Begin typing your search above and press return to search.

చిరు బర్త్‌ డే స్పెషల్‌ రీ రిలీజ్ లేనట్లేనా?

నాయక్‌ సినిమా చరణ్‌ కెరీర్ లో చాలా స్పెషల్ గా నిలిచింది. అలాంటి నాయక్ ను రీ రిలీజ్ చేస్తే తప్పకుండా భారీ వసూళ్లు నమోదు అవుతాయని అంతా భావించారు.

By:  Tupaki Desk   |   16 Aug 2023 9:00 AM GMT
చిరు బర్త్‌ డే స్పెషల్‌ రీ రిలీజ్ లేనట్లేనా?
X

మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు అయిన ఆగస్టు 22న రామ్‌ చరణ్‌ నటించిన నాయక్ సినిమాను రీ రిలీజ్ చేయబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం నాయక్ రీ రిలీజ్‌ లేదని తెలుస్తోంది. చిరంజీవి భోళా శంకర్ సినిమా ను హిందీలో రిలీజ్ కు ప్లాన్‌ చేస్తున్నారు. అందుకే రీ రిలీజ్ ప్లాన్‌ చేంజ్ చేశారు.

నాయక్‌ రీ రిలీజ్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్న అభిమానులకు నిరాశే మిగిలింది. నాయక్ సినిమా లో రామ్ చరణ్ డబుల్ రోల్‌ లో కనిపించిన విషయం తెల్సిందే. నాయక్‌ సినిమా చరణ్‌ కెరీర్ లో చాలా స్పెషల్ గా నిలిచింది. అలాంటి నాయక్ ను రీ రిలీజ్ చేస్తే తప్పకుండా భారీ వసూళ్లు నమోదు అవుతాయని అంతా భావించారు.

ఆగస్టు 25వ తారీకున హిందీలో భోళా శంకర్‌ విడుదల కాబోతుంది. చిరంజీవి కి ఉన్న ఫాలోయింగ్‌ నేపథ్యం లో ఈ సినిమా హిందీలో మంచి ఓపెనింగ్స్ ను దక్కించుకునే అవకాశాలు ఉన్నాయి అంటూ వార్తలు వస్తున్నాయి. చిరంజీవి భోళా శంకర్ తెలుగు లో నిరాశ పరిచింది. కానీ ఇతర భాషల్లో మాత్రం ఈ సినిమా మంచి స్పందన దక్కించుకుంటుందనే నమ్మకం వ్యక్తం అవుతోంది.

రామ్‌ చరణ్ ప్రస్తుత సినిమాల విషయానికి వస్తే శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ సినిమాలో నటిస్తున్న విషయం తెల్సిందే. గేమ్‌ ఛేంజర్ సినిమా తర్వాత ఉప్పెన దర్శకుడు బుచ్చి బాబు దర్శకత్వంలో రామ్‌ చరణ్ ఒక సినిమాను చేయబోతున్నాడు. ఆ సినిమా షూటింగ్ ఇదే ఏడాది ప్రారంభం కాబోతుంది.