Begin typing your search above and press return to search.

డైరెక్ట‌ర్ ల‌వ్ స్టోరీ లో న‌వ‌దీప్!

అందుకే ఇప్ప‌టికీ బ‌యోపిక్ లు అంటే అంత డిమాండ్..క్రేజ్. తాజాగా న‌వ‌దీప్ న‌టిస్తోన్న 'ల‌వ్ మౌళి' కూడా అలాంటిదేన‌ని తెలుస్తోంది.

By:  Tupaki Desk   |   29 Nov 2023 8:00 AM GMT
డైరెక్ట‌ర్ ల‌వ్ స్టోరీ లో న‌వ‌దీప్!
X

కల్పిక క‌థ‌ల‌క‌న్నా..వాస్త‌వ క‌థ‌ల్ని మ‌రింత బ‌లంగా చెప్ప‌డానికి అవ‌కాశం ఉంటుంది. అందుకే బ‌యోపిక్ లు ఏమోష‌న‌ల్ గా క‌నెక్ట్ అవుతుంటాయి. వాటిలో పాత్ర‌ల్ని బ‌లంగా చెప్ప‌డానికి ఛాన్స్ ఉంటుంది. అలాంటి చిత్రాల‌కు స‌క్సెస్ రేట్ కూడా బాగుంటుంది. బాలీవుడ్ లో బ‌యోపిక్ లు ఫెయిలైంది కూడా చాలా త‌క్కువే. అందుకే ఇప్ప‌టికీ బ‌యోపిక్ లు అంటే అంత డిమాండ్..క్రేజ్. తాజాగా న‌వ‌దీప్ న‌టిస్తోన్న 'ల‌వ్ మౌళి' కూడా అలాంటిదేన‌ని తెలుస్తోంది.

ఇటీవ‌ల రిలీజ్ అయిన ఈ సినిమా టీజ‌ర్ కి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. న‌వ‌దిప్ లో సిస‌లైన న‌టుడ్ని బ‌య‌ట‌కు తీసిన చిత్రంలో జ‌నాల్లోకి వెళ్తుంది. న‌వ‌దీప్ గెట‌ప్..ఆహార్యం ప్ర‌తిది సంథింగ్ డిఫ‌రెంట్ గా ప్రొజెక్ట్ అవుతుంది. ఈ సినిమాపై న‌వ‌దీప్ కూడా చాలా కాన్పిడెంట్ గా ఉన్నాడు. చాలా కాలం పాటు అన‌వ‌స‌ర‌మైన సినిమాలు ఎన్నో చేసాన‌ని.. లాక్ డౌన్ స‌మ‌యంలో త‌న బ‌లం ఏంటో తెలుసుకుని కొత్త జ‌ర్నీ మొద‌లు పెట్టిన‌ట్లు తెలిపాడు.

త‌న ఆలోచ‌నా విధానాల‌కు ఈ సినిమా ఎంతో ద‌గ్గ‌ర‌గా ఉంటుంద‌ని అన్నాడు. ఈ సినిమాకి అప‌నీంద్ర అనే కొత్త కుర్రాడు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. ఈ క‌థ ఆయ‌న జీవితంలో చోటు చేసుకున్న సంఘ‌ట‌న‌ల స‌మూహ‌ర‌మే అంటున్నాడు. త‌న ప్రేమ క‌థ‌ల ప‌లిత‌మే ల‌వ్ మౌళి అట‌. ఆయ‌న ప్రేమ క‌థ‌ల్లో చాలా కోణాలున్నాయ‌ట‌. వాట‌న్నింటిని సినిమా రూపంలోకి తీసుకొచ్చాన‌ని ధీమా వ్య‌క్తం చేసాడు.

ఇలా న‌వ‌దీప్- అప‌నీంద్ర జీవితాల‌కు ద‌గ్గ‌ర‌గా ఈ క‌థ ఉండ‌టంతోనే ఇద్ద‌ర్నీ క‌లిపిన‌ట్లు చెప్పొచ్చు. ఓ ద‌ర్శ‌కుడు ల‌వ్ స్టోరీలో మ‌రో న‌టుడు న‌టించ‌డం..ఆ క‌థ యాదృశ్చికంగా అత‌ని జీవితానికి క‌నెక్ట్ అవ్వ‌డం అన్న‌ది ఔట్ ఫుట్ కి మంచి దోహ‌దం చేసే అంశం. ఏపాత్ర‌నైనా ఓన్ చేసుకుని చేయ‌గ‌ల్గితే అది అద్బుతంగా పండుతుంది. టీజ‌ర్ తోనే ద్వ‌యం అది ప్రూవ్ చేసారు. మ‌రీ మోడ్ర‌న్ ల‌వ్ స్టోరీ థియేట‌ర్ ఆడియ‌న్స్ ని ఎలా మెప్పిస్తుంద‌న్న‌ది చూడాలి.