Begin typing your search above and press return to search.

నవీన్ పొలిశెట్టి.. మామూలోడు కాదు

ఇక తన సినిమాలను అతను ప్రమోట్ చేసే తీరు కూడా ఎంతో ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ చిత్రాన్ని అతను భుజాన వేసుకుని మోసిన తీరు టాలీవుడ్లో చర్చనీయాంశం అయింది

By:  Tupaki Desk   |   16 Oct 2023 4:31 AM GMT
నవీన్ పొలిశెట్టి.. మామూలోడు కాదు
X

ప్రస్తుత టాలీవుడ్ కథానాయకుల్లో నవీన్ పొలిశెట్టి చాలా యునీక్‌గా కనిపిస్తాడు. ఏ పాత్ర ఇచ్చినా అందులో అతను ఒదిగిపోయే తీరు చూసి ముచ్చటేస్తుంది. హీరోగా నటించిన మూడు సినిమాలు ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’, ‘జాతిరత్నాలు’; ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’.. ఈ ముడు చిత్రాల్లో ఏ పాత్రకూ ఇంకో పాత్రతో పోలిక ఉండదు. ఆయా పాత్రల్లో నవీన్‌ను తప్ప మరొకరిని ఊహించుకోలేం అన్నట్లుగా ఉంటుంది తన పెర్ఫామెన్స్. ఈ మూడు పాత్రలను అద్భుతంగా పండించి ఆ సినిమాలు పెద్ద విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు నవీన్. ఇక తన సినిమాలను అతను ప్రమోట్ చేసే తీరు కూడా ఎంతో ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ చిత్రాన్ని అతను భుజాన వేసుకుని మోసిన తీరు టాలీవుడ్లో చర్చనీయాంశం అయింది. హీరోయిన్ అనుష్క శెట్టి అందుబాటులో లేని స్థితిలో తనే ఎక్కడెక్కడో తిరిగి జనాల్లోకి సినిమాను తీసుకెళ్లాడు.

యుఎస్‌లో ఎన్నో సిటీలు తిరిగి సినిమాను ప్రమోట్ చేయడంలో తనకు తానే సాటి అనిపించాడు నవీన్. ఈ చిత్రం థియేట్రికల్ రన్ ముగిసి.. ఓటీటీలోకి వచ్చాక కూడా తన ప్రమోషన్ ఆగలేదు. తాజాగా యుఎస్‌ నుంచి అతను రిలీజ్ చేసిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. యూట్యూబ్‌లో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న ‘నా అన్వేషణ’ అనే యూట్యూబ్ ఛానెల్ గురించి నెటిజన్లకు తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా తిరుగుతూ తనలోని రసికతను చాటుతూ అతను చేసే వీడియోలు యూట్యూబ్‌లో బాగా పాపులర్. ఆ వ్యక్తిని నవీన్ ఈ వీడియోలో ఇమిటేట్ చేయడం విశేషం. ఇమిటేట్ చేయడం అంటే వాయిస్ వస్తుంటే లిప్ సింక్ ఇవ్వడం కాదు. ఆ వ్యక్తిని నవీన్ మిమిక్రీ చేశాడు. యాజిటీజ్ తన వాయిస్‌ను దింపేశాడు. ‘నా అన్వేషణ’ వీడియోల స్టయిల్లోనే మాట్లాడుతూ ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ సినిమా చూడాలని యువ ప్రేక్షకులను అతను కోరిన విధానం అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ వీడియో చూసి నవీన్ మామూలోడు కాదని అతడి టాలెంట్‌ను, కమిట్మెంట్‌ను కొనియాడుతున్నారు నెటిజన్లు.