Begin typing your search above and press return to search.

నవదీప్ 'లవ్ మౌళి' సెన్సార్.. రిలీజ్ ఎప్పుడంటే?

లవ్ మౌళి సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. జూన్ 7న రిలీజ్" అంటూ మేకర్స్ ట్వీట్ చేశారు. సెన్సార్ బోర్డు అధికారుల నుంచి 'ఎ' సర్టిఫికెట్ అందుకున్నట్లు వెల్లడించారు.

By:  Tupaki Desk   |   9 May 2024 2:29 PM GMT
నవదీప్ లవ్ మౌళి సెన్సార్.. రిలీజ్ ఎప్పుడంటే?
X

టాలెంటెడ్ యాక్టర్ నవదీప్ కొంత గ్యాప్ తర్వాత హీరోగా, న‌వ‌దీప్ 2.0గా క‌నిపించ‌బోతున్న సినిమా 'లవ్ మౌళి'. విభిన్న‌మైన, వైవిధ్య‌మైన కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి అవనీంద్ర దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాను నైరా క్రియేషన్స్, శ్రీకర స్టూడియోస్ బ్యానర్స్‌ ‌తో క‌లిసి టాలీవుడ్ టాలెంటెడ్ టెక్నీషియన్స్‌ కు అడ్డాగా మారిన సీ స్పేస్ నిర్మిస్తోంది. మిస్ ఇండియా కంటెస్టెంట్ పంఖురి గిద్వానీ హీరోయిన్ గా యాక్ట్ చేస్తోంది.

ఇప్పటికే ఈ సినిమాపై ఆడియన్స్ లో మంచి అంచనాలు నెలకొన్నాయి. టీజర్, ట్రైలర్, పోస్టర్స్ వంటి ప్రమోషనల్ కంటెంట్ వినూత్నంగా ఉండటమే కాకుండా అందరినీ ఆకట్టుకున్నాయి. సినిమాపై పాజిటివ్ బజ్ క్రియేట్ చేశాయి. కొన్ని రోజుల క్రితం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా.. ఏప్రిల్ 19వ తేదీన విడుదల కావాల్సి ఉంది. కానీ సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తి కాకపోవడం రిలీజ్ పోస్ట్ పోన్ అయింది.

రీసెంట్ గా నవదీప్.. లవ్ మౌళి సినిమా సెన్సార్ పూర్తయిందని ఇన్ స్టాలో తెలిపారు. తాజాగా ఈ విషయాన్ని మేకర్స్ అఫీషియల్ గా ప్రకటించారు. సినిమా రిలీజ్ డేట్ ను కూడా అనౌన్స్ చేశారు. "సెన్సార్ పూర్తయింది. లవ్ మౌళి సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. జూన్ 7న రిలీజ్" అంటూ మేకర్స్ ట్వీట్ చేశారు. సెన్సార్ బోర్డు అధికారుల నుంచి 'ఎ' సర్టిఫికెట్ అందుకున్నట్లు వెల్లడించారు. ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచనున్నట్లు తెలిపారు.

ఇక ట్రైలర్ ప్రకారం.. ఈ సినిమా ఓ పెయింటర్ ప్రేమకథగా తెలుస్తోంది. అడ్వెంచర్స్ చేస్తూ ఒంటరిగా జీవించే వ్యక్తిగా నవదీప్ కనిపిస్తారని అర్థమవుతోంది. తనకు ఎలాంటి అమ్మాయి కావాలో పెయింటింగ్ రూపంలో హీరో చెబుతాడు. ఆ పెయింటింగ్‌ లోని అమ్మాయి ప్రాణం పోసుకుంటుంది. ఆమె నచ్చక మరో అమ్మాయిని పెయింట్ చేస్తాడు. అలా ఒకరి తర్వాత ఒకరిని దూరం చేసుకుంటాడు. చివరకు ఏం జరిగిందనేది లవ్ మౌళి మూవీ కథ.

ఈ సినిమాలో నవదీప్ ఫ్రెండ్ క్యారెక్టర్‌ లో భావన సాగి యాక్ట్ చేసింది. ఈ మూవీకి గోవింద్ వసంత్ మ్యూజిక్ అందించారు. కృష్ణ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సమకూర్చారు. ఆర్ట్ డైరెక్టర్ గా కిరణ్ మామిడి వ్యవహరించారు. ప్రశాంత్ రెడ్డి తాటికొండ నిర్మాతగా ఉన్నారు. రెండో వెర్షన్ తో వస్తున్నానని, సెకండ్ ఇన్నింగ్స్ అని లవ్ మౌళి సినిమా గురించి చెబుతున్న నవదీప్.. ఈ చిత్రంతో మరి ఎలాంటి హిట్ అందుకుంటారో వేచి చూడాలి.