Begin typing your search above and press return to search.

నాని ఈ స్పీడ్ ఏంటి?

నేచురల్ స్టార్ నాని.. వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. జయాపజయాలతో సంబంధం లేకుండా వరుసపెట్టి సినిమాలు చేస్తున్నారు

By:  Tupaki Desk   |   8 Dec 2023 6:17 AM GMT
నాని ఈ స్పీడ్ ఏంటి?
X

నేచురల్ స్టార్ నాని.. వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. జయాపజయాలతో సంబంధం లేకుండా వరుసపెట్టి సినిమాలు చేస్తున్నారు. దసరా సినిమాతో సూపర్ హిట్ అందుకున్న నాని.. తాజా హాయ్ నాన్న సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా.. హిట్ టాక్ సంపాదించుకుంది.

అయితే ఈ సినిమాకు విడుదల ముందే మరో మూవీ షూటింగ్ స్టార్ చేశారు నాని. దర్శకుడు వివేక్ ఆత్రేయతో సరిపోలేదా శనివారం మూవీని చేస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ పూర్తి అయిన తరువాత తమిళ దర్శకుడు సిబి చక్రవర్తితో సినిమా చేయనున్నారు. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయట.

ఈ సినిమాకు సంబంధించి 2024 ఫిబ్రవరిలో అధికారికంగా మేకర్స్ ప్రకటించనున్నారు. ఏప్రిల్ లేదా మే నుండి రెగ్యులర్ షూట్ ప్లాన్ చేస్తున్నారట. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతోందట. ఈ సినిమాలో హీరోయిన్ గా పొడుగు కాళ్ల సుందరి పూజా హెగ్డే కనిపించనుందట. అయితే ఈ సినిమాను కూడా నాని వేగంగా పూర్తి చేయలానుకుంటున్నారట. ఎందుకంటే దర్శకుడు శైలేష్ కొలను తో హిట్ 3 ది థర్డ్ కేస్ ప్రాజెక్ట్ చేయాలని నాని భావిస్తున్నారట.

ఇప్పటికే ఈ సీక్వెల్ కు సంబంధించిన హింట్ ను హీరో అడవి శేష్ హిట్ 2 క్లైమాక్స్ లో ఇచ్చిన విషయం మనకు తెలిసిందే. తన లైనప్ లో ఇన్ని సినిమాలు పెట్టుకున్న నాని.. మరో సినిమాకు కూడా సిద్ధమవుతున్నారట. తనకు దసరా లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన శ్రీకాంత్ ఓదెలతో మరో మూవీ చేయడానికి రెడీ అవుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన కథా చర్చలు జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఈ లైనప్ చూస్తుంటే.. నాని వచ్చే ఏడాదంతా బిజీబజీగా గడపనున్నారు. వరుస షూటింగ్ లలో పాల్గోనున్నారు. ఒకవైపు క్లాస్ ప్రేక్షకులను తన వైపు తిప్పుకుంటూనే మరొక వైపు మాస్ సినిమాలను చేయాలన్న నాని ఆలోచనాలు ఎంత వరకు సక్సస్ అవుతాయో చూడాలి మరి.