Begin typing your search above and press return to search.

హీరో కాక ముందు హీరోలంద‌ర్నీ క‌లిసిన హీరో!

ఇంత‌కీ ఎవ‌రా? కుర్రాడు అనుకుంటున్నారా? అత‌నే న‌వీన్ పొలిశెట్టి. ఇప్పుడీ యంగ్ హీరో తెలియ‌ని తెలుగు ప్రేక్ష‌కుడు లేడు.

By:  Tupaki Desk   |   27 Sep 2023 3:00 AM GMT
హీరో కాక ముందు హీరోలంద‌ర్నీ క‌లిసిన హీరో!
X

స్టార్ హీరోల‌తో షేక్ హ్యాండ్ లు అందుకోవటం అంత ఈజీనా! అందులోనూ ఎలాంటి సినిమా అనే అడ్ర‌స్ లేని న‌టుడికి ఏ హీరో షేక్ హ్యాండ్ ఇస్తాడు? ఎవ‌రు ప‌ట్టించుకుంటారు? అన్ని వ‌దిలేసి అడిగినా ఆ హీరో హ్యాండ్ ఇస్తాడో? లేదో తెలియ‌దు! ఇస్తే సంతోషం..ఇవ్వ‌క‌పోతే అవ‌మానం. కానీ త‌న ప్ర‌య‌త్నాల‌కి ఇవేమి అడ్డు కాద‌నుకున్నాడు ఆ కుర్రాడు. షేక్ హ్యాండ్ హీరో ఇస్తే నేమీ..ఇవ్వ‌క‌పోతేనేమి..ఓ ప్ర‌య‌త్నం చేద్దాం. ఇస్తే చేతిలో పోర్టో ఫోలియో..ఫోటోలు పెడ‌దాం! లేక‌పోతే జాతిర్న‌తం టైపులో బై చెబుతాం అనుకున్నాడు!


ఇంత‌కీ ఎవ‌రా? కుర్రాడు అనుకుంటున్నారా? అత‌నే న‌వీన్ పొలిశెట్టి. ఇప్పుడీ యంగ్ హీరో తెలియ‌ని తెలుగు ప్రేక్ష‌కుడు లేడు. 'జాతిర‌త్నాలు' స‌క్సెస్ తో మ‌రింత ఫేమ‌స్ అయ్యాడు. ' లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ 'సినిమాతో ఆర్టిస్ట్ గా తెరంగేట్రం చేసిన న‌వీన్ అటుపై 'ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ‌'తో గుర్తింపు ద‌క్కించుకున్నాడు. తాజాగా రిలీజ్ అయిన సినిమాతో ఏకంగా అనుష్క‌తోనే తెర‌ను పంచుకున్నాడు.

అయితే ఇదంతా ఇప్పుడు. ఒక‌ప్పుడు కేరాఫ్ ప్లాట్ ఫాం అని అత‌నే అంటాడు. న‌వీన్ కి స‌క్సెస్ ఒక్క రోజులో వ‌చ్చింది కాదు. దానికి వెనుక ఎన్నో క‌ష్టాలు..అవ‌మ‌నాలు..నిద్ర‌లేని రాత్రుళ్లు ఉన్నాయి. ముంబైలో చాలా క‌ష్టాలే ప‌డ్డాడు. ఒక‌పూట భోజ‌నంతో రోజంతా గ‌డిపిన సంద‌ర్భాలెన్నో. సినిమా ప్ర‌యత్నాల్లో భాగంగా న‌వీన్ బాలీవుడ్ లో ఎవ‌ర్నీ విడిచిపెట్ట‌లేదు. హీరోల కార్ల వెంబ‌డించాడు.

క‌నిపించిన వారి చేతుల్లో త‌న బ‌యోడేటా పెట్టి అవ‌కాశం ఇవ్వండని అడిగాడు. త‌న‌ను తానే పరిచ‌యం చేసుకునే వాడు. ప‌ట్టించుకునే వాళ్లు ప‌ట్టించుకునే వారు. ప‌ట్ట‌ని వాళ్లు ఎవ‌రో అని లైట్ తీసుకునేవారు. ఇలా హీరోలు..నిర్మాత‌లు...న‌టులు..ద‌ర్శ‌కులంద‌రితో న‌వీన్ జ‌ర్నీ సాగింది. ఎవ‌రైనా అవ‌కాశం పేరుతో కాలు చేస్తార‌ని ఆశ‌ప‌డినా ఆడియాశ‌లే మిగిలేవి.

అయితే తాను సినిమా ప్ర‌య‌త్నాలు చేస్తోన్న స‌మ‌యంలో ప్రోప‌ర్ వే అనేది లేదు అంటున్నాడు. ఇప్పుడు కొత్త వాళ్లు ఎవ‌ర్నీ క‌ల‌వాలి? ఎలా క‌ల‌వాలి? అన్న దానికి ఓ ప్లాట్ ఫాం ప‌డింది. పాత రోజుల్లో ఇవ‌న్నీ లేక చాలా ఇబ్బందులు ప‌డాల్సి వ‌చ్చేద‌న్నాడు.