#మీటూ.. దర్శకుడిపై టీవీ నటి ఆరోపణ!
ప్రముఖ దర్శకుడు సాజిద్ ఖాన్ తనతో అసభ్యకరంగా ప్రవర్తించాడని ఆరోపించారు టీవీ నటి నవీనా భోలే.
By: Tupaki Desk | 27 April 2025 10:23 PM ISTప్రముఖ దర్శకుడు సాజిద్ ఖాన్ తనతో అసభ్యకరంగా ప్రవర్తించాడని ఆరోపించారు టీవీ నటి నవీనా భోలే. అతడు అవకాశాల పేరుతో వల వేసాడని, తనను ఇంటికి పిలిచి బట్టలు విప్పాల్సిందిగా అడిగాడని నవీనా ఆరోపించారు. కొన్నేళ్ల క్రితం జరిగిన ఈ ఘటనను నవీనా తాజా ఇంటర్వ్యూలో బహిర్గతం చేసారు. అతడికి ప్రవర్తన తెలీదు. ఆడవాళ్లతో అసభ్యకరంగా ప్రవర్తిస్తాడని నవీనా ఆరోపించారు. గ్లాడ్ రాగ్స్ పేరుతో చాలామందిని వేధించాడని వ్యాఖ్యానించారు.
ప్రాజెక్ట్ కోసం చర్చలు అంటూ తనను ఇంటికి పిలిచి అతడు అసభ్యకరంగా ప్రవర్తించాడు... కానీ తాను అతడి నుంచి తప్పించుకున్నానని నవీనా బోలే తాజా యూట్యూబ్ ఇంటర్వ్యూలో తెలిపారు. తాను అతడికి దూరంగా వెళ్లిపోయాక కూడా.. `మిసెస్ ఇండియా` కార్యక్రమానికి పని చేస్తూ తనను మరోసారి సంప్రదించాడని, అవకాశం కోసం తనని కలవాలని కోరాడని కూడా నవీనా త్రోబ్యాక్ ఘటనలను గుర్తు చేసుకున్నారు. `హే బేబి` మూవీ చిత్రీకరణ సమయంలో ఈ ఘటన జరిగింది. 2004 నుంచి రెండేళ్ల కాలంలో జరిగిన సంఘటనలివి అని నవీనా గుర్తు చేసుకున్నారు. తనను బట్టలు విప్పమని అడగడానికి కారణం తాను సౌకర్యంగా ఉందా లేదా తెలుసుకోవడానికేనని సాజిద్ కొంటె సాకులు చెప్పాడని నవీనా వెల్లడించింది.
ఐదారేళ్ల క్రితం #మీటూ ఉద్యమం విస్త్రతంగా ఉన్న సమయంలో బాలీవుడ్ దర్శకుడు సాజిద్ ఖాన్ పై తీవ్రంగా ఆరోపిస్తూ పలువురు నటీమణులు పోలీస్ కేసులు పెట్టిన సంగతి తెలిసిందే. లైంగిక వేధింపుల కేసులో అతడు అరెస్ట్ అయ్యాడు. కొన్ని నెలల పాటు విచారణ కొనసాగింది. సాజిద్ ఖాన్ ప్రముఖ దర్శకురాలు, కొరియోగ్రాఫర్ ఫరాఖాన్ సోదరుడు.. సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్ లకు అత్యంత సన్నిహితుడు. సాజిద్ తెరకెక్కించిన హౌస్ ఫుల్ 1, హౌస్ ఫుల్ 2, హే బేబి చక్కని విజయాలు సాధించాయి. బుల్లితెరపైనా అతడు కొన్ని కార్యక్రమాలను రూపొందించారు.
