ఎనిమిది భాషలొచ్చు..అన్నింటి కోసం నేనే రంగంలోకి!
యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు భాషలపై మంచి పట్టు ఉంది. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం అన్ని భాషలు అనర్గళంగా మాట్లాడుతాడు.
By: Tupaki Desk | 15 May 2025 1:30 PMయంగ్ టైగర్ ఎన్టీఆర్ కు భాషలపై మంచి పట్టు ఉంది. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం అన్ని భాషలు అనర్గళంగా మాట్లాడుతాడు. హిందీ కూడా బాగా మాట్లాడుతాడు. ఆర్ ఆర్ ఆర్ జపాన్ ప్రచారం లో భాగంగా అక్కడ జపనీస్ నేర్చుకుని మాట్లాడి అందర్నీ ఆకట్టుకున్నాడు. ఇలా ఇన్ని భాషలు మాట్లాడటం తారక్ కి మాత్రమే చెల్లింది. మిగతా హీరోలు దాదాపు ఇంగ్లీష్ లోనే మాట్లాడుతారు.
స్థానిక భాషలపై సరైన పట్టు లేకపోవడం వల్ల మాట్లాడే సాహసం పెద్దగా చేయరు. తారక్ ను వాళ్లందరి నుంచి ఈ ప్రత్యేకమైన లక్షణం వేరు చేస్తుంది. అతడు ఎంత గొప్ప నటుడో అంతకు మించి గొప్ప నేర్పరి కూడా. ఏదైనా చాలా ఈజీగా నేర్చుకుంటారు? అన్న ది ఆయనపై ఉంది. అలా భాషల్లో స్పెషలిస్ట్ ఎవరు? అంటే అంతా తారక్ పేరు చెబుతారు. తాజాగా నటుడు నవీన్ చంద్ర కూడా తనకు ఎనిమిది భాష లొచ్చు అంటూ సర్ ప్రైజ్ చేసాడు.
సౌత్ లో అన్ని భాషల్లోనూ మాట్లాడుతాడుట. ఏ భాషలో సినిమా చేసిన తానే స్వయంగా డబ్బింగ్ చెప్పు కుంటాడట. తాను ఏ సినిమా చేసిన కొత్త సినిమా కోసం పది మంది ప్రేక్షకులైనా పెరగాలి అన్నది స్ట్రాంగ్ పెట్టుకుని పనిచేస్తున్నట్లు తెలిపాడు. అందుకే అన్ని రకాల పాత్రలు పోషిస్తున్నట్లు క్లారిటీ ఇచ్చాడు. నవీన్ చంద్ర హీరో గాపరిచయమై అవకాశాలు రాకపోవడంతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా టర్న్ తీసుకున్నాడు. ఈ దశలో నటుడిగా బిజీ అయ్యాడు.
విలన్ గానూ కొన్ని సినిమాలు చేసాడు. ఆ పాత్రలతో మంచి పేరు సంపాదించాడు. మళ్లీ కొన్ని సినిమాల్లో హీరో అవకాశాలు రావడంతో వాటిని వదలకుండా చేస్తున్నాడు. `లెవెన్` సినిమా అలా కమిట్ అయిందే. త్వరలో కామెడీ సినిమాలు కూడా చేస్తానంటున్నాడు. ఇప్పటి వరకూ ఆ జానర్ టచ్ చేయకపోవడంతో వాటి పైనా ఆసక్తిగా ఉన్నట్లు తెలిపాడు. దీంతో పాటు `కాళీ` అనే ఓ యాక్షన్ చిత్రం చేస్తాడుట. సితార సం స్థలో మరో సినిమా చేస్తున్నట్లు వెల్లడించాడు.