఇంద‌లో గీతాంజ‌లి పాత్ర‌లో ర‌ష్మ‌క పెర్పార్మెన్స్ అద‌ర‌గొట్టింది.

ప్ర‌స్తుతం ఈ సినిమా జ‌వాన్ రికార్డుల‌ను కొల్ల‌గొట్టేలే బాక్సాఫీస్ వ‌ద్ద ప‌రుగులు తీస్తోంది. ఇప్ప‌టికే 700 కోట్ల‌కు పైగా వ‌సూళ్ల‌ని సాధించిన సంగ‌తి తెలిసిందే. మ‌రి ఈ రెండు సినిమాల్లో న‌య‌నతార‌..ర‌ష్మిక మంద‌న్న పాత్ర‌ల్ని పొలిక చేస్తే? ఎవ‌రు ది బెస్ట్ న‌టిగా క‌నిపిస్తున్నారంటే? ర‌ష్మిక‌కే ఎక్కువ మార్కులు ప‌డుతున్నాయి. గీతాంజ‌లి పాత్ర స్పాన్ ర‌ష్మిక‌ని ఆ రేంజ్ లో ప్రొజెక్ట్ చేసింది అన్న అభిప్రాయాలు వ్య‌క్తమ‌వుతున్నాయి.

నేచుర‌ల్ పెర్పార్మెన్స్ తో ర‌ష్మిక ఆక‌ట్టుకున్న విధానం....తెర‌పై క‌నిపించిన ప్ర‌తీసారి ర‌ష్మిక మార్క్ ప‌డింది. సాధార‌ణంగా ఇలాంటి కంటెంట్ లో భార్య పాత్ర‌ల‌కు స్కోప్ చాలా త‌క్కువ ఉంటుంది. కానీ సందీప్ రెడ్డి ఆ పాత్ర‌ని తెర‌పై ఎంతో అందంగా మ‌లిచాడు. `జ‌వాన్` లో న‌య‌న‌తార పాత్ర‌కు అంత‌టి స్కోప్ లేదు. పాత్ర‌ని గ్రాండ్ గా లాంచ్ చేసినా.. ఆత‌ర్వాత అదే టెంపో కొన‌సాగినా దీపికా ప‌దుకొణే పాత్ర ఎంట‌ర్ అయ్యే స‌రికి న‌య‌న‌తార పాత్ర తేలిపోయింది.

అమ్మ పాత్ర‌లో దిపికా ప‌దుకొణే ప్లాష్ బ్యాక్ స్టోరీ తో క్రెడిట్ అంతా ద‌క్కించుకుంది. తెర‌పై ఆ పాత్ర ఎంతో బలంగా పండింది. అదే పాత్ర‌ని న‌య‌న‌త‌రా పోషించి ఉంటే? దీపిక ని మించి గొప్ప‌గా పండేద‌ని నెటి జ‌నుల మాట‌. మొత్తంగా చూసుకుంటే 2023 లో సౌత్ నుంచి బాలీవుడ్ లో సినిమాలు చేసిన హీరోయిన్ల‌లో బెస్ట్ ఎవ‌రంటే? ర‌ష్మిక పేరునే సూచిస్తున్నారంతా.