Begin typing your search above and press return to search.

నానిలా వాళ్లెందుకు చేయలేకపోతున్నారు..?

అంతేకాదు నాని తో సినిమా చేసిన నిర్మాత కూడా మాక్సిమం సేఫ్ పొజిషన్ లోనే ఉంటున్నారు. ఏడాదికి 2, 3 సినిమాలు చేయాలని నాని ఫిక్స్ అయ్యాడు

By:  Tupaki Desk   |   11 Dec 2023 12:30 PM GMT
నానిలా వాళ్లెందుకు చేయలేకపోతున్నారు..?
X

న్యాచురల్ స్టార్ నాని సినిమాల ప్లానింగ్ విషయంలో నెక్స్ట్ లెవెల్ లో ఉంటాడు. టైర్ 2 హీరోల్లో సినిమా తర్వాత సినిమా ఏ మాత్రం గ్యాప్ ఇవ్వకుండా నాని సినిమాలు చేస్తున్నాడు. కెరీర్ మొదట్లో పర్వాలేదు అనిపించినా మధ్యలో వరుస ఫ్లాపులు డిస్టర్బ్ చేశాయి. ఆ టైం లో కాస్త దూకుడు తగ్గించిన నాని మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కి దూసుకెళ్తున్నాడు. నాని సినిమా అంటే చాలు నిరాశ పరచదు అనే ఆలోచనకు ఆడియన్స్ వచ్చేశారు.

అంతేకాదు నాని తో సినిమా చేసిన నిర్మాత కూడా మాక్సిమం సేఫ్ పొజిషన్ లోనే ఉంటున్నారు. ఏడాదికి 2, 3 సినిమాలు చేయాలని నాని ఫిక్స్ అయ్యాడు. ఆ విధంగా ప్లాన్ చేసుకుంటున్నాడు. అలా అని ఎలాంటి సినిమా పడితే అలాంటి సినిమా కాకుండా కంటెంట్ ఉన్న సినిమాలే చేస్తున్నాడు. శ్యామ్ సింగ రాయ్, అంటే సుందరానికీ, దసరా, హాయ్ నాన్న ఇలా సినిమా సినిమాకు కథలో తన పాత్రలో వైవిధ్యం చూపిస్తున్నాడు నాని.

నాని ఫాలో అవుతున్న ఈ ఫార్ములాని మిగతా వాళ్లు ఎందుకు అందుకోలేకపోతున్నారని ఆడియన్స్ డిస్కస్ చేస్తున్నారు. కొందరు హీరోలు సినిమా వెంట సినిమా చేస్తున్నా సక్సెస్ రేషియోలో వెనకబడుతున్నారు. కానీ వెంట వెంట ప్రాజెక్టులు చేసినా సక్సెస్ మీటర్ మాత్రం తగ్గకుండా చూసుకుంటున్నాడు నాని. కథల ఎంపికలో నాని క్లవర్ నెస్ ఏంటన్నది అతను చేస్తున్న సినిమాలను చూస్తే అర్థమవుతుంది.

ఈ ఇయర్ మొదట్లో దసరా తో వచ్చి హిట్ కొట్టిన నాని మళ్లీ అదే తరహా సినిమా కాకుండా హాయ్ నాన్న అంటూ మంచి ఆహ్లాదకరమైన సినిమా చేశాడు. హాయ్ నాన్న హిట్ నాని స్టామినా ఏంటో మరోసారి ప్రూవ్ చేసింది. నాని ప్రస్తుతం వివేక్ ఆత్రేయ డైరెక్షన్ లో సరిపోదా శనివారం సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత మరో రెండు ప్రాజెక్ట్ లు లైన్ లో ఉన్నాయి. నెక్స్ట్ ఇయర్ కూడా 2 సినిమాలు గ్యారెంటీగా రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యాడు నాని.

రెండు బ్యాక్ టు బ్యాక్ హిట్లు పడ్డాయి కాబట్టి రాబోతున్న సరిపోదా శనివారం సినిమాకు మంచి జోష్ ఉంటుంది. ఇలా స్పీడ్ గా సినిమాలు చేస్తూ ఇండస్ట్రీకి తన వంతు హెల్ప్ చేస్తున్నాడు నాని. అంతేకాదు నాని కొత్త దర్శకులతో పనిచేస్తుండటం కూడా కెరీర్ ఇంత స్ట్రాంగ్ గా ఉండటానికి మరో రీజన్ అని చెప్పొచ్చు. కొత్త దర్శకులతో రిస్క్ అనే హీరోలు కొందరు ఉంటే అందుకు రివర్స్ గా వారితో హిట్ల మీద హిట్లు కొడుతున్నాడు నాని.