Begin typing your search above and press return to search.

త్రివిక్రమ్‌ గారు వింటున్నారా... నాని కామెంట్స్

నాచురల్‌ స్టార్ నాని ఈ వారం హాయ్ నాన్న సినిమా తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు

By:  Tupaki Desk   |   5 Dec 2023 5:22 AM GMT
త్రివిక్రమ్‌ గారు వింటున్నారా... నాని కామెంట్స్
X

నాచురల్‌ స్టార్ నాని ఈ వారం హాయ్ నాన్న సినిమా తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమా పై నాని పెట్టుకున్న అంచనాలు, నమ్మకం చూస్తూ ఉంటే కచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ అనిపిస్తోంది. దసరా సినిమా సమయంలో కూడా నాని ఇదే స్థాయి నమ్మకం కనబర్చారు. కానీ ఆ సినిమా నిరాశ పరిచింది. ఆ సినిమా కంటెంట్ విషయంలో మంచి మార్కులు దక్కించుకుంది.

దసరా సినిమాలో మిస్ అయిన మంచి ఫ్యామిలీ ఎలిమెంట్స్ మరియు నాని మార్క్ సెంటిమెంట్‌ ను హాయ్ నాన్న సినిమాలో చూడబోతున్నట్లుగా ట్రైలర్ ను చూస్తే క్లారిటీ వచ్చేసింది. హీరోయిన్ గా మృణాల్ ఠాకూర్ నటించిన ఈ సినిమా ప్రమోషన్‌ కోసం నాని దాదాపు రెండు నెలలుగా కష్టపడుతూనే ఉన్నాడు.

తాజాగా నాని సోషల్ మీడియా మాధ్యమం ఎక్స్ లో అభిమానులతో చిట్ చాట్‌ చేశాడు. ఫ్యాన్స్ అడిగిన పలు ఆసక్తికర ప్రశ్నలకు సమాధానాలు ఇస్తూ సినిమాను ప్రమోట్‌ చేయడం జరిగింది. ఆ సమయంలో ఒక అభిమాని మహేష్ బాబుతో సినిమా చేసే అవకాశాలు ఉన్నాయా అంటూ ప్రశ్నించాడు.. అందుకు నాని సమాధానంగా.. చేస్తే బాగుంటుంది, త్రివిక్రమ్‌ గారు వింటున్నారా అంటూ మా కాంబోలో మూవీకి త్రివిక్రమ్‌ దర్శకత్వం వహిస్తే బాగుంటుంది అన్నట్లుగా నాని కామెంట్స్ చేశాడు.

ఇక ఎన్టీఆర్‌ తో నాని అన్ సీన్ పిక్‌ ను ఒక ఫ్యాన్‌ కోరగా వెంటనే ఒక అరుదైన క్లిక్ ను షేర్ చేసి ఎన్టీఆర్‌ ఫ్యాన్స్ తో పాటు అందరిని కూడా సర్ ప్రైజ్ చేశాడు. ఇంకా పలు ఆసక్తికర విషయాలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకున్న నాని 'హాయ్‌ నాన్న' సినిమా చేసినందుకు చాలా సంతృప్తిగా ఉంది అన్నట్లుగా కామెంట్‌ చేశాడు.