Begin typing your search above and press return to search.

హిట్టు కొట్టినా ఈ సైలెన్స్ ఏంటి..?

కోవిడ్ తర్వాత మాక్సిమం తెలుగు ఆడియన్స్ ని కడుపుబ్బా నవ్వించిన సినిమాగా జాతిరత్నాలు సెన్సేషనల్ రిజల్ట్ అందుకుంది

By:  Tupaki Desk   |   17 Jan 2024 11:30 AM GMT
హిట్టు కొట్టినా ఈ సైలెన్స్ ఏంటి..?
X

యువ హీరో నవీన్ పొలిశెట్టి ప్రతిభ గురించి అందరికీ తెలిసిందే. శేఖర్ కమ్ముల తెరకెక్కించిన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాలో ఒక చిన్న పాత్రలో కనిపించిన నవీన్ ఆ తర్వాత హీరోగా మారి ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ సినిమాతో మెప్పించాడు. తనను తాను హీరోగా ప్రమోట్ చేసుకుంటూ తెలుగు ప్రేక్షకులకు కొత్త కథలను అందించాలని ఫిక్స్ అయ్యాడు నవీన్ పొలిశెట్టి. ఏజెంట్ ఆత్రేయ హిట్ తర్వాత అనుదీప్ డైరెక్షన్ లో వచ్చిన జాతిరత్నాలు తో బ్లాక్ బస్టర్ కొట్టాడు.


కోవిడ్ తర్వాత మాక్సిమం తెలుగు ఆడియన్స్ ని కడుపుబ్బా నవ్వించిన సినిమాగా జాతిరత్నాలు సెన్సేషనల్ రిజల్ట్ అందుకుంది. సినిమాలో నవీన్ కామెడీ కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇక ఈ సినిమా తర్వాత కొద్దిపాటి గ్యాప్ తో స్వీటీ అనుష్కతో మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమా చేశాడు నవీన్ పొలిశెట్టి. ఆ సినిమాలో కూడా తన టాలెంట్ తో హిట్ అందుకున్నాడు. ఇచ్చిన పాత్రకు తన వర్సటాలిటీ జోడించి ఆ పాత్రతో ప్రేక్షకులకు దగ్గరవుతూ వస్తున్నాడు నవీన్ పొలిశెట్టి.

మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి తర్వాత సితార బ్యానర్ లో అనగనగా ఒక రాజు సినిమా చేస్తున్నాడు నవీన్ పొలిశెట్టి. ఈ సినిమాను మ్యాడ్ మూవీ డైరెక్టర్ కళ్యాణ్ శంకర్ డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమా అనౌన్స్ మెంట్ వచ్చి చాలా రోజులు అవుతున్నా సినిమాకు సంబందించిన ఎలాంటి అప్డేట్స్ బయటకు రాలేదు. మ్యాడ్ కన్నా ముందే అనగనగా ఒక రాజు అనౌన్స్ మెంట్ జరిగింది. కానీ సితార బ్యానర్ లో కళ్యాణ్ శంకర్ ఈ సినిమా తీసి ముందు రిలీజ్ చేశాడు.

అనగనగా ఒక రాజు సినిమా విషయంలో నవీన్ పొలిశెట్టి సైలెన్స్ కూడా అతని ఫ్యాన్స్ ని షాక్ అయ్యేలా చేస్తుంది. సెట్స్ మీద ఉన్న సినిమా గురించి ఎలాంటి అప్డేట్స్ రాకపోవడంతో అసలు సినిమా ఉందా లేదా అన్న డౌట్ కూడా వస్తుంది. వరుస హిట్లతో మంచి ట్రాక్ మీద ఉన్న నవీన్ ఇలా గ్యాప్ లు ఇవ్వకుండా వెంట వెంటనే సినిమాలు చేస్తే బెటర్ అని చెప్పొచ్చు. అనగనగా ఒక రాజు సినిమా అప్డేట్ తో పాటుగా నవీన్ నెక్స్ట్ సినిమాల న్యూస్ కోసం అతని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఆడియన్స్ కి డిఫరెంట్ ఎక్స్ పీరియన్స్ ఇవ్వాలనే ప్రయత్నంలో నవీన్ పొలిశెట్టి ఈ గ్యాప్ ఇస్తున్నా మరీ ఎక్కువైతే తన కెరీర్ కే ఇబ్బంది ఏర్పడుతుందని గుర్తించాలి.