Begin typing your search above and press return to search.

హీరోకి కండోమ్స్ తో ప్రపోజల్‌, ఆ తర్వాత..!

అందాల రాక్షసి సినిమాతో నవీన్ చంద్ర కు తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు దక్కింది

By:  Tupaki Desk   |   30 Jan 2024 3:00 AM GMT
హీరోకి కండోమ్స్ తో ప్రపోజల్‌, ఆ తర్వాత..!
X

అందాల రాక్షసి సినిమాతో నవీన్ చంద్ర కు తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు దక్కింది. హీరోగానే సినిమాలు చేయాలి, కమర్షియల్‌ పాత్రలు మాత్రమే చేయాలి అని గిరి గీసుకోకుండా విలన్ రోల్స్‌ ని కూడా చేస్తూ ఉన్నాడు. తెలుగు సినిమాల్లోనే కాకుండా తమిళ్‌ సినిమాల్లో కూడా నవీన్ చంద్ర నటిస్తూ ఉన్నాడు.

నటుడిగా మంచి మార్కులు దక్కించుకున్న నవీన్ చంద్ర తాజాగా రీతూ చౌదరి హోస్ట్‌ గా చేస్తున్న దావత్‌ అనే షో కి హాజరు అయ్యాడు. ఆ టాక్ షో లో తన వ్యక్తిగత విషయాలను మరియు కెరీర్‌ పరంగా చాలా విషయాలను పంచుకున్నాడు. తనకు వచ్చిన లవ్‌ ప్రపోజల్స్ గురించి కూడా నవీన్‌ చంద్ర చెప్పుకొచ్చాడు.

కెరీర్‌ ఆరంభంలో సినిమాల్లో నటిస్తూ ఒక రూం లో అద్దెకు ఉండేవాడట. ఆ సమయంలో ఒక అమ్మాయి తనకు పలు విధాలుగా ప్రపోజ్ చేసేది. ఒక సారి అండర్ వేర్ మరియు కండోమ్‌ ఇచ్చి మరీ ప్రపోజ్ చేసింది. దాంతో నేను తట్టుకోలేక ఆ ఇంటి నుంచి మరో ఇంటికి మారాను అంటూ నవీన్ చంద్ర తెలియజేశాడు.

నాలుగు సంవత్సరాల క్రితం పెళ్లి అయ్యిందని, ప్రస్తుతం తనకు ఒక అబ్బాయి ఉన్నాడని నవీన్ చంద్ర అన్నాడు. ప్రస్తుతం తన కెరీర్‌ పరంగా మరియు వ్యక్తిగతం చాలా సంతోషంగా ఉన్నట్లుగా పేర్కొన్నాడు. ప్రస్తుతం నవీన్ చంద్ర వరుసగా సినిమాలు చేస్తూ కెరీర్‌ లో బిజీ బిజీగా ఉన్నాడు.