Begin typing your search above and press return to search.

నవీన్ పొలిశెట్టి పరుగెత్తాల్సిందే..!

ప్రస్తుతం నవీన్ పొలిశెట్టి అనగనగా ఒక రాజు సినిమా చేస్తున్నాడు. ఆ సినిమాను 2026 సంక్రాంతికి రిలీజ్ టార్గెట్ పెట్టారు.

By:  Tupaki Desk   |   30 May 2025 6:30 PM
నవీన్ పొలిశెట్టి పరుగెత్తాల్సిందే..!
X

టాలీవుడ్ యువ హీరోల్లో మోస్ట్ టాలెంటెడ్ గా ఉన్న నవీన్ పొలిశెట్టి కొత్త కథలతో ఎప్పటికప్పుడు తెలుగు ప్రేక్షకులను అలరించే సినిమాలతో వస్తున్నాడు. హీరోగా మొదటి ప్రయత్నమే ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ అంటూ అదిరిపోయే సినిమా చేసిన నవీన్ పొలిశెట్టి జాతిరత్నాలు సినిమాతో సెన్సేషనల్ హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి కూడా ఆడియన్స్ ని మెప్పించింది.

ప్రస్తుతం నవీన్ పొలిశెట్టి అనగనగా ఒక రాజు సినిమా చేస్తున్నాడు. ఆ సినిమాను 2026 సంక్రాంతికి రిలీజ్ టార్గెట్ పెట్టారు. నవీన్ తో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తుంది. నవీన్ పొలిశెట్టి సినిమా అంటే సూపర్ ఎంటర్టైన్మెంట్ పక్కా అనే విధంగా క్రేజ్ తెచ్చుకున్నాడు. టికెట్ కొని థియేటర్ కి వచ్చే ఆడియన్స్ ని ఫుల్ ఎంటర్టైన్ చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు నవీన్ పొలిశెట్టి.

ఇతే సినిమాలైతే చేస్తున్నాడు కానీ వాటి మధ్య గ్యాప్ మాత్రం చలా ఉంటుంది. దాన్ని కచ్చితంగా నవీన్ పొలిశెట్టి సరిచేసుకోవాల్సిందే. నవీన్ పొలిశెట్టి అనగనగా ఒక రాజు కూడా చాలా రోజులుగా సెట్స్ మీద ఉంది. ఆ సినిమా కూడా రిలీజ్ అవ్వడానికి ఇంకా 8 నెలలు దాకా ఉంది. అప్పటిదాకా ఆ సినిమానే చేస్తూ ఉండాలి. ఒకవేళ వేరే సినిమా కమిట్ అయినా అనగనగా ఒక రాజు సినిమా వచ్చిన తర్వాతే ఆ సినిమా రిలీజ్ ఉంటుంది.

యువ హీరోలంతా కూడా సినిమాను 3, 4 నెలల్లో పూర్తి చేసి ఏడాదికి ఒకటి రెండు సినిమాలు రిలీజ్ చేస్తుంటే నవీన్ ఆ విషయంలో వెనకపడుతున్నాడు. ఐతే మధ్యలో నవీన్ కి ఒక యాక్సిడెంట్ అవ్వడం వల్ల ఇలా గ్యాప్ వచ్చింది కానీ ఇక మీదట అలాంటి గ్యాప్ ఉండదని అంటున్నారు. అనగనగా ఒక రాజు తర్వాత నవీన్ పొలిశెట్టి చేయబోయే సినిమా ఏంటన్నది కూడా క్లారిటీ రాలేదు.

ఆ కాంబినేషన్ ఏదో త్వరగా సెట్ చేసుకుని నవీన్ కాస్త దూకుడు పెంచితే అతన్ని ఎంకరేజ్ చేయడానికి ఆడియన్స్ అంతా కూడా సిద్ధంగా ఉన్నారు. నవీన్ సినిమాలు చాలా సరదాగా ఉంటాయి. ఎంటర్టైనర్స్ తో అలరిస్తున్న నవీన్ ఏదో ఒకరోజు మాస్ టర్న్ కూడా తీసుకుంటే చూడాలని కూడా అతని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.