Begin typing your search above and press return to search.

మన నవీన్ అక్కడ మోస్ట్‌ వాంటెడ్‌...!

అందాల రాక్షసి సినిమా తో నటుడిగా మంచి గుర్తింపుని దక్కించుకున్న నవీన్ చంద్ర ఈ మధ్య కాలంలో మోస్ట్‌ వాంటెడ్ క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా నిలిచాడు.

By:  Tupaki Desk   |   11 Nov 2023 3:58 AM GMT
మన నవీన్ అక్కడ మోస్ట్‌ వాంటెడ్‌...!
X

సంభవామి యుగేయుగే సినిమా తో తెలుగు సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన నవీన్ చంద్ర సరైన గుర్తింపు రావడానికి చాలా కాలం వెయిట్‌ చేయాల్సి వచ్చింది. అందాల రాక్షసి సినిమా తో నటుడిగా మంచి గుర్తింపుని దక్కించుకున్న నవీన్ చంద్ర ఈ మధ్య కాలంలో మోస్ట్‌ వాంటెడ్ క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా నిలిచాడు.

హీరోగా పలు సినిమాల్లో నటించినా కూడా దక్కని సక్సెస్‌ నెగటివ్‌ షేడ్స్ ఉన్న పాత్రలు చేయడం ద్వారా లభించాయి. ఎన్టీఆర్ సినిమా అరవింద సమేత లో నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించిన నవీన్‌ చంద్ర ఆ తర్వాత నుంచి అలాంటి పాత్రలు ఎక్కువగా దక్కించుకుంటున్నాడు.

తెలుగు నటులు టాలీవుడ్‌ లో నటించడం కామన్‌ విషయం, ఇతర భాషల నటులు తెలుగు లో నటించడం కూడా మనం చూస్తూనే ఉంటాం. కానీ తెలుగు నటులు మాత్రం ఇతర భాషల్లో నటించడం చాలా అరుదుగా చూస్తూ ఉంటాం. నవీన్ చంద్ర ప్రస్తుతం తమిళ్‌ లో వరుస సినిమాలతో బిజీ స్టార్‌ గా దూసుకు పోతున్నాడు.

తాజాగా ఎస్ జే సూర్య మరియు రాఘవ లారెన్స్ ముఖ్య పాత్రల్లో నటించిన జిగర్ తండ డబుల్ ఎక్స్‌ సినిమాలో నవీన్ చంద్ర పాత్ర ఆ ఇద్దరికి ఏమాత్రం తగ్గకుండా ఉంది. సినిమాలో తన పాత్రకు తగ్గట్లుగా అద్భుతమైన నటనతో నవీన్‌ చంద్ర మెప్పించాడు. దాంతో సినిమా ఫలితం తో సంబంధం లేకుండా నవీన్ చంద్ర కి మంచి మార్కులు పడుతున్నాయి.

మొత్తానికి స్టార్‌ హీరోల సినిమాల్లో నెగటివ్‌ షేడ్స్ ఉండే పాత్రకు మరియు ముఖ్య పాత్రలకు మోస్ట్‌ వాంటెడ్ గా మారుతున్నాడు. ముందు ముందు తమిళ్‌ లో మరిన్ని సినిమాలను కూడా నవీన్ చంద్ర చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మన తెలుగు నటుడికి కోలీవుడ్ బ్రహ్మరథం పట్టడం కచ్చితంగా గర్వించదగ్గ విషయం. నవీన్‌ ముందు ముందు అక్కడ హీరోగా కూడా మంచి గుర్తింపు దక్కించుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.