Begin typing your search above and press return to search.

ల‌క్ష్మ‌ణుడిగా న‌వీన్ పోలిశెట్టి?

నితీష్ తివారీ రామాయ‌ణం ప్రీప్రొడ‌క్ష‌న్ ప‌నులు, న‌టీన‌టుల ఎంపిక‌లు వేగంగా పూర్త‌వుతున్న సంగ‌తి తెలిసిందే

By:  Tupaki Desk   |   21 Feb 2024 3:30 PM GMT
ల‌క్ష్మ‌ణుడిగా న‌వీన్ పోలిశెట్టి?
X

నితీష్ తివారీ రామాయ‌ణం ప్రీప్రొడ‌క్ష‌న్ ప‌నులు, న‌టీన‌టుల ఎంపిక‌లు వేగంగా పూర్త‌వుతున్న సంగ‌తి తెలిసిందే. ర‌ణబీర్ కపూర్ శ్రీ‌రాముడిగా న‌టిస్తుండ‌గా, సాయిప‌ల్ల‌వి సీత‌గా, య‌ష్ రావ‌ణుడిగా న‌టిస్తున్నారు. స‌న్నీడియోల్ ఆంజ‌నేయునిగా, బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కింగ్ దశరథ్‌గా నటించడానికి అంగీక‌రించారు. శూర్ప‌ణ‌ఖ‌గా ర‌కుల్ ప్రీత్ సింగ్, కైకేయిగా లారా దత్తా ఎంపిక‌య్యార‌ని ఇప్ప‌టికే క‌థ‌నాలొచ్చాయి.

ఇత‌ర పాత్ర‌ల ఎంపిక పూర్త‌వుతోంది. రామాయణాన్ని మార్చి నాటికి సెట్స్ పైకి తీసుకురావడానికి ద‌ర్శ‌క‌నిర్మాత నితేష్ తివారీ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ముంబైలోని ప్రైమ్ ఫోకస్ కార్యాలయంలో యువ రాముడు - ల‌క్ష్మ‌ణుడు పాత్ర‌ల కోసం చిత్ర‌ బృందం స్కౌటింగ్ ప్రారంభించినట్లు తెలుస్తోంది.

మరో రెండు వారాల్లో నటీనటులను దర్శకుడు ఫైన‌ల్ చేయనున్నారు. ర‌ణ్‌బీర్ రాముడిగా నటిస్తున్నాడు.. లక్ష్మణ్ పాత్ర కోసం నవీన్ పోలిశెట్టిని సంప్రదించారని ప్ర‌ఖ్యాత మిడ్ డే క‌థ‌నం వెలువ‌రించింది. నితేష్ సర్ అండ్ కాస్టింగ్ టీమ్ రామ్ - లక్ష్మణ్‌ల చిన్ననాటి వెర్షన్‌లు ఎదిగిన పాత్రలను పోషించే నటులతో సమానంగా ఉండేలా చూసుకోవాలి. చిన్న‌నాటి రాముడు, ల‌క్ష్మ‌ణుడు పాత్ర‌ల కోసం ప్రస్తుతానికి నలుగురైదుగురు యువ నటులు షార్ట్‌లిస్ట్‌లో ఉన్నారు. టాలీవుడ్ లో వ‌రుస విజ‌యాల‌తో ప్ర‌తిభావంతుడైన క‌థానాయ‌కుడిగా పేరు తెచ్చుకున్న న‌వీన్ పోలిశెట్టికి ఇది అద్భుత‌మైన అవ‌కాశం. పాన్ ఇండియాలో అత‌డు త‌న‌ను తాను ప‌రిచ‌యం చేసుకునేందుకు స‌రైన దారి ల‌భించింద‌ని ఇప్పుడు అంతా భావిస్తున్నారు.

రామాయణం చిత్రీకరణ మార్చి 2024లో ప్రారంభమవుతుంది. సన్నీ డియోల్ మేలో తన పాత్ర షూటింగ్‌ను ప్రారంభించనున్నారు. జూలైలో యష్ తారాగణంలో చేరనున్నారు. దీపావళి 2025 విడుదలను లక్ష్యంగా చేసుకుని యష్ సన్నివేశాలను పూర్తి చేసిన తర్వాత రామాయణం షూటింగ్‌ను ముగించాలని టీమ్ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ చిత్రం మూడు భాగాల సిరీస్‌గా ప్లాన్ చేసారు. కొన్ని నెలల క్రితం రణబీర్ లాస్ ఏంజెల్స్ కు వెళ్లి VFX కంపెనీతో రామాయ‌ణం ప్రీ-విజువలైజేషన్ ని ప‌రిశీలించార‌ని తెలిసింది.