Begin typing your search above and press return to search.

న‌వాజుద్దీన్ తో రెజీనా రొమాన్స్!

తాజాగా మ‌ళ్లీ హిందీ ప‌రిశ్ర‌మ‌పై దృష్టి పెట్టిన‌ట్లు తెలుస్తోంది. ఈ నేప‌థ్యంలో ఓ పెద్ద స్టార్ తోనే రొమాన్స్ చేసే ఛాన్స్ ద‌క్కించుకుంది

By:  Tupaki Desk   |   28 Aug 2023 5:45 AM GMT
న‌వాజుద్దీన్ తో రెజీనా రొమాన్స్!
X

నాలుగేళ్ల‌గా రెజీనా కోలీవుడ్ లో ఎక్కువ‌గా సినిమాలు చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. తెలుగులో అవ‌కాశాలు వ‌చ్చినంత కాలం దున్నేసింది. అటుపై త‌మిళ ప‌రిశ్ర‌మ‌పై ప‌డింది. ప్ర‌స్తుతం అక్క‌డే బిజీగా ఉంది. తాజాగా అమ్మ‌డి కోలీవుడ్ లైనప్ చూస్తే షాక్ అవ్వాల్సిందే. వ‌రుస‌గా ఐదారు సినిమాలు చేస్తుంది. అయితే ఇలా నెంబ‌ర్ అయితే పెరుగుతుంది. అందులో ఎన్ని విజ‌యాలు సాధించాయి? ఎన్ని ప‌రాజ‌యం చెందాయి? అన్న‌ది చెప్ప‌డం క‌ష్ట‌మే.

అక్క‌డ హీరోతో సంబంధం లేకుండా ప్రాజెక్ట్ వ‌చ్చిందంటే ఒకే చేస్తుంది. కావాల్సింది పారితోషికం...హిట్ అయితే ఏంటి? కాక‌పోతే ఏంటి? అన్న త‌ర‌హాలోనై రెజీనా క‌నిపిస్తుంది. ఈ నేప‌థ్యంలో తాజాగా బాలీవుడ్ పైనా ఫోక‌స్ చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఇప్ప‌టికే హిందీలో ఓ రెండు సినిమాలు చేసింది. తెలుగులో బిజీగా ఉన్న స‌మ‌యంలో అవి క‌మిట్ అయింది. అవేవి విజ‌యం సాధించ‌లేదు. దీంతో మ‌ళ్లీ బాలీవుడ్ కి వెళ్ల‌లేదు.

తాజాగా మ‌ళ్లీ హిందీ ప‌రిశ్ర‌మ‌పై దృష్టి పెట్టిన‌ట్లు తెలుస్తోంది. ఈ నేప‌థ్యంలో ఓ పెద్ద స్టార్ తోనే రొమాన్స్ చేసే ఛాన్స్ ద‌క్కించుకుంది. న‌వాజుద్దీన్ సిద్దీఖి క‌థానాయ‌కుడిగా 'సెక్ష‌న్ 108' అనే సినిమా తెర‌కెక్కుతోంది. ఈ చిత్రాన్ని ర‌షీక్ ఖాన్ తెర‌కెక్కిస్తుండ‌గా అనీష్ బ‌జ్మీ స‌మ‌ర్పిస్తున్నారు. భీమా సంస్థ‌ల నేప‌థ్యంలో జ‌రిగే కుంభ‌కోణాల ఆధారంగా తెర‌కెక్కిస్తున్నారు. ఇందులో రెజీనా బీమా విచార‌ణ అధికారి శిఖా పాత్ర‌లో న‌టిస్తుంది.

ఇది స‌వాల్ తో కూడున్న పాత్ర అని తెలుస్తోంది. విచార‌ణ స‌మ‌యంలో శిఖా ఎలాంటి అవ‌త‌రాలు ఎత్తాల్సి వ‌చ్చింది. వాస్త‌వాలు రాబ‌ట్ట‌డం కోసం కంపెనీల వ‌ద్ద ఎలాంటి మాయ మాట‌లు చెప్పాల్సి వ‌చ్చింది. బిజినెస్ టైకూన్ల ఎత్త‌గ‌డ‌ల్ని చిత్తు చేయ‌డానికి తాను ఎలాంటి బాణాలు వేసింది? అన్న‌ది ఆస‌క్తిక‌రంగా మ‌లుస్తున్న‌ట్లు తెలుస్తోంది. దీనిలో భాగంగా రెజీనా -న‌వాజ్ దో ఘాటైన రొమాంటిక్ స‌న్నివేశాల్లోనూ న‌టిస్తున్న‌ట్లు స‌మాచారం. ఆ ర‌కంగా 50 ఏళ్ల న‌టుడి తో రెజీనా రొమాన్స్ ఆస‌క్తిక‌ర‌మే.