Begin typing your search above and press return to search.

నాని కోసం పవన్ హీరోయిన్..?

న్యాచురల్ నాని హాయ్ నాన్న తర్వాత వివేక్ ఆత్రేయ డైరెక్షన్ లో సినిమా చేస్తున్నాడని తెలిసిందే. డివివి దానయ్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు

By:  Tupaki Desk   |   30 Sep 2023 10:30 AM GMT
నాని కోసం పవన్ హీరోయిన్..?
X

న్యాచురల్ నాని హాయ్ నాన్న తర్వాత వివేక్ ఆత్రేయ డైరెక్షన్ లో సినిమా చేస్తున్నాడని తెలిసిందే. డివివి దానయ్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ఓజీ సినిమాను భారీ బడ్జెట్ తో రూపొందిస్తున్న దానయ్య నెక్స్ట్ నాని సినిమాకు కూడా హ్యూజ్ బడ్జెట్ కేటాయిస్తున్నట్టు తెలుస్తుంది. నాని వివేక్ ఆత్రేయ ఇద్దరు కలిసి అంటే సుందరానికీ సినిమా చేశారు. ఆ సినిమా కమర్షియల్ గా వర్క్ అవుట్ కాలేదు. వసూళ్ల లెక్కలు ఎలా ఉన్నా అంటే సుందరానికీ ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని కొందరు చెబుతుంటారు.

ఆ సినిమా తర్వాత నాని వివేక్ ఆత్రేయతో మరోసారి వస్తున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్ గా కోలీవుడ్ భామ ప్రియాంక అరుల్ మోహన్ ని ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది. నానితో గ్యాంగ్ లీడర్ సినిమా చేసిన ప్రియాంక మరోసారి నాని సరసన నటించే ఛాన్స్ అందుకుంది. వివేక్ నాని ఇద్దరు కలిసి మ్యాజిక్ క్రియేట్ చేయాలని చూస్తున్నారు. సినిమాలో ప్రియాంక పాత్రకి కూడా చాలా వెయిట్ ఉంటుందని తెలుస్తుంది.

ఆల్రెడీ ఓజీతో ప్రియాంక నెక్స్ట్ లెవెల్ కి వెళ్తుందని అంచనా వేస్తుండగా ఆ వెంటనే నాని సినిమాతో ప్రియాంక టాప్ రేంజ్ కి వెళ్లే ఛాన్స్ ఉంది. తమిళంలో తన మార్క్ నటనతో కెరీర్ సాగిస్తున్న ప్రియాంక మోహన్ తెలుగులో కూడా టాప్ హీరోయిన్ గా అవ్వాలని అనుకుంటుంది. పవన్ ఓజీ, నాని 31 సినిమాలతో కచ్చితంగా ఆమె తెలుగులో కూడా బిజీ హీరోయిన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

నాని శౌర్యువ్ డైరెక్షన్ లో వస్తున్న హాయ్ నాన్న డిసెంబర్ లో రిలీజ్ ఫిక్స్ చేశారు. ముందు 22న రిలీజ్ అనుకున్న ఈ సినిమా సలార్ పార్ట్ 1 వస్తుంది కాబట్టి రిలీజ్ డేట్ ముందుకు వచ్చే ఛాన్స్ ఉందని తెలుస్తుంది. హాయ్ నాన్న తర్వాత వివేక్ సినిమా ఆ తర్వాత మరో క్రేజీ ప్రాజెక్ట్ అనౌన్స్ మెంట్ ఉంటుందని ఫిల్మ్ నగర్ టాక్. దసరా తర్వాత నాని ఇమేజ్ డబుల్ అవగా తన సినిమాల ఇంపాక్ట్ కూడా నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతున్నాయని చెప్పొచ్చు. టైర్ 2 హీరోగా ఉన్న నాని దసరాతో 100 కోట్లు కొట్టి తన మాస్ స్టామినా చూపించాడు. అయితే రాబోతున్న సినిమాలు కూడా నాని కి ఈ రేంజ్ హిట్ అందిస్తాయా లేదా అన్నది చూడాలి.