Begin typing your search above and press return to search.

అవ‌కాశాలివ్వండ‌ని అడుక్కోను!

తాజాగా మీడియా చిట్ చాట్ లో నవాజుద్దీన్ సిద్ధిఖీ తనకు సినిమాపై ఉన్న ప్రేమ అభిమానాన్ని చాటుకున్నాడు.

By:  Tupaki Desk   |   29 Jan 2024 12:30 PM GMT
అవ‌కాశాలివ్వండ‌ని అడుక్కోను!
X

సంక్రాంతి సందర్భంగా తెలుగు ప్రేక్షకుల ముందుకు వెంకటేష్ నటించిన సైంధవ్ సినిమా తో బాలీవుడ్ విలక్షణ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ వచ్చిన విషయం తెల్సిందే. సినిమాలోని ఆయన పాత్రకు మరియు నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కడంతో పాటు, ప్రేక్షకులు కూడా ప్రశంసించారు.


తాజాగా మీడియా చిట్ చాట్ లో నవాజుద్దీన్ సిద్ధిఖీ తనకు సినిమాపై ఉన్న ప్రేమ అభిమానాన్ని చాటుకున్నాడు. సినిమాలతో పాటు ఎప్పుడూ వ్యక్తిగత విషయాలతో వార్తల్లో ఉండే నవాజుద్దీన్ సిద్దిఖీ తాజా వ్యాఖ్యలు అందరి దృష్టి ని ఆకర్షిస్తున్నాయి.

సినిమాల్లో ఎప్పుడూ నటించాలని కోరుకుంటాను. ఒక వేళ నాకు పని లేని రోజు వస్తే అవకాశాల కోసం నేను అడుక్కోను. ఒకరి వద్దకు వెళ్లి సినిమా ఛాన్స్ ల కోసం చేయి చాచను. అలాంటి పరిస్థితి వస్తే ఇల్లు అమ్మేసి అయినా తానే సినిమాలు తీసి అందులో నటిస్తాను అన్నట్లుగా నవాజుద్దీన్ పేర్కొన్నాడు.

గ్యాంగ్స్ ఆఫ్‌ వాస్సేపూర్‌, బొంబాయి టాకీస్‌, ది లంచ్ బాక్స్ చిత్రాలతో పాటు ఇంకా ఎన్నో సినిమాల్లో తన విలక్షణ నటనతో మెప్పించిన నవాజుద్దీన్ సిద్ధిఖీ ముందు ముందు సౌత్ లో మరిన్ని సినిమాల్లో నటించేందుకు సిద్ధం అన్నట్లుగా ఆ మధ్య సైంధవ్‌ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.