Begin typing your search above and press return to search.

న‌వీన్ కంబ్యాక్ వెనుక చాలా క‌థే ఉందే!

న‌వీన్ ని వాళ్ల నాయ‌న‌మ్మ విజ‌య నిర్మాల‌...త‌ల్లి ప‌రిశ్ర‌మ‌లో మంచి స్థానంలో చూడాల‌నుకున్నారుట‌. నవీన్ స‌హ‌చ‌రులంతా ఇండ‌స్ట్రీలో బాగా ఎదిగిన వారే.

By:  Tupaki Desk   |   17 Aug 2023 1:30 AM GMT
న‌వీన్ కంబ్యాక్ వెనుక చాలా క‌థే ఉందే!
X

సీనియ‌ర్ న‌టుడు న‌రేష్ కుమారుడు న‌వీన్ విజ‌య్ కృష్ణ సుప‌రిచితుడే. విజ‌య నిర్మల మ‌న‌వ‌డిగా టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన న‌వీన్ 'నందిని న‌ర్సింగ్ హోమ్'.. 'ఊరంతా అనుకుంటారు' లాంటి సినిమాలు చేసాడు.

దీంతో న‌వీన్ న‌టుడిగా సినిమా కెరీర్ ని ఎంచుకుని ముందుకెళ్తున్నాడ‌ని భావించారంతా. కానీ న‌టుడిగా న‌వీన్ బిజీ కాలేదు. ఛాన్సులు రాక న‌టించ‌లేదా? వ‌చ్చినా కావాల‌ని త‌ప్పుకున్నాడా? అన్న‌ది తెలియ‌దు గానీ...తాజాగా న‌వీన్ ఇండ‌స్ట్రీలో కొత్త జ‌ర్నీ మొద‌లు పెట్టిన‌ట్లు తెలుస్తోంది.

'సోల్ ఆఫ్ స‌త్య' అనే ఫీచ‌ర్ ఫిల్మ్ తో ద‌ర్శుడిగా ప‌రిచ‌య‌మైన సంగ‌తి తెలిసిందే. ఇందులో త‌న స్నేహితుడు సాయితేజ్ న‌టించాడు. రామ్ చ‌ర‌ణ్ చేతుల మీదుగా దాన్ని లాంచ్ చేసారు. అయితే న‌వీన్ కొత్త ట‌ర్నింగ్ తీసుకోవ‌డం వెనుక చాలా క‌థే ఉంద‌ని తెలుస్తోంది. వేదిక‌పై ఆయ‌న మాట‌లు ఆయ‌నలో క‌సిని పెంచిన‌ట్లు క‌నిపిస్తుంది. న‌టుడిగా స‌క్సెస్ అవ్వ‌లేదు..ద‌ర్శ‌కుడిగానైనా బిజీ అవ్వాల‌ని సీరియ‌స్ గా ఉన్న‌ట్లు క‌నిపిస్తుంది.

న‌వీన్ ని వాళ్ల నాయ‌న‌మ్మ విజ‌య నిర్మాల‌...త‌ల్లి ప‌రిశ్ర‌మ‌లో మంచి స్థానంలో చూడాల‌నుకున్నారుట‌. నవీన్ స‌హ‌చ‌రులంతా ఇండ‌స్ట్రీలో బాగా ఎదిగిన వారే. సాయితేజ్ మంచి హీరోగా ఎదుగుతున్నాడు. అలాగే రామ్ చ‌ర‌ణ్ కూడా స్కూల్ మేట్ అట‌.

మ‌ధ్య‌లో ఊటి వెళ్లిపోవ‌డంతో ఇద్ద‌రి మ‌ధ్య గ్యాప్ వ‌చ్చిందిట‌. ఇప్పుడు రామ్ చ‌ర‌ణ్ ఏ స్థాయిలో ఉన్నాడో తెలిసిందే. ఇలా స్నేహితులు..స‌హ‌చ‌రులు ఇండస్ట్రీలో మంచి స్థానంలో ఉన్నారు.

కానీ న‌వీన్ న‌టుడిగా పెవిలియ‌న్ చేరి..ద‌ర్శ‌కుడిగా కొత్త ప్ర‌యాణం మొద‌లు పెట్టాడు. ఈ గ్యాప్ న‌వీన్ వ్య‌క్తిగ‌త కార‌ణాలుగా తీసుకున్న‌ట్లు తెలుస్తోంది. ఇప్పుడు న‌వీన్ కొత్త ప్ర‌యాణం వెనుక స్నేహితుల హ‌స్తం ఉంద‌ని తెలుస్తోంది. వాళ్ల ప్రోత్సాహంతోనే సోల్ ఆఫ్ స‌త్య తెర‌కెక్కించాడు. ఆర‌కంగా త‌న‌లో క్రియేటివిటీని బ‌య‌ట‌పెట్టాడు.

న‌వీన్ కి ఎడిట‌ర్ గామంచి ప్రావీణ్యం ఉంది. కానీ అటువైపుగా జ‌ర్నీ ఫిక్స్ చేయ‌లేదు. ఈ విష‌యాన్ని ఓ సంద‌ర్భంలో సూపర్ స్టార్ మ‌హేష్ కూడా అన్నారు. తాజాగా ద‌ర్శ‌కుడిగా కొత్త ప్ర‌యాణం మొద‌లు పెట్టాడు. ఈ దిశ‌గా న‌వీన్ స‌క్సెస్ అవ్వాల‌ని ఆశిద్దాం.