Begin typing your search above and press return to search.

ఇంకెన్ని రోజులో.. నవీన్ టైమింగ్ అదుర్స్..!

ఈ క్రమంలో నవీన్ పొలిశెట్టి మనం కప్పు మిస్ అయ్యామని బాధపడుతున్న ఎంతోమంది గురించి ఒక వీడియో రిలీజ్ చేశాడు. తన ఫ్రెండ్ వంశీకి ఫోన్ చేసి డిప్రెషన్ కి టాబ్లెట్ అడుగుతాడు నవీన్ పొలిశెట్టి.

By:  Tupaki Desk   |   21 Nov 2023 1:15 PM GMT
ఇంకెన్ని రోజులో.. నవీన్ టైమింగ్ అదుర్స్..!
X

యంగ్ హీరోల్లో సూపర్ టాలెంటెడ్ అయిన నవీన్ పొలిశెట్టి ఎలాంటి సందర్భాన్ని అయినా సరే తన ప్రతిభ కబరుస్తుంటాడు. ఈ క్రమంలో ఇండియా వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ ఓడిపోయినప్పటి నుంచి క్రికెటర్ లవర్స్ అంతా కూడా చాలా బాధపడుతున్నారు. ఫైనల్ మ్యాచ్ జరిగి 3 రోజులు అవుతున్నా ఇంకా దాని నుంచి బయట పడని వారు ఎంతోమంది ఉన్నారు. ఇది పూర్తిగా పోవాలంటే మళ్లీ మనవాళ్లు కప్ కొట్టాల్సిందే. అయితే అప్పటివరకు అది మనసులో దాచుకుని ముందుకు నడవాల్సి ఉంటుంది.

ఈ క్రమంలో నవీన్ పొలిశెట్టి మనం కప్పు మిస్ అయ్యామని బాధపడుతున్న ఎంతోమంది గురించి ఒక వీడియో రిలీజ్ చేశాడు. తన ఫ్రెండ్ వంశీకి ఫోన్ చేసి డిప్రెషన్ కి టాబ్లెట్ అడుగుతాడు నవీన్ పొలిశెట్టి. డోలో 650 వేసుకోమని చెప్పగా.. నా కోసం కాదురా నా ఫ్రెండ్ కోసం అంటూ చెబుతాడు.

నువ్వు ఎం.బి.బి.ఎస్ చేశావా లేదా పేమెంట్ సీటా అని అడుగుతాడు. ఎక్స్ లో తన వీడియో షేర్ చేసి ఇంకెన్ని రోజులో అంటూ హార్ట్ బ్రేక్ సింబల్ పెట్టి వరల్డ్ కప్ విషయాన్ని గుర్తు చేశాడు నవీన్ పొలిశెట్టి.

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈమధ్యనే ప్రముఖ యూట్యూబర్ నా అన్వేషణ గురించి ఒక వీడియో చేసిన నవీన్ పొలిశెట్టి లేటెస్ట్ గా ఇండియా ఫైనల్ మ్యాచ్ ఓడిపోయిన బాధ నుంచి బయటకు రావడం ఎలానో.. ఈ డిప్రెషన్ కి ఏమందు వాడాలో అని బాధపడుతూ ఒక వీడియో చేశాడు. తనలా ఇలా చాలామంది ఇదే ఫీల్ తో ఉంటారని గమనించే నవీన్ ఈ వీడియో చేసి ఉండొచ్చు.

ఇండియా ఫైనల్ మ్యాచ్ ఓడిపోయిందన్న బాధ తనకు ఉన్నా అలా బాధ పడుతూ కూర్చుంటే ఎలా తాను నవ్వించడానికి సిద్ధమే అని మరోసారి ప్రూవ్ చేశాడు. ఈమధ్యనే నవీన్ పొలిశెట్టి మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టితో హిట్ అందుకున్నాడు. అనుష్క ఫీమేల్ లీడ్ గా నటించిన ఈ సినిమా నవీన్ ఖాతాలో మరో హిట్ సినిమాగా నిలిచింది. ప్రస్తుతం అనగనగా ఒక రాజు సినిమా చేస్తున్నాడు నవీన్ పొలిశెట్టి. ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ, జాతిరత్నాలు, మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి మూడు హిట్లతో హ్యాట్రిక్ అందుకున్నాడు నవీన్ పొలిశెట్టి.