Begin typing your search above and press return to search.

జవాన్ తో పోటీ.. పొలిశెట్టి ఏమన్నాడంటే..

నవీన్ మాట్లాడుతూ మొదట సెప్టెంబర్ 7న ఈ సినిమా వస్తుంది అనగానే పోటీగా జవాన్ కూడా రాబోతోంది అన్నప్పుడు కాస్త కంగారు పడ్డాను.

By:  Tupaki Desk   |   21 Sep 2023 4:14 PM GMT
జవాన్ తో పోటీ.. పొలిశెట్టి ఏమన్నాడంటే..
X

టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు మంచి టాలెంటెడ్ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకుంటున్న హీరోలలో నవీన్ పోలిశెట్టి టాప్ ప్లేస్ లో ఉంటాడు అని చెప్పవచ్చు. మొదట నెగిటివ్ రోల్స్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కొన్ని పాత్రలు చేసిన అతను ఆ తర్వాత మెల్లమెల్లగా హీరోగా అడుగులు వేస్తూ బాక్సాఫీస్ వద్ద మంచి మార్కెట్ సంపాదించుకున్నాడు.

హీరోగా మొదటి సినిమా ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ ఎలాంటి ఫలితాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక తర్వాత వచ్చిన జాతి రత్నాలు సినిమా అతని రేంజ్ను పెంచింది. రీసెంట్గా అనుష్కతో చేసిన మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి.. మరో రేంజ్ లో సక్సెస్ అయితే ఇచ్చింది. ఇక సినిమా సక్సెస్ అయిన సందర్భంగా నవీన్ తన అనుభవాలను ప్రత్యేకంగా వివరించాడు.

ముఖ్యంగా ఈ సినిమా డేట్ అనౌన్స్ చేసినప్పుడు చాలా కంగారు పడినట్లు కూడా తెలియజేశాడు. నవీన్ మాట్లాడుతూ మొదట సెప్టెంబర్ 7న ఈ సినిమా వస్తుంది అనగానే పోటీగా జవాన్ కూడా రాబోతోంది అన్నప్పుడు కాస్త కంగారు పడ్డాను. అంత పెద్ద సినిమాతో పోటీగా మా సినిమా ప్రేక్షకుల దగ్గరవుతుందా అనే టెన్షన్ అయితే పడ్డాను. కానీ కంటెంట్ నచ్చితే ఆడియన్స్ సినిమాను ఎక్కడికో తీసుకెళ్తారు అని నిరూపించారు.

ఈ సినిమాకు జనాల ఆదరణ ద్వారానే బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ పెరుగుతూ వచ్చాయి. ఇక ఈ సినిమాకు అన్ని ఏరియాలనుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. వారం తర్వాత యుఎస్ లో ఏ సినిమా కూడా అంతగా కనిపించదు. కానీ ప్రీమియర్స్ నుంచి ఇప్పటివరకు సినిమా మంచి కలెక్షన్స్ అందుకుంటుంది. ఆస్ట్రేలియా న్యూజిలాండ్ కెనడా వంటి దేశాల్లో కూడా ప్రేక్షకుల డిమాండ్ మేరకు షో నెంబర్స్ పెరుగుతూ ఉన్నాయి.

మేము చేసిన ప్రయత్నానికి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చినందుకు వాళ్లకు హ్యాట్సాఫ్ చెప్పుకోవాల్సిందే. నాకు ప్రతి డిఫరెంట్ సినిమా చేయాలని ఉంది. దాదాపు అన్ని జానర్స్ ఇష్టపడతాను. ఇక ఇండస్ట్రీలో చిరంజీవి గారు అంటే నాకు ప్రత్యేకమైన అభిమానం. ప్రభాస్ కూడా నా ఫేవరెట్ హీరో. ఇంకా ప్రతిభాషలో కూడా సినిమాలు చేయాలని ఉంది. హిందీలో కూడా రెండు మూడు కథలు విన్నాను. కానీ ప్రస్తుతం నా ఫోకస్ మొత్తం తెలుగు పైనే ఉంది. తెలుగులో అయితే మూడు కథలు లాక్ అయ్యాయి. వచ్చేఏడాది ఒక్కొక్కటి స్టార్ట్ అవుతుంది. ఇక టైం దొరికితే కపిల్ షో లాంటి మంచి కామెడీ ప్రోగ్రామ్స్ చేయాలని ఉంది. కానీ సినిమాలతోనే చాలా బిజీగా ఉన్నాను.. టైం సరిపోకపోవచ్చు అని నవీన్ వివరణ ఇచ్చాడు.