Begin typing your search above and press return to search.

థ్రిల్లింగ్ ‘ఎలెవన్’ కోసం నితిన్ సపోర్ట్!

టాలెంటెడ్ యాక్టర్ నవీన్ చంద్ర మొదట హీరోగానే ఎంట్రీ ఇచ్చినప్పటికీ ఆ తరువాత పలు సినిమాల్లో సపోర్టింగ్ క్యారెక్టర్లతో కూడా ఆకట్టుకుంటు వస్తున్నాడు.

By:  Tupaki Desk   |   21 April 2025 4:27 PM
N Sudhakar Reddy Bagged Eleven Rights
X

టాలెంటెడ్ యాక్టర్ నవీన్ చంద్ర మొదట హీరోగానే ఎంట్రీ ఇచ్చినప్పటికీ ఆ తరువాత పలు సినిమాల్లో సపోర్టింగ్ క్యారెక్టర్లతో కూడా ఆకట్టుకుంటు వస్తున్నాడు. నటుడిగా పలు పాత్రలతో మంచి గుర్తింపు అందుకుంటున్నాడు. అయితే హీరోగా అతను సెలెక్ట్ చేసుకునే కథలు కూడా డిఫరెంట్ గా ఉంటున్నాయి. ఇక నెక్స్ట్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఇంటెన్స్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ‘ఎలెవన్’ సినిమాతో రాబోతున్నాడు.

ఈ సినిమా మే 16న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. టెక్నికల్ గా స్ట్రాంగ్‌గా రూపొందిన ఈ బైలింగ్వల్ థ్రిల్లర్ పై ఇప్పటికే మంచి బజ్ ఏర్పడగా.. తాజాగా సినిమా థియేట్రికల్ రైట్స్‌ను ప్రముఖ డిస్ట్రిబ్యూటర్, హీరో నితిన్ తండ్రి ఎన్.సుధాకర్ రెడ్డి సొంతం చేసుకోవడం ప్రత్యేక ఆకర్షణగా మారింది. తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో హిట్ సినిమాలను డిస్ట్రిబ్యూట్ చేసిన అనుభవం ఉన్న సుధాకర్ రెడ్డి.. ఈసారి ‘ఎలెవన్’ సినిమాకు పెద్ద రేంజ్ రిలీజ్ ఇవ్వబోతున్నారని తెలుస్తోంది.

ఓవైపు నవీన్ చంద్ర వంటి వర్సటైల్ యాక్టర్ ఉండడం, మరోవైపు కథలోని ఇంటెన్స్ నేచర్, మిస్టరీ మూడ్‌కి తగిన మేకింగ్ ఉండడంతో.. థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే ఆడియన్స్ కు ఇది మంచి అనుభూతిని ఇవ్వబోతుందనడంలో సందేహం లేదు. ఈ చిత్రానికి దర్శకుడు లోకేష్ ఏజెల్స్. ప్రముఖ దర్శకుడు సుందర్ సి వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేసిన అనుభవాన్ని ఉపయోగించి ఈ సినిమాను ఎంతో ప్రత్యేకంగా రూపొందించారని సమాచారం.

సినిమాలో అభిరామి, శశాంక్, రేయా హరి, రవి వర్మ, కీర్తి దామరాజు లాంటి నటులు ఉన్నారు. వీరందరి పాత్రలూ కథలో కీలక మలుపులకు కారణమవుతాయని తెలుస్తోంది. ‘ఎలెవన్’ సినిమాను అజ్మల్ ఖాన్ మరియు రేయా హరి కలిసి నిర్మించారు. క్వాలిటీ విషయంలో ఏమాత్రం కాంప్రమైజ్ కాకుండా నిర్మించిన ఈ చిత్రానికి జాతీయ పురస్కార విజేత డి.ఇమ్మాన్ సంగీతాన్ని అందించగా, శ్రీకాంత్ ఎన్.బీ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కెమెరామెన్ కార్తిక్ అశోకన్ విజువల్స్‌ను అద్భుతంగా ప్రజెంట్ చేసినట్లు ట్రైలర్ ద్వారా ఇప్పటికే అర్థమైంది.

టెక్నికల్‌గా బలమైన బ్యాకప్ ఉన్న ఈ సినిమాకు సడన్‌గా భారీ రిలీజింగ్ ప్లాన్ రావడం గమనార్హం. ఇది దర్శక నిర్మాతల కాన్ఫిడెన్స్ ను చూపిస్తుంది. పైగా, నవీన్ చంద్రకు ఉన్న నమ్మకమైన ఫాలోయింగ్, ఇతని నటనకు సంబంధించిన అంచనాలు ఈ సినిమాకు అదనపు బలంగా మారనున్నాయి. మొత్తానికి మే 16న థియేటర్లలో అడుగుపెట్టబోతున్న ‘ఎలెవన్’ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.