Begin typing your search above and press return to search.

నాని సీక్వెల్ బజ్.. ఇది అసలు మ్యాటర్

నేచురల్ స్టార్ నాని కెరియర్ లోనే దసరా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ సినిమాతో మాస్ హీరోగా నాని తనని తాను ఎలివేట్ చేసుకున్నాడు

By:  Tupaki Desk   |   27 March 2024 4:02 AM GMT
నాని సీక్వెల్ బజ్.. ఇది అసలు మ్యాటర్
X

నేచురల్ స్టార్ నాని కెరియర్ లోనే దసరా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ సినిమాతో మాస్ హీరోగా నాని తనని తాను ఎలివేట్ చేసుకున్నాడు. శ్రీకాంత్ ఓదేలని ఈ మూవీతో నాని దర్శకుడిగా పరిచయం చేశాడు. సుకుమార్ శిష్యుడైన శ్రీకాంత్ మొదటి ప్రయత్నంలోనే దసరా లాంటి కల్ట్ మూవీతో నానికి కెరియర్ లో గుర్తిండిపోయే హిట్ ని అందించాడు.

ఈ యంగ్ డైరెక్టర్ నెక్స్ట్ మూవీ ఎవరితో చేస్తాడా అనే ప్రశ్న చాలా కాలం నుంచి వినిపిస్తోంది. అక్కినేని అఖిల్ పేరు కూడా ఆ మధ్యకాలంలో వినిపించింది. అఖిల్ కి కథ చెప్పాడని టాక్ వచ్చింది. రెండు, మూడు పెద్ద బ్యానర్ లు శ్రీకాంత్ తో మూవీస్ కోసం అగ్రిమెంట్ చేసుకున్నాయి. అయితే ఈ యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ మళ్ళీ నానితోనే మూవీ చేయాలని డిసైడ్ అయ్యాడంట.

ఇప్పటికే కథ కూడా చెప్పి ఒకే చేయించుకున్నట్లు తెలుస్తోంది. దసరాకి సీక్వెల్ గా ఈ మూవీ చేస్తున్నాడనే ప్రచారం నడిచింది. అయితే అందులో వాస్తవం లేదని తెలుస్తోంది. శ్రీకాంత్ తో నాని చేయబోయే సినిమా దసరా సీక్వెల్ కాదంట. కంప్లీట్ గా కొత్త కథతోనే ఈ మూవీ చేయనున్నాడంట. స్క్రిప్ట్ కూడా ఫైనల్ అయినట్లు ఇండస్ట్రీ వర్గాలలో టాక్ వినిపిస్తోంది.

త్వరలో ఈ మూవీకి సంబందించిన అఫీషియల్ ఎనౌన్సమెంట్ వచ్చే అవకాశం ఉంది. నాని ప్రస్తుతం వివేక్ ఆత్రేయతో సరిపోదా శనివారం చేస్తున్నారు. నెక్స్ట్ సుజిత్ దర్శకత్వంలో పాన్ ఇండియా సినిమాని ఎనౌన్స్ చేశారు. ఈ రెండు కంప్లీట్ అయిన తర్వాత శ్రీకాంత్ కి ఒకే చెప్పిన కథని సెట్స్ పైకి తీసుకొని వెళ్లే అవకాశం ఉంది. అంటే ఏ విధంగా చూసుకున్న శ్రీకాంత్ ఓదేలతో నాని చేయబోయే సినిమా 2025 ఆఖరులో స్టార్ట్ కావొచ్చని ఇండస్ట్రీ వర్గాల మాట.

అలాగే శైలేష్ కొలను దర్శకత్వంలో హిట్ 3 మూవీ కూడా నాని లైన్ అప్ లో ఉంది. సైంధవ్ మూవీతో శైలేష్ కొలను డిజాస్టర్ అందుకున్నారు. అయితే హిట్, హిట్ 2లతో రెండు సూపర్ హిట్స్ ని నాని బ్యానర్ లో శైలేష్ కొలను ఇచ్చారు. అందుకే హిట్ 3 తానే హీరోగా చేయాలని డిసైడ్ అయ్యాడు. మరి ఈ ఇద్దరు యంగ్ దర్శకులతో నాని చేయబోయే సినిమాలలో ఏది ముందుగా స్టార్ట్ అవుతుందనేది తెలియాల్సి ఉంది.