Begin typing your search above and press return to search.

నాని ది న్యాచురల్ స్టార్..!

అష్టా చమ్మా నుంచి మొదలైన నాని సినీ జర్నీ ఈ మార్చిలో వచ్చిన దసరా వరకు కెరీర్ లో ఒక్కో మెట్టు ఎక్కుతూ వచ్చాడు

By:  Tupaki Desk   |   5 Sep 2023 8:14 AM GMT
నాని ది న్యాచురల్ స్టార్..!
X

ఎంచుకున్న పాత్రకు పూర్తి స్థాయిలో న్యాయం చేసే స్టార్స్ లో నాని ఒకరు. అష్టా చమ్మ సినిమాతో హీరోగా తన కెరీర్ మొదలు పెట్టినా అసలు అతను పరిశ్రమలోకి వచ్చిన నాని మొదట అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశారు. అలా అసిస్టెంట్ గా చేస్తున్న టైం లో ఇంద్రగంటి మోహనకృష్ణ నానిని హీరోగా పరిచయం చేశారు. మెయిన్ గోల్ హీరోయినే అయినా వచ్చిన ఛాన్స్ వదలకూడదు అన్నట్టుగా దర్శకత్వ శాఖలో పని చేశాడు నాని. అలా అసిస్టెంట్ డైరెక్టర్ గా మొదలు పెట్టి హీరోగా మారిన నాని అష్టా చమ్మా నుంచి కెరీర్ గ్రాఫ్ పెంచుకుంటూ సక్సెస్ ఫుల్ గా 15 ఏళ్లు పూర్తి చేసుకున్నాడు.

తెర మీద నానిని చూడగానే మన పక్కింటి కుర్రాడిలా అనిపిస్తాడు. అదే అతనికి ప్లస్ పాయింట్. ఇక ఎలాంటి పాత్ర ఇచ్చినా సరే పర్ఫెక్ట్ గా సూట్ అవుతాడు. అందుకే అతని సినిమాలు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యేలా చేశాయి. తన సహజ నటనకు న్యాచురల్ స్టార్ అన్న ట్యాగ్ లైన్ ని కూడా వచ్చేలా చేసింది.

అష్టా చమ్మా నుంచి మొదలైన నాని సినీ జర్నీ ఈ మార్చిలో వచ్చిన దసరా వరకు కెరీర్ లో ఒక్కో మెట్టు ఎక్కుతూ వచ్చాడు. ముఖ్యంగా దసరాతో తన వల్ల కాదని అనుకున్న మాస్ ఫీట్ కూడా సూపర్ హిట్ కొట్టి సత్తా చాటాడు నాని. ప్రతి సినిమాకు తన పరంగా 100కి 100 శాతం కష్టపడి పనిచేసిన నాని హిట్ అయిన సినిమాను ప్రోత్సాహంగా తీసుకుని ఫెయిల్ అయిన సినిమాతో పాఠాలు నేర్చుకుని కెరీర్ కొనసాగిస్తూ వచ్చాడు.

ముఖ్యంగా ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా వచ్చిన నాని న్యాచురల్ స్టార్ గా 15 ఏళ్లు సక్సెస్ ఫుల్ కెరీర్ కొనసాగించడంలో అతని ప్రతిభ ఏంటన్నది చెప్పొచ్చు. నాని సినిమాలకు ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంటుంది. నాని సినిమా కచ్చితంగా బాగుంటుంది అని నమ్మే ఆడియన్స్ అతని సినిమాలన్నీ రెగ్యులర్ గా చూస్తుంటారు.

ఇదే కాదు తనలా అవకాశం కోసం ఎదురుచూసే ప్రతి ఒక్కరికి ఒక ఆశాకిరణం గా నాని మారుతున్నాడు. నాని చేసిన 29 సినిమాల్లో నాని కొత్త వారితో చేసిన సినిమాలే ఎక్కువ. తన కెరీర్లో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న దసరా సినిమాతో కూడా శ్రీకాంత్ ఓదెల అనే దర్శకుడిని పరిచయం చేశాడు నాని. టాలెంట్ ఉన్న వారిని ప్రోత్సహిస్తూ నాని అలా కూడా తన మంచి మనసు చాటుకుంటున్నాడు.

హీరోగా సంపాదించడం మాత్రమే కాదు ఇక్కడ సంపాదించింది ఇక్కడే ఖర్చు పెట్టాలి అనేలా సినీ నిర్మాణం కూడా చేస్తున్నాడు నాని. నిర్మాతగా నాని అభిరుచి గల సినిమాలు చేస్తూ వస్తున్నాడు.

యువ హీరో నుంచి స్టార్ హీరోగా నాని కెరీర్ ఎంతోమందికి స్పూర్తిని ఇస్తుంది. మనలోని ప్రతిభ అనుకున్నది సాధించే వరకు పట్టు విడవని సంకల్పం ఉంటే చాలు అనుకున్నది సాధించి తీరుతాం అనేలా నాని ని చూస్తే అర్ధమవుతుంది. ఈ తరం ఆడియన్స్ కి స్వయంకృషితో పైకొచ్చిన నాని ఎంతో స్పూర్తిగా నిలుస్తారని చెప్పొచ్చు.

సినీ పరిశ్రమలో 15 ఏళ్లు పూర్తి చేసుకున్న నానికి శుభాకాంక్షలు తెలుపుతూ దసరా లాంటి విజయాలు ధరణి లాంటి పాత్రలతో పాన్ ఇండియా లెవెల్ లో ఇంకా ఎంతోమంది ప్రేక్షకులను అలరించాలని కోరుకుందాం.