Begin typing your search above and press return to search.

ఇప్ప‌టికీ అమ్మా-నాన్న కొన్న బ‌ట్ట‌లేనా!

యంగ్ హీరో న‌వీన్ పొలిశెట్టి కెరీర్ జ‌ర్నీ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండ‌స్ట్రీకి వ‌చ్చి స‌క్సెస్ అయిన న‌టుడు

By:  Tupaki Desk   |   26 Sep 2023 9:30 AM GMT
ఇప్ప‌టికీ అమ్మా-నాన్న కొన్న బ‌ట్ట‌లేనా!
X

యంగ్ హీరో న‌వీన్ పొలిశెట్టి కెరీర్ జ‌ర్నీ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండ‌స్ట్రీకి వ‌చ్చి స‌క్సెస్ అయిన న‌టుడు. వ‌రుస విజ‌యాల‌తో దూసుకుపోతున్నాడు. ఇటీవ‌లే రిలీజ్ అయిన 'మిస్ శెట్టి..మిస్ట‌ర్ పొలిశెట్టి' తో మ‌రో విజ‌యాన్ని ఖాతాలో వేసుకున్నాడు. 'జాతిర‌త్నాలు'.. 'ఏజేంట్ ఆత్రేయ' లాంటి సినిమాలు మంచి విజ‌యాన్ని సాధించిన సంగ‌తి తెలిసిందే. ఈ మూడు విజ‌యాలు న‌వీన్ స్టార్ గా నిల‌బెట్టాయి.

ప్ర‌స్తుతం యంగ్ హీరోకి అవ‌కాశాలు బాగానే వ‌స్తున్నాయి. అడ్వాన్సులు..పారితోషికాలు భారీగానే అందుకుం టున్నాడు. ల‌గ్జ‌రీ లైఫ్ ఆస్వాదిస్తున్నాడు. అయితే ఈ యంగ్ హీరో ఇంకా త‌ల్లిదండ్రుల చాటు బిడ్డ‌నే అనిపిస్తున్నాడు. అవును. న‌వీన్ ఓ ర‌కంగా చెప్పాలంటే పిసినారి టైప్ అని తెలుస్తోంది. త‌న‌కి కావాల్సిన వ‌స్తువులు ఏవైనా ఇంట్లో వాళ్లే కొనాల‌ట‌. త‌న‌కు తానుగా షాపింగ్ చేయ‌డుట‌. బట్ట‌లు కూడా త‌ల్లిదండ్రులు కొనిస్తేనే వేసుకుంటాడుట‌.

లేదంటే ఆమెరికాలో ఉండే అత్త‌లు కొనిస్తారుట‌. రీసెంట్ గానే ఓ సూట్ కొనిచ్చారుట‌. ఇంట‌ర్వ్యూయ‌ర్ సూట్ బాగుంది ఎక్క‌డ కొన్నారు? అంటే ఈ విష‌యాన‌ల్ని రివీల్ చేసాడు. ఇవ‌నే కాదు..త‌న‌కి సంబంధిం చిన బ్యాంక్ వ్య‌వ‌హారాలు కూడా ఇంట్లో వాళ్లే చూసుకుంటారుట‌. త‌ను ఆ విష‌యాలేవి పెద్ద‌గా ప‌ట్టించు కోడుట‌. మ‌రి పారితోషికాల రూపంలో వ‌చ్చిన డ‌బ్బులు ఏం చేస్తున్నారు? ఎక్క‌డ పెట్టుబ‌డులు పెడుతున్నారంటే? ఆమాత్రం వాటికి స‌రైన స‌మాధానం చెప్ప‌కుండా త‌ప్పించుకున్న ఘ‌నుడు.

అన్ని ఇంట్లో వాళ్ల మీద‌కి తోసేసాడు. సినిమాల రూపంలో వ‌చ్చిన డ‌బ్బు అంతా ఇంటికే ఇచ్చేస్తాడు. చిన్న చిన్న అవ‌స‌రాల‌కు కూడా వాళ్ల‌నే అడిగి తీసుకుంటాడుట‌. మొత్తానికి న‌వీన్ డ‌బ్బు విష‌యంలో గ‌ట్టిగానే ఉంటాడ‌ని తెలుస్తోంది. అన‌వ‌సంర‌గా డ‌బ్బు ఖ‌ర్చు చేసే టైపు కాదు. డ‌బ్బు వృద్దా అనే మాట ఆయ‌న డిక్ష‌న‌రీలో లేన‌ట్లు తెలుస్తోంది. చిన్న ప్ప‌టి నుంచి ఇంటి వాతావ‌ర‌ణం బాగా అల‌వాటైన న‌టుడు. బాగా చ‌దువుకున్నాడు. సినిమా క‌ష్టాలు తెలుసు. ఎదిగే క్ర‌మంలో ఇంటి నుంచి స‌హాయం పొంద‌లేదు. ఇలా ఇన్ని విష‌యాలు తెలుసు కాబ‌ట్టే ఇండ‌స్ట్రీలో ఎద‌గ గ‌లిగాడు.