Begin typing your search above and press return to search.

వాళ్లు అడిగారు సరే మన హీరో ఓకే అనాలిగా..?

ఈ సినిమాలో లక్ష్మణుడిగా నవీన్ పొలిశెట్టిని అడిగారని తెలుస్తుంది. అయితే వాళ్లు అడిగినా సరే నవీన్ పొలిశెట్టి ఆ పాత్ర చేసేందుకు అంతగా ఇంట్రెస్ట్ చూపించడని చెప్పొచ్చు.

By:  Tupaki Desk   |   30 Jan 2024 4:30 AM GMT
వాళ్లు అడిగారు సరే మన హీరో ఓకే అనాలిగా..?
X

యువ హీరోల్లో మల్టీ టాలెంటెడ్ గా సినిమాలతో సత్తా చాటుతున్న నవీన్ పొలిశెట్టి తన రీసెంట్ మూవీ మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాతో హ్యాట్రిక్ హిట్ అందుకున్నాడు. సినిమాలో అనుష్క లాంటి హీరోయిన్ ఉన్నా కూడా సినిమా మొత్తం తన నటనతో మెప్పించి అదరగొట్టాడు నవీన్ పొలిశెట్టి. ఈ సినిమా తర్వాత అనగనగా ఒక రాజు చేస్తున్నాడని తెలుస్తుంది. అయితే ఆ సినిమా గురించి ఎలాంటి అప్డేట్స్ బయటకు రావట్లేదు.


ఇదిలా ఉంటే బాలీవుడ్ రామాయణంలో నవీన్ పొలిశెట్టి కూడా నటిస్తున్నాడని వార్తలు వచ్చాయి. నితీష్ తివారి డైరెక్షన్ లో తెరకెక్కే రామాయణం లో రణ్ బీర్ కపూర్ రాముడిగా నటిస్తుండగా సాయి పల్లవి సీత పాత్రలో కనిపించనుంది. ఈ సినిమాలో లక్ష్మణుడిగా నవీన్ పొలిశెట్టిని అడిగారని తెలుస్తుంది. అయితే వాళ్లు అడిగినా సరే నవీన్ పొలిశెట్టి ఆ పాత్ర చేసేందుకు అంతగా ఇంట్రెస్ట్ చూపించడని చెప్పొచ్చు.

సోలో హీరోగా సినిమాలు చేస్తున్న ఇలాంటి టైం లో బాలీవుడ్ సినిమాలు అది కూడా రామాయణం లాంటి సినిమాల్లో లక్ష్మణుడిగా అంటే నవీన్ పొలిశెట్టి కెరీర్ కి అది అంతగా ఉపయోగపడకపోవచ్చు అనే ఆలోచనలో ఉన్నాడు. అంతకుముందు సినిమాల్లో ఛాన్స్ వస్తే చాలనుకున్న నవీన్ ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయతో హీరోగా మారి సర్ ప్రైజ్ హిట్ కొట్టాడు. ఆ తర్వాత జాతిరత్నాలు సినిమాతో సెన్సేషన్ సృష్టించాడు.

మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టితో మరో సక్సెస్ అందుకున్నాడు. ఈ 3 సినిమాలు నవీన్ కెరీర్ ని ఎక్కడికో తీసుకెళ్లాయి. తప్పకుండా నవీన్ రాబోయే సినిమాలతో తన సత్తా చాటుతాడని చెప్పొచ్చు. ఐతే బాలీవుడ్ రామాయణంలో మాత్రం అతను నటించే అవకాశం ఉండదని చెప్పొచ్చు. ఒకవేళ అక్కడ ఫ్యాన్స్ ని డిఫరెంట్ మూవీతో అలరిద్దామనే ఆలోచనతో ఓకే చెప్పినా చెప్పొచ్చు కానీ నవీన్ మాత్రం ఆ సినిమా విషయంలో అంత ఫోకస్ గా లేడని అర్థమవుతుంది.

అయితే నవీన్ సినిమా సినిమాకు ఎక్కువ గ్యాప్ తీసుకోవడం కూడా అతని కెరీర్ కు అంత మంచిది కాదని చెప్పొచ్చు. మిస్ శెట్టి సినిమా లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ లో రిలీజైంది. ఇప్పటివరకు తన నెక్స్ట్ సినిమా అప్డేట్ రాలేదు. అలా కాకుండా సినిమాల ఎంపికలో కాస్త దూకుడు పెంచితే బెటర్ అని అంటున్నారు నవీన్ పొలిశెట్టి ఫ్యాన్స్.