Begin typing your search above and press return to search.

విడాకులు.. మళ్ళీ పెళ్లిపై నవదీప్ ఏమన్నాడంటే..

కెరియర్ మొదట్లో చాలా వేగంగా సినిమాలు చేసుకుంటూ వెళ్లిన నవదీప్ చందమామ లాంటి సినిమాతో కూడా బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్ అందుకున్నాడు.

By:  Tupaki Desk   |   17 Nov 2023 4:37 PM GMT
విడాకులు.. మళ్ళీ పెళ్లిపై నవదీప్ ఏమన్నాడంటే..
X

టాలీవుడ్ ఇండస్ట్రీలో పెళ్లి కానీ హీరోల లిస్టు చాలా పెద్దగానే ఉంది. ఇక మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్లలో యువ హీరో నవదీప్ కూడా ఉన్నాడు. కెరియర్ మొదట్లో చాలా వేగంగా సినిమాలు చేసుకుంటూ వెళ్లిన నవదీప్ చందమామ లాంటి సినిమాతో కూడా బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్ అందుకున్నాడు. ఇక తర్వాత అతను చేసిన ప్రయోగాలు పెద్దగా వర్కౌట్ కాలేదు.

అనంతరం రూట్ మార్చి పెద్ద సినిమాలలో సైడ్ రోల్స్ చేస్తూ ముందుకు కొనసాగుతూ ఉన్నాడు. ఇక బైక్ ట్రావెలింగ్ ఎక్కువగా ఇష్టపడే ఈ కుర్ర హీరో అప్పుడప్పుడు జీవితం గురించి కొన్ని కొటేషన్స్ కూడా ఇస్తూ ఉంటాడు. ముఖ్యంగా పెళ్లి అనే అంశం గురించి మాట్లాడితే చాలు నవదీప్ కాస్త చిరాకు గానే రియాక్ట్ అవుతూ ఉంటాడు.

పెళ్లి అనేది పర్ఫెక్ట్ కాదు అని ఆలోచనతోనే నవదీప్ సమాధానాలు ఉంటాయి. చాలా సార్లు పెళ్లిపై అతను సెటైర్స్ వేస్తూ కొన్ని వీడియోలు కూడా విడుదల చేశాడు. సోలో లైఫ్ సో బెటర్ అనే ఫార్ములాతో ముందుకు వెళుతూ ఉన్న ఈ సీనియర్ నటుడు రీసెంట్గా సోషల్ మీడియాలో మరొక పోస్టు పెట్టాడు. అందులో అతను అడిగిన ఒక ప్రశ్న కూడా ఆసక్తిగా ఉంది.

మా అమ్మగారు ఎప్పుడూ కూడా నన్ను పెళ్లి చేసుకోవాలని అడుగుతూ ఉంటారు. అయితే రీసెంట్ గా ఆమె అడిగిన ఒక ప్రశ్నకు నా దగ్గర సమాధానం లేకుండా పోయింది అని అన్నాడు. పెళ్లి అనేది అంత బ్యాడ్ అయితే పెళ్లి చేసుకున్న తర్వాత విడాకులు తీసుకున్న వాళ్ళు మళ్ళీ ఎందుకు పెళ్లి చేసుకుంటున్నారు? అనే ప్రశ్న ఆమె నన్ను అడిగారు.

దీంతో నా దగ్గర నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. మీలో ఎవరైనా ఆ ప్రశ్నకు సమాధానం తెలిస్తే చెప్పాలి అని కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి అని నవదీప్ వివరణ ఇచ్చాడు. దీంతో ఆ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఇక ఇక నవదీప్ వెండి తెరపై కనిపించి చాలా కాలం అయింది. చివరిగా అతను మోసగాళ్లు సినిమాలో ఒక పాత్రలో కనిపించడు. ఇక ఆ తర్వాత ఎక్కువగా వెబ్ సీరీస్ లు చేసుకుంటూ ముందుకు కొనసాగుతూ ఉన్నాడు.