Begin typing your search above and press return to search.

100 కోట్ల డైరెక్ట‌ర్ తో నేచుర‌ల్ స్టార్!

ఇక నాని కెరీర్ ప్లానింగ్ గురించి తెలిసిందే. ఓ సినిమా సెట్స్ లో ఉండ‌గా కొత్త క‌థ‌లు విని ద‌ర్శ‌కుల్ని లాక్ చేస్తుంటాడు

By:  Tupaki Desk   |   28 Aug 2023 5:05 AM GMT
100 కోట్ల డైరెక్ట‌ర్ తో నేచుర‌ల్ స్టార్!
X

నేచుర‌ల్ స్టార్ నాని క‌థానాయ‌కుడిగా 30వ చిత్రం 'హాయ్ నాన్న' తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. ఈసినిమాతో శౌర్యువ్ అనే కొత్త కుర్రాడు దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఫాద‌ర్-డాట‌ర్ సెంటిమెంట్ నేప‌థ్యంలో తెర‌కెక్కుతోంది. ఇందులో నాని కి జోడీగా మృణాళ్‌ ఠాకూర్‌- శ్రుతి హాసన్ న‌టిస్తున్నారు. ఇప్ప‌టికే రిలీజ్ అయిన గ్లింప్స్ ఆక‌ట్టుకుంటున్నాయి. 'ద‌స‌రా' తో భారీ క‌మ‌ర్శియ‌ల్ స‌క్సెస్ అందుకున్న ఈ సినిమాతోనూ హిట్ అందుకుంటాడ‌ని అభిమానులు కాన్పిడెంట్ గా ఉన్నారు.

ఇక నాని కెరీర్ ప్లానింగ్ గురించి తెలిసిందే. ఓ సినిమా సెట్స్ లో ఉండ‌గా కొత్త క‌థ‌లు విని ద‌ర్శ‌కుల్ని లాక్ చేస్తుంటాడు. ఈ నేప‌థ్యంలో నాని తో మ‌రో సినిమా చేయ‌డానికి వివేక్ ఆత్రేయ ప్ర‌య‌త్నిస్తున్నాడు. ఇప్ప‌టికే నాని ఆత్రేయ స్టోరీ విన్నాడ‌ని..న‌చ్చింద‌ని చేద్దామ‌నే ప్రామిస్ కూడా చేసిన‌ట్లు వినిపిస్తోంది. ఇప్ప‌టికే ఈ కాంబినేష‌న్ లో 'అంటే సుంద‌రానికీ' అనే సినిమా తెర‌కెక్కిన సంగ‌తి తెలిసిందే.

ఈ సినిమా ఆశించిన ఫ‌లితాన్నివ్వ‌లేదు. అయినా నాని లిస్ట్ లో వివేక్ పేరు మ‌ళ్లీ తెరపైకి రావ‌డం విశేషం. అయితే నాని మాత్రం ఈసారి త‌మిళ ద‌ర్శ‌కుడిపైనే ఎక్కువ‌గా ఫోక‌స్ చేస్తున్న‌ట్లు తాజాగా వినిపిస్తోన్న వార్త‌. శివ కార్తికేయ‌న్ హీరోగా 'డాన్' సినిమాతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచయ‌మైన శిబు చ‌క్ర‌వ‌ర్తి సినిమాలో న‌టించ‌డానికి నాని ఆస‌క్తి చూపిస్తున్నాడ‌ని స‌మాచారం. తొలి సినిమాతోనే శిబు చ‌క్ర‌వ‌ర్తి 100 కోట్ల క్ల‌బ్ లో చేరాడు.

ఆ సినిమా కోలీవుడ్ లో బ్లాక్ బ‌స్ట‌ర్ అయింది. ఈ హిట్ తో బిజీ ద‌ర్శ‌కుడ‌య్యాడు. ఈ నేప‌థ్యంలో నాని- శిబుల మ‌ధ్య ఇటీవ‌లే చ‌ర్చ‌లు జ‌రిగాయ‌ని...స్ట్రిప్ట్ ఆస‌క్తిక‌రంగా ఉండ‌టంతో నాని ప‌చ్చ‌జెండా ఊపేసా డ‌ని ..ఓ ప్ర‌ముఖ నిర్మాత ఈ చిత్రాన్ని నిర్మించ‌డానికి ముందుకొచ్చిన‌ట్లు వినిపిస్తోంది. తెలుగు.. త‌మిళ భాష‌ల్లో ఈ చిత్రాన్ని తెర‌కెక్కించాల‌న్న‌ది ప్లాన్ గా తెలిసింది. ఇదే నిజ‌మైతే నాని నాని ..వివేక్ ఆత్రేయ‌ని తాత్క‌లికంగా ప‌క్క‌న‌బెట్టే అవ‌కాశం ఉంది. గ‌తంలో ఎలాగూ ఓ ప్లాప్ సినిమా ఇచ్చాడు కాబ‌ట్టి మూవ్ అయ్యే అవ‌కాశం లేద‌ని ప్ర‌చారం సాగుతోంది.