Begin typing your search above and press return to search.

గేమ్ చేంజర్.. బెస్ట్ లీక్ ఇచ్చిన యంగ్ హీరో

ఇదిలా ఉంటే ఈ సినిమాలో రామ్ చరణ్ కి జోడీగా బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ నటిస్తోంది.

By:  Tupaki Desk   |   30 April 2024 4:42 PM GMT
గేమ్ చేంజర్.. బెస్ట్ లీక్ ఇచ్చిన యంగ్ హీరో
X

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కతోన్న పాన్ ఇండియా మూవీ గేమ్ చేంజర్. ఈ మూవీ షూటింగ్ చివరి దశకి వచ్చేసింది. భారీ బడ్జెట్ తో దిల్ రాజు ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఆర్ఆర్ఆర్ తర్వాత రామ్ చరణ్ సోలోగా చేస్తోన్న పాన్ ఇండియా మూవీ కావడంతో ఎక్స్ పెక్టేషన్స్ హై ఎండ్ లో ఉన్నాయి. ఇదిలా ఉంటే ఈ సినిమాలో రామ్ చరణ్ కి జోడీగా బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ నటిస్తోంది.

అలాగే అంజలి కీలక పాత్రలో కనిపిస్తోంది. ఎస్.జె. సూర్య ప్రతినాయకుడిగా కనిపించబోతున్నాడు. పొలిటికల్ థ్రిల్లర్ జోనర్ లో ఈ మూవీ తెరకెక్కుతోంది. కార్తిక్ సుబ్బరాజు ఈ చిత్రానికి కథ అందించడం విశేషం. గేమ్ చేంజర్ సినిమాని ఈ ఏడాది ఆఖరులో రిలీజ్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. కచ్చితంగా రామ్ చరణ్ కెరియర్ లో గేమ్ చేంజర్ బెస్ట్ మూవీ అవుతుందని చిత్ర యూనిట్ భావిస్తోంది.

ఇదిలా ఉంటే ఈ సినిమా గురించి యంగ్ హీరో నవీన్ చంద్ర ఇంటరెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు. గేమ్ చేంజర్ మూవీలో తాను కూడా నటిస్తున్నట్లు చెప్పాడు. అలాగే తన పాత్ర మూవీలో చాలా కీలకంగా ఉంటుందని ఓ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చాడు. ఆరంభంలో లో పాజిటివ్ గా ఉండే క్యారెక్టర్ తరువాత వైల్డ్ విలన్ గా రివీల్ అవుతుందని తెలిపాడు.

ఆ సీక్వెన్స్ లో వచ్చే ట్విస్ట్ సినిమాలో హైలైట్ గా ఉండబోతోందని చెప్పాడు. దీంతో ఇప్పుడు గేమ్ చేంజర్ లో ఎస్.జె.సూర్యతో పాటుగా నవీన్ చంద్ర కూడా ఒక విలన్ గా ఉండబోతున్నాడని అర్ధమవుతోంది. నవీన్ చంద్ర ప్రస్తుతం సౌత్ లో లీడ్ యాక్టర్ గా కొనసాగుతున్నాడు. అలాగే ఈ సినిమాలో శ్రీకాంత్ కూడా ఒక కీలకమైన పాత్రలో కనిపించబోతున్నాడు.

ఓ వైపు హీరోగా చేస్తూనే మరో వైపు ఇతర హీరోల చిత్రాలలో విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి ప్రాధాన్యత ఉన్న పాత్రలలో నటిస్తున్నాడు. తమిళ్, కన్నడ, మలయాళీ భాషలలో కూడా నవీన్ చంద్ర మూవీస్ చేస్తూ ఉండటం విశేషం. రీసెంట్ అమెజాన్ ప్రైమ్ ఇన్ స్పెక్టర్ రిషి అనే వెబ్ సిరీస్ లో నటించాడు. ప్రస్తుతం ప్రైమ్ వీడియోస్ లో ట్రెండింగ్ లో ఉంది. గేమ్ చేంజర్ లో నవీన్ చంద్ర నటిస్తున్నాడనే న్యూస్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.