నవీన్ చంద్ర 'బ్లైండ్ స్పాట్'.. ట్రైలర్ సో ఇంట్రెస్టింగ్!!
అయితే రీసెంట్ గా మేకర్స్ రిలీజ్ చేసిన ట్రైలర్ మంచి రెస్పాన్స్ అందుకుంటోంది. ఎంతో ఆసక్తిగా ఉండి.. సినిమాపై అంచనాలు రేపుతోందని సినీ ప్రియులు కామెంట్స్ పెడుతున్నారు.
By: Tupaki Desk | 18 April 2025 6:18 PM ISTటాలీవుడ్ యంగ్ హీరో నవీన్ చంద్ర గురించి అందరికీ తెలిసిందే. అందాల రాక్షసి మూవీతో లైమ్ లైట్ లోకి వచ్చిన ఆయన.. వివిధ సినిమాల్లో నటిస్తున్నారు. కేవలం హీరోగానే కాకుండా.. కీలక పాత్రల్లో సందడి చేస్తున్నారు. తన యాక్టింగ్ తో మెప్పిస్తున్నారు. ఇప్పుడు లీడ్ రోల్ లో బ్లైండ్ స్పాట్ మూవీ చేస్తున్నారు. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.
బ్లైండ్ స్పాట్ లో నవీన్ చంద్ర హీరోగా నటిస్తుండగా.. రాశీ సింగ్ హీరోయిన్ గా యాక్ట్ చేస్తోంది. రవిశంకర్, గాయత్రి, కిషోర్ కుమార్, హారిక తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. సైకలాజికల్ థ్రిల్లర్ గా రాకేష్ వర్మ దర్శకత్వం వహిస్తుండగా.. మ్యాంగో మాస్ మీడియా బ్యానర్ పై రామకృష్ణ వీరపనేని గ్రాండ్ గా సినిమాను నిర్మిస్తున్నారు.
అయితే రీసెంట్ గా మేకర్స్ రిలీజ్ చేసిన ట్రైలర్ మంచి రెస్పాన్స్ అందుకుంటోంది. ఎంతో ఆసక్తిగా ఉండి.. సినిమాపై అంచనాలు రేపుతోందని సినీ ప్రియులు కామెంట్స్ పెడుతున్నారు. మేకర్స్.. ట్రైలర్ ను కట్ చేసిన విధానం సూపర్ గా ఉందని చెబుతున్నారు. సినిమాలో ఊహించని ట్విస్టులు ఉన్నట్లు తెలుస్తోందని అంతా అంటున్నారు.
గట్టిగా వర్షం పడుతున్న సీన్ తో ట్రైలర్ స్టార్ట్ అయింది. అప్పుడు ఏడుస్తున్న ఒక చిన్న పాపను తీసుకుని గాయత్రి ఉండగా.. ఒక మహిళ ఉరేసుకుని చనిపోయి కనిపిస్తుంది. దీంతో పోలీస్ ఆఫర్ నవీన్ చంద్ర.. ఆ కేసును ఇన్వెస్టిగేట్ చేయడానికి వస్తారు. ఉరేసుకుని చనిపోలేదని, అది మర్డర్ అని చెబుతారు. ఆ తర్వాత కేసులో తన మార్క్ ఇన్వెస్టిగేషన్ ను మొదలు పెడతారు.
ఏదో జరుగుతున్నట్లు అనిపిస్తుందని, ఎవరో అబద్ధం చెబుతున్నారని, వాళ్లే మర్డర్ చేశారని నవీన్ చంద్ర చెబుతారు. అయితే చివరలో కానిస్టేబుల్ వచ్చి మర్డర్ చేసిందెవరో తెలిసిందని అంటారు. ఆ సీన్ తో ట్రైలర్ ముగిసింది. అయితే ట్రైలర్ లో నవీన్ చంద్ర ఇన్విస్టిగేషన్ మాత్రం సినిమాపై అందరి ఫోకస్ పడేలా చేస్తోంది. ఆయన నటన కూడా బాగుంది.
మూవీలో మంచి కంటెంట్ ఉన్నట్లు.. ట్రైలర్ ద్వారా తెలుస్తోంది. శ్రీరామ్ మడ్డూరి అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్.. ఆకట్టుకుంటోంది. సైకలాజికల్ థ్రిల్లర్ గా మూవీ వస్తుంది కనుక.. సినిమాకు కూడా బీజీఎం మెయిన్ అసెట్ గా మారనున్నట్లు తెలుస్తోంది. మరి బ్లైండ్ స్పాట్ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందో.. ఎలాంటి హిట్ అవుతుందో వేచి చూడాల్సిందే.
