Begin typing your search above and press return to search.

వార‌సుని గిఫ్ట్ అందుకుని మురిసిపోయిన నాని

ఇంత‌లోనే నాని పుట్టిన‌రోజు కానుక‌గా సుజీత్ ద‌ర్శ‌క‌త్వంలో భారీ యాక్ష‌న్ చిత్రాన్ని ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే

By:  Tupaki Desk   |   27 Feb 2024 3:48 AM GMT
వార‌సుని గిఫ్ట్ అందుకుని మురిసిపోయిన నాని
X

నేచుర‌ల్ స్టార్ నాని వ‌రుస చిత్రాల‌తో బిజీగా ఉన్నాడు. ఇటీవ‌లే 'హాయ్ నాన్న' చిత్రంతో విజ‌యం అందుకున్న నాని త‌దుప‌రి యాక్ష‌న్ ప్యాక్డ్ చిత్రంలో న‌టించేందుకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడు. ప్ర‌స్తుతం అత‌డు న‌టించిన 'స‌రిపోదా శ‌నివారం' విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది. ఇటీవ‌ల నాని పుట్టిన‌రోజున‌ ఈ చిత్రం టీజర్ విడుదలైంది. ఈ ఏడాది ఆగ‌స్టు 29న సినిమా విడుద‌ల కానుంది. శనివారాల్లో మాత్రమే తన కోపాన్ని బయటపెట్టే వ్యక్తిగా నాని ఈ చిత్రంలో నటించాడు. ఇందులో ఎస్ జె సూర్య పోలీసుగా నటించాడు. వివేక్ ఆత్రేయ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.

ఇంత‌లోనే నాని పుట్టిన‌రోజు కానుక‌గా సుజీత్ ద‌ర్శ‌క‌త్వంలో భారీ యాక్ష‌న్ చిత్రాన్ని ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఇందులో నాని పూర్తి స్థాయి యాక్ష‌న్ స్టార్ గా క‌నిపించ‌నున్నాడు. ఇంత‌కుముందు విడుద‌లైన‌ యానిమేటెడ్ వీడియో అభిమానుల్లో క్యూరియాసిటీ పెంచింది.

ఈసారి బ‌ర్త్ డేని ఎప్ప‌టిలానే త‌న కుటుంబంతో సెల‌బ్రేట్ చేసుకున్నాడు నాని. కుమారుడు జున్ను, భార్య అంజు యెల‌వ‌ర్తితో క‌లిసి ఈ సెల‌బ్రేష‌న్ ఎలా సాగిందో తాజాగా రిలీజైన వీడియో చెబుతోంది. ఈ వీడియోలో జున్ను నాన్న‌కు అద్భుత‌మైన పుట్టిన‌రోజు కానుక‌ను అందించాడు. నాన్న‌కు ఎంతో ఇష్ట‌మైన మ్యూజిక్ ని ప్లే చేస్తున్నాను చూడండి! అంటూ జున్ను ఎంతో క్యూట్ గా మాట్లాడుతున్న ఈ వీడియో ఇప్పుడు అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారింది. జున్ను త‌న లేలేత మునివేళ్ల‌తో కీబోర్డ్ ని ప్లే చేస్తూ అంద‌మైన మ్యూజిక్ ని వినిపిస్తుండ‌గా నాని ఎంతో మురిసిపోతున్నాడు.

నానికి జీవితంలో ఇంత‌కంటే అంద‌మైన కానుక ఇంకొక‌టి లేదు! అంటూ అభిమానులు దీనిపై వ్యాఖ్యానిస్తున్నారు. నాని-జున్ను-అంజు ఒకే ఫ్రేమ్ లో ఉన్న ఫోటోలు కూడా అంత‌ర్జాలంలో వైర‌ల్ అవుతున్నాయి. 2012లో నాని అంజ‌న‌ను పెళ్లాడిన సంగ‌తి తెలిసిందే. జున్న వ‌య‌సు ఇప్ప‌టికి ఆరేళ్లు.