తమ్ముడి సక్సెస్ చూసి గర్విస్తోన్న అక్క!
సినిమాల్లోకి వెళ్లాడంటే జీవితం నాశనం చేసుకుం టున్నాడు? అనే విమర్శలు ఎదుర్కున్నాడు. సొంత బంధువుల నుంచే ఆ రకమైన విమర్శలు ఎదుర్కున్నాడు.
By: Tupaki Desk | 10 May 2025 12:00 PM ISTనేచురల్ స్టార్ నాని ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఎదిగిన నటుడు. అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరీర్ ప్రారంభించి హీరో అయ్యాడు. ఇండస్ట్రీ లో పరిచయాలు...సహకారం లేకుండా ఇలా సక్సెస్ అవ్వడం అంటే చిన్న విషయం కాదు. ఎంతో కమిట్ మెంట్ ..డెడికేషన్..ఫ్యాషన్ ఉంటే తప్ప సాధ్యం కాదు. అందుకే చిరంజీవి, రవిజేత తర్వాత అలా సక్సెస్ అయిన నటుడు ఎవరు? అంటే అంతా నాని పేరు చెబుతారు.
హీరోగా సక్సస్ అయిన అనంతరం వాల్ పోస్టర్ అనే నిర్మాణ సంస్థను స్థాపంచి నిర్మాతగాను మారాడు. మూడు హిట్ సినిమాలు కూడా అందించాడు. ఇటీవలే రిలీజ్ అయిన 'హిట్ 3' కూడా సొంత నిర్మాణ సంస్థ నుంచి సాధించిన విజయం. అయితే నాని సినిమాల్లోకి వచ్చిన క్రమంలో చాలా విమర్శలు ఎదుర్కు న్నాడు. ఇంట్లో తల్లిదండ్రులు మీ అబ్బాయి ఏం చేస్తున్నాడు? అంటే సినిమాల్లో ప్రయత్ని స్తున్నాడు? అని గర్వంగా చెప్పుకోలేని పరిస్థితి. సినిమాల్లోకి వెళ్లాడంటే జీవితం నాశనం చేసుకుం టున్నాడు? అనే విమర్శలు ఎదుర్కున్నాడు. సొంత బంధువుల నుంచే ఆ రకమైన విమర్శలు ఎదుర్కున్నాడు.
అయినా వేటిని పట్టించుకోకుండా నాని అనుకున్నది సాధించాడు. ఈ విషయంలో నాని కుటుంబం నుంచి కూడా పెద్దగా సపోర్ట్ లేదు. ఇంట్లో సినిమాలు అంటే తల్లిందండ్రులు అక్కా అంతా వద్దన్నారు. సినిమాల్లో సర్వైవల్ అవ్వడం కష్టమని వారించారు. జీవితం నాశనం చేసుకుంటున్నావ్ అని వెనక్కి లాగే ప్రయత్నం చేసారని హిట్ 3 సక్సెస్ మీట్ లో భాగంగా సోదరి దీప్తి గంటా వ్యాఖ్యానించారు.
హిట్ 3 సినిమా లో సర్వై వ్ అవ్వలేవు అన్న డైలాగ్ ఉంటుంది.ఈ డైలాగ్ ను నాని కెరీర్ ఆరంభం నుంచి కాదు చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాడని సోదరి దీప్తి గుర్తు చేసారు. కానీ నేడు నాని సక్సెస్ అయిన తీరు చూసి ఎంతో గర్వ పడుతున్నాను. నా కుటుంబం కూడా ఎంతో గర్విస్తుంది. సర్వైవ్ అవ్వలేవ్ అన్న ప్రతీసారి తాను దాన్ని సాధించి చూపించాడన్నారు. దీప్తి గంటా ఇప్పుడు అదే వాల్ పోస్టర్ సంస్థలో ఓ సినిమాను స్వయంగా డైరెక్ట్ చేస్తున్నారు. అలా అప్పుడు వద్దు అన్న వాళ్లే నేడు నాని సంస్థలో పని చేయడం నానికి ఇంకెంత గర్వకారణం.