Begin typing your search above and press return to search.

మా నాన్న కూడా బెల్ట్ తీసిన‌వారే!

తాజాగా యంగ్ హీరో న‌వీన్ పొలిశెట్లి కూడా తండ్రి చేతుల్లో బెల్ట్ దెబ్బ‌లు తిన్న న‌టుడేన‌ని తెలుస్తోంది.

By:  Tupaki Desk   |   17 March 2024 8:49 AM GMT
మా నాన్న కూడా బెల్ట్ తీసిన‌వారే!
X

ఇటీవ‌లే న‌టుడు శివాజీ #90స్ బ‌యోపిక్ తో కంబ్యాక్ అయిన సంగ‌తి తెలిసిందే. వెబ్ సిరీస్ గా ప్రేక్ష‌కుల ముందుకొచ్చిన సీరిస్ భారీ విజ‌యం సాధించింది. తెలుగు నుంచి ఇంత‌వ‌ర‌కూ ఏ వెబ్ సిరీస్ ఇంత పేరు రాలేదు. తొలిసారి ఓ వెబ్ సిరీస్ గురించి తెలుగు ఆడియ‌న్స్ మాట్లాడ‌కున్నారు? అంటే అది ఇదే అన‌డం లో ఎలాంటి సందేహం లేదు. ఈవెబ్ సిరీస్ తో అంద‌రి బాల్యం ఒక్క‌సారిగా క‌ళ్ల ముందు క‌నిపించింది.

ఈ సంద‌ర్భంగానే శివాజీ త‌న బాల్యంలోకి వెళ్లి! తండ్రి త‌న బాధ్య‌త పట్ల ఎలా ఉండేవారు? అన్న‌ది రివీల్ చేసారు. దీనిలో భాగంగానే బాగా చ‌ద‌వాలి అన్న ఉద్దేశంతో శివాజీని ఏకంగా ట్రాక్ట‌ర్ బెల్ట్ తోనే బాదేవార‌ని తెలిపాడు. కేవ‌లం బాగా చ‌దువుకోవాలి...పైకి రావాలి అన్న త‌ప‌న‌తోనే తండ్రి అలా వ్య‌వ‌రించేవార‌ని అన్నాడు. తాజాగా యంగ్ హీరో న‌వీన్ పొలిశెట్లి కూడా తండ్రి చేతుల్లో బెల్ట్ దెబ్బ‌లు తిన్న న‌టుడేన‌ని తెలుస్తోంది.

ఈ విష‌యాన్ని న‌వీన్ స్వ‌యంగా రివీల్ చేసాడు. 'నేను సినిమాల్లోకి వ‌స్తానంటే నాన్న ఒప్పుకోలేదు. అందుకే ఏఐ ఈఈఈ లో ఎంట్ర‌న్స్ రాసి ఎన్ ఐటీ భూపాల్ లో సీటు సంపాదించా. అప్పుడైనా నాన్న అర్ధం చేసుకుంటార‌నుకుంటే బెల్ట్ తీసారు. నాకు సినిమాల మీద ఆస‌క్తి ఉన్నా క్లాసులు మాత్రం చాలా శ్రద్ద‌గా వినేవాడిని. టీచ‌ర్లు చెప్పింది బాగా గుర్తు పెట్టుకునేవాడిని. నెల ముందు చ‌దివి ప‌రీక్ష‌లు రాసి ప‌స్ట్ క్లాస్లో పాస్ అయ్యేవాడిని.

మ‌రోవైపు స్టేజ్ షోలు..నాట‌కాలు వేసేవాడిని. చ‌దువు పూర్త‌య్యేస‌రికి లండ‌న్ లో ఉద్యోగం కూడా వ‌చ్చింది. అమ్మ‌నాన్న‌ల కోసం కొంత కాలం ఉద్యోగం చేసి త‌ర్వాత మానేసి నా కిష్ట‌మైన రంగంలోకి వ‌చ్చాను' అని అన్నాడు. మొత్తానికి న‌వీన్ పొలిశెట్టి చిన్న నాటి నుంచి వెరీ ట్యాలెంటెడ్ అని తెలుస్తోంది. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండ‌స్ట్రీకి వ‌చ్చాడు. త‌న‌కు తానుగానే ఎదిగాడు. జాతిర‌త్నాలు తో మరింత పేరు వ‌చ్చింది. ఆ క్రేజ్ తో ఏకంగా అనుష్క స‌ర‌స‌న న‌టించే అవ‌కాశం అందుకున్నాడు.