నాని తరహలో పెద్ద సవాలే విసిరిన మరో స్టార్!
ఈ మధ్య స్టార్ హీరోలు రిలీజ్ కు సవాల్ విసురుతోన్న సంగతి తెలిసిందే. కంటెంట్ పై కాన్పిడెన్స్ తో పక్కా హిట్ సినిమా అంటూ కాలరెగరేస్తున్నారు.
By: Tupaki Desk | 12 May 2025 6:27 AMఈ మధ్య స్టార్ హీరోలు రిలీజ్ కు సవాల్ విసురుతోన్న సంగతి తెలిసిందే. కంటెంట్ పై కాన్పిడెన్స్ తో పక్కా హిట్ సినిమా అంటూ కాలరెగరేస్తున్నారు. అలా కాకపోతే డబ్బులు వాపస్ ఇస్తామంటూ ధీమాని వ్యక్తం చేస్తున్నారు. ఇటీవలే నేచురల్ స్టార్ నాని తాను నిర్మించిన `కోర్టు` సినిమా హిట్ అవ్వకపోతే `హిట్ 3` సినిమా చూడొద్దని పెద్ద సవాల్ విసిరిన సంగతి తెలిసిందే. కట్ చేస్తే కోర్టు బ్లాక్ బస్టర్ అయింది.
హిట్ అంతే బ్లాక్ బస్టర్ అయింది. కంటెంట్ మీద ఉన్న నమ్మకంతోనే నాని అంత పెద్ద సవాల్ విసిరి సక్సెస్ అయ్యాడు. తాజాగా ఇదే తరహాలో మరో నటుడు నవీన్ చంద్ర కూడా సవాల్ విసిరాడు. నవీన్ చంద్ర హీరోగా నటించిన `లెవన్` చిత్రం త్వరలో రిలీజ్ అవుతుంది. తెలుగు, తమిళ్ లో తెరకెక్కించిన చిత్రమిది. రిలీజ్ నేపథ్యంలో నవీన్ చంద్ర సినిమాపై ధీమా వ్యక్తం చేసాడు.
ఇప్పటివరకూ సినిమా చూసిన వాళ్లంతా బాగుందని చెప్పారు. మెచ్చుకున్నారు. ఈనెల 15న పెయిడ్ ప్రీమియర్లు వేస్తున్నాం. అవి చూసి ప్రేక్షకులు థియేటర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు నేను డోర్ బయటే నిలబడి ఉంటాను. ఒకవేళ సినిమా నచ్చకపోతే అక్కడే నన్ను డబ్బులు అడగండి. స్పాట్ పేమెంట్ రిటర్న్ చేస్తాను. సినిమా నచ్చకపోతే అలా అడిగే హక్కు మీకుంది. సినిమాలో కథే ముఖ్యం.
ఎవరు నటించారన్నది కాదు. 30 నిమిషాల ఎమోషనల్ సన్నివేశానికి అందరూ కనెక్ట్ అవుతారు` అని అన్నారు. మొత్తానికి ఇదీ పెద్ద సవాలే. నవీన్ చంద్ర తొలుత హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. కానీ సక్సెస్ లు రాకపోవడంతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా టర్న్ అయ్యాడు. ఈ క్రమంలో విలన్ గానూ నటించాడు. ఆ పాత్రలకు మంచి పేరొచ్చింది. అవకాశాలు బాగానే వస్తున్నాయి. ఈ క్రమంలోనే మళ్లీ హీరోగానూ కంబ్యాక్ అవుతున్నాడు.