మూడేళ్ల క్రితమే మైత్రి ప్లాన్.. పోలిశెట్టి 'నెక్స్ట్' మూవీ అదేనా?
అయితే మైత్రి సంస్థ మూడేళ్ల క్రితమే నవీన్ కు అడ్వాన్స్ ఇచ్చి ప్రాజెక్ట్ ను లాక్ చేసుకున్నట్లు తెలుస్తోంది.
By: M Prashanth | 6 Feb 2026 8:17 PM ISTయంగ్ హీరో నవీన్ పోలిశెట్టి ఫుల్ ఫామ్ లో ఉన్న విషయం తెలిసిందే. రీసెంట్ గా సంక్రాంతి కానుకగా థియేటర్స్ లోకి అనగనగా ఒక రాజు మూవీతో వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. రూ.100 కోట్ల విజయాన్ని సొంతం చేసుకుని సత్తా చాటారు. అదే సమయంలో వరుసగా నాలుగో సక్సెస్ ను తన ఖాతాలో వేసుకున్నారు. అనగనగా రాజు మూవీకి ముందు చేసిన ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ, జాతి రత్నాలు, మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి హిట్లే.
అందుకే నవీన్ పోలిశెట్టి హాట్ టాపిక్ గా మారారు. ముఖ్యంగా ఆయనకు ఇండస్ట్రీ వర్గాల నుంచి విషెస్ వెల్లువెత్తుతున్నాయి. తాజాగా టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్.. నవీన్ కు ప్రత్యేకంగా విషెస్ తెలిపింది. నవీన్ కు మైత్రి అధినేతల్లో ఒకరైన నవీన్ బొకే ఇస్తున్న పిక్ షేర్ చేసింది. అంతేకాదు, తమ బ్యానర్ పై నవీన్ తో కలిసి చేయబోయే కొత్త ప్రాజెక్ట్ పై కూడా అఫీషియల్ గా అప్డేట్ ఇచ్చింది.
దీంతో ఆ విషయంపై ఇప్పుడు టాలీవుడ్ లో చర్చ మొదలైంది. ఎందుకంటే అనగనగా ఒక రాజు మూవీ తర్వాత చాలామంది నిర్మాతలు.. నవీన్ పోలిశెట్టిని అప్రోచ్ అయ్యారని వార్తలు వస్తున్నాయి. కానీ మైత్రి మూవీ మేకర్స్ మాత్రం సినిమాను ఫైనల్ చేసుకుంది. ముఖ్యంగా ఫామ్ లో ఉన్నవారి టాలెంట్ ను వెంటనే గుర్తించి ప్రోత్సహించడంలో మైత్రి ఎప్పుడూ ముందుంటుందని మరోసారి ప్రూవ్ చేసుకుంది!
అయితే మైత్రి సంస్థ మూడేళ్ల క్రితమే నవీన్ కు అడ్వాన్స్ ఇచ్చి ప్రాజెక్ట్ ను లాక్ చేసుకున్నట్లు తెలుస్తోంది. అందుకే ఇప్పుడు నవీన్ తన నెక్స్ట్ మూవీ.. వారితో చేస్తారని ప్రచారం జరుగుతోంది. ఇక మైత్రి బ్యానర్ తో ఆయన చేయబోయే సినిమా కూడా భిన్నమైన కాన్సెప్ట్ తో, కంప్లీట్ ఎంటర్టైనర్ గా ఉండబోతుందనే సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తోంది.
ఎందుకంటే.. రెమ్యునరేషన్ విషయంలో ఫ్లెక్సిబుల్ గా ఉన్నప్పటికీ, కథ విషయంలో నవీన్ పోలిశెట్టి మాత్రం ఎప్పుడూ రాజీ పడరని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంటుంది. స్క్రిప్ట్ స్ట్రాంగ్ ఉంటేనే ఓకే చెప్పే ఆయన.. కంటెంట్ కు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. అందుకే నవీన్ సినిమాలకు యూత్ లో స్పెషల్ క్రేజ్ ఏర్పడింది. ఇప్పుడు మైత్రితో ప్రాజెక్టు విషయంలో కూడా అంతేనట.
ప్రస్తుతం ఆ ప్రాజెక్ట్ కు సంబంధించిన పూర్తి వివరాలు బయటకు రాకపోయినా.. త్వరలో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. మరోవైపు నిర్మాతలు వెంకట్ బోయనపల్లి, సాహు గారపాటి కూడా నవీన్ కు అడ్వాన్స్ ఇచ్చి వెయిట్ చేస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. అంటే నవీన్ కు డిమాండ్ ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది. మొత్తానికి.. రూ.100 కోట్ల హిట్ తో జోష్ లో ఉన్న నవీన్.. మైత్రి మూవీ మేకర్స్ తో చేయబోయే సినిమా ఎలా ఉండబోతుందో వేచి చూడాలి.
