Begin typing your search above and press return to search.

స‌క్సెస్ లేకున్న ఆఫ‌ర్లు ఫుల్‌.. ఎలా న‌వీన్ చంద్ర‌?

టాలీవుడ్ లో ఉన్న మోస్ట్ హ్యాండ్సమ్ అండ్ టాలెంటెడ్ యాక్టర్స్ లో నవీన్ చంద్ర ఒకరు. 2012లో విడుద‌లైన `అందాల రాక్షసి` సినిమాతో గుర్తింపు పొందిన న‌వీన్ చంద్ర‌.. ప్ర‌స్తుతం హీరోగానే కాకుండా విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానూ రాణిస్తున్నాడు.

By:  Tupaki Desk   |   16 May 2025 7:30 PM
స‌క్సెస్ లేకున్న ఆఫ‌ర్లు ఫుల్‌.. ఎలా న‌వీన్ చంద్ర‌?
X

టాలీవుడ్ లో ఉన్న మోస్ట్ హ్యాండ్సమ్ అండ్ టాలెంటెడ్ యాక్టర్స్ లో నవీన్ చంద్ర ఒకరు. 2012లో విడుద‌లైన 'అందాల రాక్షసి' సినిమాతో గుర్తింపు పొందిన న‌వీన్ చంద్ర‌.. ప్ర‌స్తుతం హీరోగానే కాకుండా విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానూ రాణిస్తున్నాడు. విభిన్నమైన పాత్రలు పోషిస్తూ ప్రతిభావంతుడైన నటుడిగా పేరు తెచ్చుకున్నాడు. నవీన్ చంద్ర కెరీర్ ను గమనిస్తే హిట్ చిత్రాల‌ను వేళ్ళపై లెక్క పెట్టవచ్చు. అయినా కూడా చేతినిండా కొత్త ప్రాజెక్ట్‌ల‌తో క్ష‌ణం తీరిక లేకుండా గ‌డుపుతున్నాడు.

ఇందుకు కార‌ణం లేక‌పోలేదు.. హీరోగా నవీన్ చంద్ర సినిమాల‌న్నీ చాలా మీడియం బ‌డ్జెట్‌తోనే తెర‌కెక్కుతుంటాయి. ఆయ‌న రెమ్యున‌రేష‌న్ కూడా ల‌క్ష‌ల్లోనే ఉంటుంది. దాంతో న‌వీన్ చంద్ర చిత్రాలు బాక్సాఫీస్ వ‌ద్ద యావ‌రేజ్‌గా ఆడిన పెట్టిన డ‌బ్బులు వ‌చ్చేస్తాయ‌న్న ధీమా నిర్మాత‌ల‌కు ఉంది. పైగా హీరో పాత్ర‌ల‌కే ప‌రిమితం కావాలి అన్న రూల్ ను బ్రేక్ చేయ‌డం కూడా న‌వీన్ చంద్ర‌కు క‌లిసొచ్చిన అంశం. దాని ఫ‌లితంగా స‌క్సెస్ అంతంత మాత్రంగానే ఉన్న ఫుల్‌గా ఆఫ‌ర్లు అందుకుంటున్నాడు.

ఇండస్ట్రీలో టైర్ 2, టైర్ 1 హీరోలు సైతం లేనంత బిజీగా నవీన్ చంద్ర ఉంటున్నాడు. ఏడాదికి మూడు నాలుగు చిత్రాలతో ప్రేక్షకులను పలకరిస్తున్నాడు. ఈ ఏడాదిలో ఇప్పటికే నవీన్ చంద్ర నుంచి `గేమ్ చేంజర్`, `28 డిగ్రీస్‌ సెల్సియస్` వంటి చిత్రాలు వచ్చాయి. రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన గేమ్ ఛేంజ‌ర్‌లో `ఇసుక సింహ` పాత్రను పోషించిన నవీన్ చంద్ర.. ఓటీటీలో నేరుగా విడుదలైన 28 డిగ్రీస్‌ సెల్సియస్ లో హీరోగా నటించాడు.

ఇక తాజాగా `లెవ‌న్‌` అనే మూవీతో ఆడియన్స్ కు హాయ్ చెప్పాడు. ఇదొక ఇన్వెస్టిగేటివ్ థ్రిల్ల‌ర్‌. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో చిత్రీకరించబడిన లెవ‌న్‌ మూవీకి మిక్స్డ్ రివ్యూలు వస్తున్నాయి. రొటీన్ స్టోరీనే డైరెక్టర్ లోకేష్ అజ్ల్స్‌ కొత్తగా ప్రజెంట్ చేయడంలో మెప్పించ‌డాని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కథలో భాగంగా వచ్చే ట్విస్టులు కూడా ఆక‌ట్టుకుంటాయ‌ని అంటున్నారు. కాగా, న‌వీన్ చంద్ర ప్ర‌స్తుతం `మాస్ జాత‌ర‌` చిత్రంలో ర‌వితేజ‌కు విల‌న్ గా న‌టిస్తున్నాడు. అలాగే `కాళీ` అనే యాక్ష‌న్ సినిమా చేస్తున్నాడు. హ‌రి ఏలేటి అనే డైరెక్ట‌ర్ తో సునీల్ తో క‌లిసి న‌వీన్ చంద్ర ఓ కామెడీ ఫిల్మ్ చేశాడు. ఇది త్వ‌ర‌లోనే విడుద‌ల కానుంది. వీటితో పాటు సితార‌ బ్యాన‌ర్ లో ఓ సినిమా, త‌మిళంలో ఓ సినిమాకు న‌వీన్ చంద్ర క‌మిట్ అయ్యి ఉన్నాడు.