Begin typing your search above and press return to search.

ప‌వ‌న్ జ‌న‌సేనకు ప్ర‌చారం చేస్తా: న‌వ‌దీప్

నవదీప్ దశాబ్దంన్నర కాలంగా క‌థానాయ‌కుడిగా ప‌రిశ్ర‌మ‌లో కొన‌సాగుతున్నాడు. తన బహుముఖ ప్రజ్ఞ నైపుణ్యంతో ఆక‌ట్టుకున్నాడు.

By:  Tupaki Desk   |   11 April 2024 5:28 AM GMT
ప‌వ‌న్ జ‌న‌సేనకు ప్ర‌చారం చేస్తా: న‌వ‌దీప్
X

నవదీప్ దశాబ్దంన్నర కాలంగా క‌థానాయ‌కుడిగా ప‌రిశ్ర‌మ‌లో కొన‌సాగుతున్నాడు. తన బహుముఖ ప్రజ్ఞ నైపుణ్యంతో ఆక‌ట్టుకున్నాడు. పెద్ద‌తెర‌తో పాటు బుల్లితెర‌పైనా అత‌డు ఫేమ‌స్ అయ్యాడు. అయితే న‌టుడిగా సుదీర్ఘకాలం పనిచేసినప్పటికీ తన కెరీర్‌లో ఇంకా ఆశించిన స్థాయికి చేరుకోలేదు. తాజా చిత్రం `లవ్ మౌళి` అత‌డిని కొత్త‌గా ఆవిష్క‌రించ‌నుంది. ఈ రొమాంటిక్ డ్రామా విజువ‌ల్స్ ఆస‌క్తిని క‌లిగిస్తున్నాయి. ప్ర‌త్యేకమైన పోస్టర్‌లు బోల్డ్ టీజర్‌కు అద్భుత స్పంద‌న వ‌చ్చింది.

ఉగాది శుభ సందర్భంగా మేకర్స్ ట్రైలర్‌ను ఆవిష్కరించగా దానికి చ‌క్క‌ని స్పంద‌న ల‌భించింది. నవదీప్ దూకుడు విష‌యంలో ఆత్మపరిశీలన చేసుకునే యువ‌కుడి పాత్రను పోషించాడు. అతడు జీవితంలోని సంక్లిష్టతల మధ్య నిజమైన ప్రేమను కోరుకునే మౌళి. ట్రైలర్ అద్భుతమైన విజువల్స్‌తో ఆక‌ట్టుకుంది. నవదీప్‌ను పూర్తిగా కొత్త అవతార్‌లో ప్రదర్శించింది ఈ ట్రైల‌ర్. ఇందులో బోల్డ్ లవ్ మేకింగ్ సన్నివేశాలు ర‌క్తి క‌ట్టిస్తున్నాయి. అద్భుత‌ భావోద్వేగాల‌ను క‌లిగి ఉండి, నిజమైన ప్రేమ కోసం తపించే వాడిగా న‌వదీప్ చ‌క్క‌ని న‌ట‌న‌ను అందించాడు.

ల‌వ్ మౌళి ట్రైల‌ర్ ఆవిష్క‌ర‌ణ సంద‌ర్భంగా పిఠాపురంలోని శ్రీ‌పాద‌వ‌ల్ల‌భుని సంద‌ర్శించుకున్న న‌వ‌దీప్ స్థానిక మీడియాతో మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా తాను పిఠాపురంలో ప‌వ‌న్ క‌ల్యాణ్ జ‌న‌సేన త‌ర‌పున‌ ప్ర‌చారం నిర్వ‌హిస్తాన‌ని న‌వ‌దీప్ అన్నారు. నిజాయితీ క‌లిగిన ఎవ‌రు పోటీ చేసినా ప్ర‌జ‌లు ఆద‌రిస్తార‌ని, తాను ప‌వ‌న్ కి మ‌ద్ధ‌తునిస్తాన‌ని కూడా న‌వదీప్ వ్యాఖ్యానించారు. ల‌వ్ మౌళి కోసం లాక్ డౌన్ సమయంలో అనేక సవాళ్లను ఎదుర్కొన్నప్పటికీ మేకర్స్ సినిమాను పూర్తి చేసి ప‌ట్టుద‌ల‌గా విడుద‌ల‌కు తెచ్చారు. 19 ఏప్రిల్ 2024న ఈ మూవీ థియేట‌ర్ల‌లో విడుదల కానుంది. అవనీంద్ర దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ల‌వ్ మౌళి పాత్ర అద్భుతంగా కుదిరింది. గోవింద్ వసంత సంగీతం, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకి అస్సెట్ కానున్నాయి.