Begin typing your search above and press return to search.

గాల్లోకి ఎగిరిన న‌టుడు..నా ప‌నైపోయింద‌నుకున్నా!

ఇప్పుడు సైంధ‌వ్ తోనూ సౌత్ లో త‌న ముద్ర వేయ‌డానికి రెడీ అవుతున్నాడు. తాజాగా ఈ సినిమా ప్ర‌చారంలో భాగంగా 'సైంధ‌వ్' షూటింగ్ లో చోటు చేసుకున్న ఓ ప్ర‌మాదం గురించి బ‌య‌ట పెట్టారు.

By:  Tupaki Desk   |   6 Jan 2024 12:11 PM GMT
గాల్లోకి ఎగిరిన న‌టుడు..నా ప‌నైపోయింద‌నుకున్నా!
X

బాలీవుడ్ న‌టుడు న‌వాజుద్దీన్ సిద్దిఖీ 'సైంధ‌వ్' సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఇందులో ప్ర‌తినాయ‌కుడి పాత్ర‌తో ప్రేక్ష‌కుల్ని అల‌రించ‌బోతున్నారు. ఇప్ప‌టికే ఆయ‌న పాత్ర‌కి సంబం ధించిన గ్లింప్స్ అత‌డి పాత్ర‌ని ఎంత బ‌లంగా తీర్చి దిద్దాయో చూస్తేనే తెలుస్తోంది. స‌రైన పాత్ర ప‌డితే! న‌వాజుద్దీన్ నెక్స్ట్ లెవ‌ల్ పెర్పార్మెన్స్ ఇస్తాడు. సైంధ‌వ్ లో అలాంటి ప‌వ‌ర్ ఫుల్ విల‌న్ పాత్ర‌లోనే క‌నిపిస్తున్నారు.


ఈ సినిమా త‌ర్వాత సౌత్ లో బిజీ స్టార్ అవ్వ‌డం ఖాయం. బాలీవుడ్ లో నటుడిగా త‌న‌కంటూ ప్ర‌త్యేక‌మైన ఇమేజ్ ఉంది. ఎన్నో వైవిథ్య‌మైన పాత్ర‌ల‌తో ప్రేక్ష‌కుల్ని అల‌రించాడు. ఇప్పుడు సైంధ‌వ్ తోనూ సౌత్ లో త‌న ముద్ర వేయ‌డానికి రెడీ అవుతున్నాడు. తాజాగా ఈ సినిమా ప్ర‌చారంలో భాగంగా 'సైంధ‌వ్' షూటింగ్ లో చోటు చేసుకున్న ఓ ప్ర‌మాదం గురించి బ‌య‌ట పెట్టారు. 'ఒక సీన్ లో బోట్ రైడింగ్ సీన్ ఉంది. ఆ సీన్ చేస్తున్న‌ప్పుడు నేను డ్రైవ్ చేస్తున్నాను. అదే స‌మ‌యంలో స‌ముద్రంలో ఓ పెద్ద అల వ‌చ్చింది.

దీంతో బోట్ నుంచి నేను ఒక్క‌సారిగా గాల్లోకి ఎగిరిపోయాను. బోట్ పై నియంత్ర‌ణ కోల్పోవ‌డంతోనే అలా జ‌రిగింది. కానీ బోట్ హైట్ లోనే అలా జ‌ర‌గ‌డంతో మ‌ళ్లీ అదే బోట్ పై ఎగిరి కూర్చున్న‌ట్లు ప‌డ్డాను. దీంతో పెద్ద ప్ర‌మాదం నుంచి త‌ప్పించుకోగ‌లిగాను. ఆస‌మ‌యంలో యూనిట్ మ‌రో బోట్ లో ఉండి స‌న్నివేశాన్ని షూట్ చేస్తున్నారు. అలా జ‌రిగే స‌రికి నాప‌నైపోయింద‌నుకున్నానని' ప్ర‌మాదాన్ని గుర్తు చేసుకున్నారు.

ఇక న‌టుడిగా త‌న‌కి సౌత్ లో అవ‌కాశాలు వస్తున్నాయ‌న్నారు. కానీ మంచి పాత్ర‌లైతే ఒప్పుకుంటు న్నాన‌ని...అలా న‌చ్చ‌ని పాత్ర‌లు చాలా వ‌దిలేసాన‌న్నారు. సైంధ‌వ్ తో తెలుగు సినిమాకి రావ‌డం సంతోషంగా ఉంద‌న్నారు. ఈ పాత్ర త‌న‌కు మంచి పేరు తీసుకొస్తుంద‌న్న ధీమా వ్య‌క్తం చేసారు.