ఇండస్ట్రీలోకి మరో నటవారసురాలు
స్టార్ల పిల్లలు నటనలో వారసత్వాన్ని కొనసాగించడం చూస్తున్నదే. ఇప్పటికే చాలా మంది స్టార్ కిడ్స్ బాలీవుడ్ లో సత్తా చాటుతున్నారు.
By: Tupaki Desk | 25 April 2025 9:02 AM ISTస్టార్ల పిల్లలు నటనలో వారసత్వాన్ని కొనసాగించడం చూస్తున్నదే. ఇప్పటికే చాలా మంది స్టార్ కిడ్స్ బాలీవుడ్ లో సత్తా చాటుతున్నారు. నిండా పాతిక అయినా నిండకుండానే కోట్లాది రూపాయల పారితోషికాలు అందుకుంటూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. రాజ్ కపూర్, అమితాబ్, శ్రీదేవి, షారూఖ్, చంకీ పాండే, రవీనాటాండన్, సంజయ్ కపూర్ సహా చాలామంది నటవారసులు సినీరంగంలో ప్రవేశించారు.
తదుపరి లెజెండరీ నటుడు రాజేష్ ఖన్నా మనవరాలు నవోమికా శరణ్ నటనా రంగంలో అడుగుపెడుతుందని బాలీవుడ్ మీడియా కథనాలు వండి వారుస్తోంది. నవోమికా తనదైన అందం, ఆకర్షణతో ఈవెంట్లలో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. బాలీవుడ్ లెజెండ్ రాజేష్ ఖన్నా మనవరాలు, నటి రింకే ఖన్నా కుమార్తె నవోమికా సరన్. తాత పోలికలు ఈ యంగ్ బ్యూటీకి ప్లస్. ఇటీవల తన అమ్మమ్మ, ప్రముఖ నటి డింపుల్ కపాడియాతో మడాక్ ఫిలింస్ గెట్ టుగెదర్ లో కలిసి కనిపించింది.
పబ్లిక్ లో కనిపించినప్పుడు నవోమికా అందచందాలకు యువతరం ఫిదా అయిపోతున్నారు. ఫోటోగ్రాఫర్లు తన వెంట పడి మరీ ఫోటోషూట్ల కోసం విసిగిస్తున్నారు. అంతటి ఆకర్షణతో మైమరిపిస్తోంది. నవోమికా ఇంకా షైగా కనిపిస్తోంది. ప్రస్తుతం లండన్ లో విద్యాభ్యాసం సాగిస్తున్న నవోమిక సినీకుటుంబం నుంచి వస్తోంది కాబట్టి తన ఆరంగేట్రం ఘనంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. రాజేష్ ఖన్నా మనవరాలిగా, నటి రింకీ ఖన్నా కుమార్తెగా తనకు ఇప్పటికే చాలా ఇమేజ్ ఉంది. బిగ్ బి మనవడు అగస్త్య నందా సరసన కథానాయికగా తెరంగేట్రం చేయనుందని గుసగుసలు వినిపిస్తున్నా ఇంకా అధికారికంగా వివరాలు వెల్లడించాల్సి ఉంది. నవోమిక అక్షయ్- ట్వింకిల్ ఖన్నా పిల్లలకు ఎంతో కజిన్ కూడా.
